Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డ్రీమ్ క్యాచర్ ట్రైలర్ చూశాక నన్ను అడివిశేష్, రానా తో పోలుస్తున్నారు : ప్రశాంత్ కృష్ణ

Prashanth Krishna, Achyasa Sinha, Sandeep Kakula

డీవీ

, శుక్రవారం, 27 డిశెంబరు 2024 (20:15 IST)
Prashanth Krishna, Achyasa Sinha, Sandeep Kakula
ప్రశాంత్ కృష్ణ, అనీషా ధామ, శ్రీనివాస్ రామిరెడ్డి, ఐశ్వర్య హోలక్కల్, తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘డ్రీమ్ క్యాచర్’. ఈ చిత్రాన్ని సీయెల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై దర్శకుడు సందీప్ కాకుల రూపొందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘డ్రీమ్ క్యాచర్’ సినిమా జనవరి 3న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.
 
ఈ కార్యక్రమంలో హీరో ప్రశాంత్ కృష్ణ మాట్లాడుతూ - నాలుగేళ్ల కిందట సందీప్ ‘డ్రీమ్ క్యాచర్’సినిమా ఆడిషన్ కోసం పిలిచాడు. ఇప్పుడు ఈ వేదిక మీద మేమంతా ఉన్నామంటే కారణంగా మా సందీప్. టీమ్ లోని ప్రతి ఒక్కరినీ కలుపుకుని వెళ్తూ ఎంతో ప్యాషన్ తో ఈ సినిమాను కంప్లీట్ చేశాడు.  సైకలాజికల్ థ్రిల్లర్ గా సరికొత్త ఎక్సిపీరియన్స్ ఈ సినిమా మీ అందరికీ ఇస్తుంది. ట్రైలర్ చూశాక నేను అడివిశేష్, రానా లా ఉన్నానంటూ కామెంట్స్ వస్తున్నాయి. వాళ్లు గొప్ప యాక్టర్స్, సెల్ఫ్ మేడ్ స్టార్స్. అలాంటి టాలెంటెడ్ ప్యాషనేట్ యాక్టర్స్ తో నన్ను పోల్చడం సంతోషంగా ఉంది. ‘డ్రీమ్ క్యాచర్’ మూవీ మిమ్మల్ని డెఫనెట్ గా ఆకట్టుకుంటుంది. అన్నారు.
 
డైరెక్టర్ సందీప్ కాకుల మాట్లాడుతూ - సినిమా చేయాలనేది నా డ్రీమ్. కలల మీద సినిమా చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో ఈ ‘డ్రీమ్ క్యాచర్’ మూవీ మొదలైంది. ఇన్ సెప్షన్ లాంటి హాలీవుడ్ మూవీస్ నాకు ఇన్సిపిరేషన్ గా నిలిచాయి. ఒక హాలీవుడ్ స్థాయి అటెంప్ట్ చేయాలని అనుకున్నాను. మనకున్న రిసోర్సెస్ లో మొత్తం హైదరాబాద్ లోనే సినిమా రూపొందించాను. ట్రైలర్, పోస్టర్స్ చూసి ఈ మూవీ ఎక్కడ షూటింగ్ చేశారని అడుగుతున్నారు. మేము ఎక్కడికీ వెళ్లలేదు. హైదరాబాద్ లోనే షూట్ చేశాం. కలల నేపథ్యంగా ఇలాంటి సినిమా ఇప్పటిదాకా తెలుగులో రాలేదని చెప్పగలను. గంటన్నర నిడివితో సినిమా ఉంటుంది. పాటలు ఫైట్స్ ఉండవు. అవి లేకుండా కేవలం కథ మీదనే మూవీ వెళ్తుంది. ఇది థియేటర్, ఓటీటీ కి వెళ్తుందా అని అనుకోలేదు.  ఒక మంచి మూవీ  చేస్తే ఎక్కడైనా ఆదరిస్తారని నమ్మాను. నా టీమ్ అంతా ఎంతో సపోర్ట్ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మేజర్ సిటీస్ లో ప్రమోషన్ చేస్తున్నాం. మాకున్న టైమ్ లో సినిమాను ఆడియెన్ కు రీచ్ చేయాలని ప్రయత్నిస్తున్నాం. జనవరి 3న ‘డ్రీమ్ క్యాచర్’సినిమాను థియేటర్స్ లో చూసి సపోర్ట్ చేయండి. అన్నారు.
 
మ్యూజిక్ చేసిన వెంకటేష్, సిద్ధార్థ్ కాకుల, యాక్టర్ నాగరాజు, యాక్టర్ శ్రీనివాస్ రామిరెడ్డి, యాక్ట్రెస్ అచ్యస సిన్హా మాట్లాడుతూ - ‘డ్రీమ్ క్యాచర్’ సినిమాను ఆసక్తికరంగా మా దర్శకుడు సందీప్ తెరకెక్కించాడు. ఆయన ప్రతి ఫ్రేమ్ ను డీటెయిల్డ్ గా తెరకెక్కించారు. ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఎడిటింగ్ లో అనేక వెర్షన్స్ చేశాడు. ఇలాంటి పర్పెక్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీని మీరంతా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా  అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్రిస్మస్ సెలవులను ఆస్వాదిస్తున్న సమంత.. వినాయక పూజ..?