Webdunia - Bharat's app for daily news and videos

Install App

కనెక్ట్ అయ్యే ట్రైలర్ గా నయనతార హారర్ థ్రిల్లర్

Webdunia
శుక్రవారం, 9 డిశెంబరు 2022 (17:04 IST)
nayanatra, anupam
నయనతార నాయికగా నటించిన హారర్ థ్రిల్లర్ "కనెక్ట్". ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్ పతాకంపై విఘ్నేష్ శివన్ నిర్మించారు. దర్శకుడు అశ్విన్‌ శరవణన్‌ ఈ చిత్రాన్ని రూపొందించారు. హారర్ థ్రిల్లర్ మూవీస్ రూపొందించడంలో దర్శకుడు అశ్విన్ శరవణన్ కు మంచి పేరుంది. నయనతార నాయికగా ఆయన రూపొందించిన "మయూరి" సినిమా తెలుగులో విజయాన్ని సాధించింది.  అలాగే తాప్సీ నాయికగా శరవణన్ తెరకెక్కించిన "గేమ్ ఓవర్" కూడా సూపర్ హిట్టయ్యింది. దీంతో "కనెక్ట్" సినిమాపై అంచనాలు ఏర్పడుతున్నాయి. ఈ సినిమాను గ్రాండ్ గా యూవీ క్రియేషన్స్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. 
 
తాజాగా "కనెక్ట్" సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. దేశంలో లాక్ డౌన్ విధించడానికి 24 గంటల ముందు అంటూ ట్రైలర్ బిగిన్ అయ్యింది. కుటుంబంతో సంతోషంగా ఉండే నయనతార జీవితం ఆమె కూతురు అమ్ముకు ప్రేతాత్మ ఆవహించడంతో ఆందోళనగా మారుతుంది. తానెంతో ప్రేమించే కూతురు విచిత్రంగా ప్రవర్తించడం, వింత శబ్దాలు చేయడంతో ఏం జరుగుతుందో నయనతారకు అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. ట్రైలర్ లో కనిపించి కొన్ని షాట్స్ భయపెడతాయి. దెయ్యాలు ఊరికే వెళ్లిపోవు అని చెప్పడం నయనతార తన కూతురును ఆత్మ నుంచి విడదీసేందుకు ఎంతగా శ్రమించాల్సివచ్చిందనేది చూపిస్తోంది. మొత్తంగా ఈ ట్రైలర్ ఇలా ఉంటే సినిమా ఎంత గూస్ బంప్స్ తెప్పిస్తుందో తెలిపింది.
 
ఈ చిత్రాన్ని ఈ నెల 22న తెలుగులో గ్రాండ్ గా విడుదల చేసేందుకు యూవీ క్రియేషన్స్ సంస్థ సన్నాహాలు చేస్తోంది. అనుపమ్‌ ఖేర్‌తోపాటు సత్యరాజ్‌, వినయ్‌ రాయ్‌, హనియ నఫిస కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి  సంగీతం - పృథ్వి చంద్రశేఖర్‌, సినిమాటోగ్రఫీ - మణికంఠన్ కృష్ణమాచారి, ఎడిటింగ్ - రిచర్డ్ కెవిన్, పీఆర్వో - జీఎస్కే మీడియా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

KCR: జీవితంలో తొలిసారి అమెరికాకు కేసీఆర్.. ఎందుకో తెలుసా?

Kabaddi : కబడ్డీ ఆడుతూ... 26 ఏళ్ల వ్యక్తి ఛాతి నొప్పితో కుప్పకూలిపోయాడు.. చివరికి?

జమిలి ఎన్నికల బిల్లు.. 2029లోనే ఎన్నికలు జరుగుతాయ్- చంద్రబాబు

స్కూలుకు వెళ్లే ఉపాధ్యాయుడిని కిడ్నాప్ చేసి కట్టేసి పెళ్లి చేసేసారు (video)

Anna Canteens: నగరాల్లో కాదు.. గ్రామాలకు చేరనున్న అన్న క్యాంటీన్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

లెమన్ వాటర్ ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments