Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నయనతారకు పుట్టినరోజు.. పార్ట్ టైమ్ మోడల్‌గా పనిచేసి లేడీ సూపర్ స్టార్!

Advertiesment
Nayanatara
, శుక్రవారం, 18 నవంబరు 2022 (13:05 IST)
దక్షిణాది లేడీ సూపర్ స్టార్ నయనతారకు పుట్టినరోజు. 1984లో 18, నవంబర్ పుట్టింది. కాలేజీలో చదువుతున్నప్పుడు నయనతార పార్ట్ టైమ్ మోడల్‌గా పనిచేసింది. మనస్సినక్కరే మలయాళ మూవీతో 2003లో యాక్టింగ్ కెరీర్‌ను స్టార్ట్ చేసిన నయన్ ఇరవై ఏళ్ళ సినీ కెరీర్‌లో 75 సినిమాలలో నటించింది. 
 
సౌత్‌లోని బిగ్గెస్ట్ సూపర్‌స్టార్‌లలో ఒకరిగా అగ్రస్థానానికి చేరుకున్న నటి నయనతార ఈ రోజు తన పుట్టినరోజును జరుపుకుంటుంది. లేడీ సూపర్ స్టార్ 38 ఏళ్లు పూర్తి చేసుకుంది. తన అద్భుతమైన నటనతో అభిమానుల్ని సంపాదించుకుంది. 
 
ప్రముఖ దర్శకుడు విఘ్నేశ్ శివన్‌తో ఏడేళ్ల పాటు డేటింగ్ చేశాక.. ఈ ఏడాది జూన్ 10న నయనతార వివాహం చేసుకుంది. పెళ్లైనా ఐదు నెలలకే ఈ జంట సరోగసి ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చారు. 
 
శ్రీరామరాజ్యంలో సీతాదేవిగా నయనతార నటనకుగాను ఈ చిత్రం ఉత్తమ నటితో సహా ఏడు అవార్డులను గెలుచుకుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీరెడ్డిలా మారిన సునీత బోయ.. గీతా ఆర్ట్స్ కార్యాలయం ఎదుట అర్థనగ్నంగా?