లిఫ్ట్ రన్నింగ్‌లో వాటర్ బాటిల్‌తో నీళ్ళ తాగితే కుదుపుకు ఎదుటివారిమీద పడితే.. కామన్ నెస్స్ లేదా? అంటూ ఆ వ్యక్తి విసుక్కుంటాడు అరె.. సారీ..అంటూ చెప్పిన అనసూయను చీదరించుకుంటాడు. కట్ చేస్తే కొద్దిరోజులకు ఆ వ్యక్తితోపాటు గర్భిణీగా వున్న అనసూయ అదే లిఫ్ట్‌లో ఆఫీసు పని తర్వాత ఇంటికి వెళుతూ కిందకి దిగుతుండగా షార్క్ సర్కూట్ వల్ల ఆగిపోతుంది. సరిగ్గా అది లాక్‌డౌన్ టైం. మెకానిక్ రాడు. ఎంతోమంది వారిని రక్షించాలని ప్రయత్నిస్తారు. మరోవైపు గర్బిణీగావున్న అనసూయకు నొప్పులు వస్తాయి. ఆ తర్వాత ఏం జరిగింది? అనేది ఆసక్తికరంగా `థాంక్యూ బ్రదర్ సినిమా ట్రైలర్‌లో కనిపిస్తుంది. శుక్రవారమే విడుదలైంది.
అనసూయ భరద్వాజ్, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఈ చిత్రాన్ని రమేష్ రాపర్తి దర్శకత్వంలో మాగుంట శరత్ చంద్రా రెడ్డి నిర్మించారు. లాక్‌డౌన్ సెకండ్‌వేవ్ వల్ల థియేటర్‌లో విడుదలకు నోచుకోకపోవడంతో దర్శక నిర్మాతలు ఆహా ఓటీటీలో మే 7న విడుదల చేస్తున్నారు.
`థాంక్యూ బ్రదర్` చిత్ర ట్రైలర్‌ను స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్ విడుదల చేశారు. ఈ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచే కాదు.. రెబల్‌స్టార్ ప్రభాస్, సూపర్‌స్టార్ మహేశ్, వెర్సటైల్ యాక్టర్ రానా దగ్గుబాటి సహా నెటిజన్స్ నుంచి చాలా మంచి రస్పాన్స్ వచ్చింది. ఆసక్తి కరంగా ఉండే డ్రామా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఎగ్జయిటింగ్ క్లైమాక్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ సరైన పాళ్లలో చిత్రం రూపొందింది.