Webdunia - Bharat's app for daily news and videos

Install App

భయపెట్టేలా డైనమిక్ ప్రిన్స్ ప్రజ్వల్ దేవరాజ్ కరావళి టీజర్

డీవీ
మంగళవారం, 31 డిశెంబరు 2024 (16:26 IST)
Karvavali poster
ప్రస్తుతం ఆడియెన్స్‌ను ఆకట్టుకోవాలంటే ఇది వరకు చూడనటువంటి కంటెంట్‌ను, కాన్సెప్ట్‌ను చూపిస్తేనే ఆడియెన్స్ థియేటర్‌ వరకు వస్తున్నారు. ఈ క్రమంలో కన్నడలో డైనమిక్ ప్రిన్స్ ప్రజ్వల్ దేవరాజ్ ‘కరావళి’ అంటూ అందరినీ మెస్మరైజ్ చేసే కంటెంట్, కాన్సెప్ట్‌తో వస్తున్నారు.
 
‘అంబి నింగే వయసైతో’ తో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు గురుదత్త గనిగ ‘కరావళి’ మూవీని తెరకెక్కిస్తున్నారు. వీకే ఫిల్మ్స్ బ్యానర్‌తో కలిసి గురుదత్త గనిగ ఫిల్మ్స్‌ బ్యానర్ మీద గురుదత్త గనిగ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది వరకు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, ప్రోమో ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా రిలీజ్ చేసిన టీజర్ చూస్తే అందరూ ఫిదా అవ్వాల్సిందే. ఈ టీజర్‌లోనే గూస్ బంప్స్ మూమెంట్స్ ఎన్నో ఉన్నాయి.
 
మహిషాలకు, మానవులకు మధ్య జరిగే కాన్సెప్ట్‌లా ఈ టీజర్‌లో ఏదో కొత్త కథను చూపించారు. 'పిశాచి రాక' అంటూ వదిలిన ఈ టీజర్‌లోని యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్, ఆర్ఆర్ ఇలా అన్నీ కూడా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. కన్నడ ఇండస్ట్రీ నుంచి మరో డిఫరెంట్ కాన్సెప్ట్ రాబోతోందని ఆడియెన్స్ ఫిక్స్ అయ్యారు.
 
ఈ చిత్రానికి సచిన్ బస్రూర్ సంగీతం అందిస్తుండగా.. అభిమన్యు సదానందన్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాదిలో ఈ చిత్రం థియేటర్లోకి రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Netanyahu: డొనాల్డ్ ట్రంప్‌కు నెతన్యాహు కృతజ్ఞతలు.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా.. ఎవరు?

అమెరికా ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్.. ట్రంప్ ఆరంభించారు.. మేం అంతం చేస్తాం..!

మేనత్త కొడుకుతో భార్య వివాహేతర సంబంధం... ఇద్దరూ కలిసి భర్తను చంపేశారు..

భార్యకు ప్రియుడుతో పెళ్లి చేయించిన హరిశ్చంద్ర!!

ఏపీలో నేడు - రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments