Paruchuri Gopalakrishna clapping on Apsara Rani
అరుణ్ ఆదిత్య, అప్సర రాణి జంటగా సినిమా ప్రారంభమయింది. కృష్ణబాబు దర్శకత్వంలో ఫిలింనగర్ దైవ సన్నిధానంలో జరిగింది. డైరెక్టర్ వి. సముద్ర తొలిషాట్‌కు గౌరవ దర్శకత్వం వహించగా, ప్రముఖ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ హీరోయిన్‌పై క్లాప్ కొట్టారు. తొలిషాట్‌కు సంగీత దర్శకురాలు యం యం శ్రీలేఖ కెమెరా స్విచ్చాన్ చేశారు. తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు, మాజీ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ కృష్ణబాబు మాట్లాడుతూ, ఏప్రిల్ 20 నుంచి 10 రోజుల పాటు షెడ్యూల్ చేస్తాం. సబ్జెక్టు బాగా వచ్చింది. అరుణ్ ఆదిత్య, అప్సర రాణి జంటగా చేస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా అందరికి నచ్చుతుంది. త్వరలోనే ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తాం..'' అని తెలిపారు.
అప్సరరాణి మాట్లాడుతూ... ''మంచి రోజు మంచి సినిమా ప్రారంభమైంది. సంతోషంగా ఉంది. నా కెరీర్‌కు ఈ సినిమా మంచి హెల్ప్ అవుతుందన్న నమ్మకంగా ఉంది. నాకు అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్‌కు, డైరెక్టర్‌కు ధన్యవాదాలు..'' అని తెలిపారు.
మ్యూజిక్ డైరెక్టర్ యం యం శ్రీలేఖ మాట్లాడుతూ.. తొలిషాట్‌కు కెమెరా స్విచ్చాన్ చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమా పాటలు చాలా బాగా వచ్చాయి. అందరిని ఆకట్టుకుంటాయి, స్క్రిప్ట్ అద్భుతంగా ఉంది. అందరికి నచ్చుతుంది..'' అని తెలిపారు.
ఎగ్జిక్యూటివ్ వెంకటేష్ మాట్లాడుతూ, కృష్ణబాబు స్క్రిప్టును అద్భుతంగా రెడీ చేశారు. ఈ ప్రాజెక్టును ఎంతో నిజాయితీగా, పర్ఫెక్ట్ సిద్ధం చేశారు. హీరో అరుణ్ ఆదిత్య ఈ ప్రాజెక్టుకు దొరికిన ఆణిముత్యం, హీరోయిన్ అప్సర రాణి కూడా నిబద్దతతో, అంకితభావంతో పని చేసే వ్యక్తి. ఆమె డెడికేషన్ ఈ సినిమాకు ఎంతో హెల్ప్ అవుతుంది అని తెలిపారు.