Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజినీకాంత్ -పెద్దన్న టీజర్‌ను ఆవిష్క‌రించిన వెంకటేష్

Webdunia
శనివారం, 23 అక్టోబరు 2021 (17:56 IST)
Nayana tara- Rajani
సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `అన్నాత్తె`.  తెలుగులో పెద్ద‌న్న పేరుతో రాబోతుంది. అన్నాత్తై సినిమా తెలుగు రైట్స్‌ను టాలీవుడ్‌ డిస్ట్రిబ్యూషన్ రంగంలో అగ్రగామి అయిన ఏషియన్ ఇన్ ఫ్రా ఎస్టేట్స్ ఎల్ఎల్‌పి సంస్థ సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నారాయణదాస్ నారంగ్, సురేష్ బాబు కలిసి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.  తాజాగా పెద్ద‌న్న టీజ‌ర్‌ను శ‌నివారంనాడు విక్టరీ వెంకటేష్ విడుద‌ల‌చేశారు.
 
ఈ టీజర్ తెలుగు ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ఇందులో మాస్ ప్రేక్షకులకు కావాల్సిన అంశాలు పుష్కలంగా ఉన్నాయి. డైలాగ్స్, యాక్షన్స్ సీక్వెన్స్, రజినీ మార్క్ స్టైల్‌తో రాబోతోన్న ‘పెద్దన్న’ టీజర్ సినిమాపై అంచనాల‌ను మ‌రింత‌ పెంచింది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా టీజర్ సైతం అందరినీ ఆకట్టుకుంటోంది. డి ఇమ్మాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందరినీ మెప్పించేలా ఉంది.
 
శివ దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రంలో రజనీకాంత్ సరసన నయనతార నటిస్తోంది. మీనా, కుష్బూ, కీర్తి సురేష్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఇమ్మాన్ సంగీతం అందిస్తుండ‌గా వెట్రి సినిమాటోగ్రఫర్‌గా, రూబెన్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. పెద్ద‌న్న సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 4న అత్యధిక‌ థియేటర్స్‌ల‌లో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments