అది కరోనా సెకండ్ వేవ్‌కు ముందు రోజులు. హైరాబాద్‌లో జోరున వర్షం. మాదాపూర్‌లో షూటింగ్‌కు వెళ్ళాలి. షెడ్యూల్ ప్రకారం షూటింగ్‌కు హాజరుకావాలి. వెంటనే అంతా సిద్ధం చేసుకుని కారులో అనసూయ ప్రయాణం అయింది. అప్పటి వరకు తుంపరులుగా పడుతున్న వర్షం కొద్ది దూరం వెళ్ళేసరికి పెద్దదయింది. జోరుగా విరామం లేకుండా కురుస్తుంది. మరోవైపు గాలి వీస్తుంది. ఒక్కసారిగా సీన్ మారింది. మరికొద్ది నిముషాల్లో లొకేషన్‌కు చేరుకోవచ్చు. హమ్మయ్య! ఓ గాడ్.. అంటూ దేవుడికి థ్యాంక్స్ చెప్పింది. రెండు నిముషాల్లో లొకేషన్ వచ్చేస్తుంది. దూరంగా తన లొకేషన్ కనబడుతుంది.
ఇలా వుండగా షడెన్‌గా కారు ఆగిపోయింది. చూస్తే చుట్టూ నీళ్ళే. ఓ గోతిలో కారు ఇరుక్కుపోయింది. ఇంకేముంది అనసూయ కంగారు పడింది. మరోవైపు సినిమా యూనిట్ ఫోన్ చేస్తున్నారు. లిఫ్ట్ చేసి ఈ విషయం వారికి చెప్పింది. మొత్తానికి వారు వచ్చారు. ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన వ్యక్తులు వచ్చి కాలువలా వున్న ఆ నీటిలో జాగ్రత్తగా వెల్ళి అనసూయను బయటకు తీసుకువచ్చారు.
ఆ తర్వాత కారు ఎప్పటికో తీసుకువచ్చారు. ఇదంతా మర్చిపోలేని అనుభవం అంటూ అనసూయ తన షూటింగ్ ముచ్చట్లు చెప్పుకు వచ్చింది. ఇలా ఎప్పడూ జరగలేదు. అందుకే అంటుంటారు. ఎప్పుడు ఏం జరుగుతుందో? అని. థ్యాంక్ గాడ్ అంటూ మరోసారి దేవుడిని తలచుకుంది.
ఈ అనుభవాలన్ని అనసూయ జూమ్ మీటింగ్‌లో షేర్ చేసుకుంది. తను నటించిన సినిమా `థ్యాంక్యూ బ్రదర్`. విజయ్ అశ్విన్ కాంబినేషన్‌లో అనసూయ భరద్వాజ్ నటించింది. రమేష్ రాపర్తి దర్శకుడు. మాగుంట శరత్ చంద్ర రెడ్డి నిర్మాత. కరోనా టైంలో థియేటర్లు విడుదల ఆగిపోవడంతో అనుకున్న ప్రకారం విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ఓ నిర్ణయానికి వచ్చారు. మే 7న ఆహా ఓటీటీలో విడుదల కాబోతుంది.