Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో రోషన్ 'పెళ్లిసందD' ట్రైలర్ రిలీజ్

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (13:05 IST)
సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా 'పెళ్లిసందD' నిర్మితమైంది. ఆర్కే ఫిల్మ్ అసోసియేట్, ఆర్కా మీడియా సంస్థలు సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శక పర్యవేక్షణలో గౌరీ రోణంకి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో తెలుగు తెరకి శ్రీలీల అనే యువతి హీరోయిన్‌గా పరిచయమవుతోంది. 
 
ఇంతకాలం తెరవెనుక పాత్రకే పరిమితమైన దర్శకుడు కె.రాఘవేంద్ర రావు ఈ మూవీలో ఒక ప్రత్యేకమైన పాత్రను పోషించారు. ఈ సినిమా ట్రైలర్‌ను సూపర్ స్టార్ మహేశ్ బాబు బుధవారం రిలీజ్ చేశారు.
 
కె.రాఘవేంద్రరావు తొలిసారిగా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేయడానికి చాలా సంతోషంగా ఉంది అంటూ, మహేశ్ ఈ సినిమా టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పాడు.
 
లవ్ .. రొమాన్స్ .. యాక్షన్ .. ఎమోషన్ సీన్స్‌పై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. రాజేంద్ర ప్రసాద్, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్, పోసాని, వెన్నెల కిషోర్ వంటి భారీ తారాగణం భారీ స్థాయిలో సందడి చేశారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి షాకిచ్చిన కోర్టు

జనసేన సంస్థాగత బలోపేతం కోసం త్రిశూల్ వ్యూహం : పవన్ కళ్యాణ్

బీహార్‌లో ఒక్క ఓటు కూడా చోరీ కానివ్వం : రాహుల్ గాంధీ

యూపీఎస్పీ అభ్యర్థుల కోసం ప్రతిభా సేతు పోర్టల్

ఏలూరు జిల్లాలో కానిస్టేబుల్‌ అదృశ్యం.. ఫోన్‌ సిగ్నల్‌ కట్‌!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments