Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఊరమాస్ దెయ్యంతో ఆటాడుకునే మెంటలిస్టు.. "రాజు గారి గది 2" ట్రైలర్

"ఆత్మను శస్త్రము ఛేదింపజాలదు.. అగ్ని దహింపజాలదు... ఆత్మ నాశనము లేనిది" అంటూ భగవద్గీతలోని శ్లోకంతో మొదలు పెడుతూ, 'రాజుగారి గది-2' థియేటరికల్ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ బుధవారం రిలీజ్ చేసింది.

Webdunia
బుధవారం, 20 సెప్టెంబరు 2017 (11:18 IST)
"ఆత్మను శస్త్రము ఛేదింపజాలదు.. అగ్ని దహింపజాలదు... ఆత్మ నాశనము లేనిది" అంటూ భగవద్గీతలోని శ్లోకంతో మొదలు పెడుతూ, 'రాజుగారి గది-2' థియేటరికల్ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ బుధవారం రిలీజ్ చేసింది. ఇందులో హీరో నాగార్జున మెంటలిస్టుగా, కళ్లల్లో చూస్తూ గుండెల్లో ఏమున్నదో చెప్పే మానసిక వైద్యుడిగా కనిపిస్తున్నాడు.
 
సాధారణ హారర్ సినిమాల్లో కనిపించే శబ్దాలు కూడా ఉన్నాయి. ఇక ఈ దెయ్యం మామూలుది కాదని, ఊరమాస్ దెయ్యమని, పిచ్చెక్కించేస్తోందని వెన్నెల కిశోర్ చెప్పటం, చేతిలో రుద్రాక్ష మాలతో నాగార్జున దాన్ని ఆటాడించే ప్రయత్నం చేయడం తెలుస్తోంది. 
 
ఓ అమ్మాయి ఆత్మ పగతో ఉందని, ప్రతీకారం కోరుతోందని నాగ్ చెప్పడం, ఆత్మ ఆకారాన్ని చిత్రిస్తే, దానంతట అదే మాయం కావడం వంటి దృశ్యాలతో ఈ ట్రైలర్ అదిరిపోయింది. ఇక తొలిభాగంలో ఉన్న ఫేమస్ డైలాగ్ 'బొమ్మాళీ నన్ను పెళ్లిచేసుకుంటావా?' అన్న మాటలు ఇందులోనూ ఉన్నాయి. 
 
కాగా, ఈ చిత్రం వచ్చే నెల 13వ తేదీన విడుదల కానుంది. సమంత కీలక పాత్రలో నటించింది. ఓంకార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పీవీపీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్, ఓంకార్ ఎంటర్‌టైన్మెంట్ నిర్మాణ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments