Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న ఫైటర్ "లైగర్" (Trailer)

liger
Webdunia
గురువారం, 21 జులై 2022 (11:12 IST)
స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం "లైగర్" (సాలా క్రాస్ బీడ్). ఈ చిత్రం ట్రైలర్‌ను గురువారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. మెగాస్టార్​ చిరంజీవి, రెబల్​స్టార్​ ప్రభాస్​ సోషల్​మీడియా వేదికగా ట్రైలర్​ను విడుదల చేశారు. పవర్​ఫుల్​ డైలాగ్స్​, ఫైట్స్​తో ఈ ట్రైలర్​ మాస్​ ఆడియన్స్​ను ఆకట్టుకుంటోంది.
 
సెన్సేషనల్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన ఫుల్‌ లెంగ్త్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌‌గా తెరకెక్కింది. ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను గురువారం ఉదయం మెగాస్టార్‌ చిరంజీవి, రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ సోషల్‌మీడియా వేదికగా విడుదల చేశారు. 
 
యాక్షన్‌ సీక్వెన్స్‌లలో విజయ్‌ దేవరకొండ‌ చేసిన స్టంట్స్‌, ప్రముఖ బాక్సర్‌ మైక్‌టైసన్‌తో బాక్సింగ్‌ సన్నివేశాలు, అనన్యతో రొమాన్స్‌.. ఇలా ప్రతి సన్నివేశం మాస్‌ని మెప్పించేలా ఉంది. విజయ్ దేవరకొండ చెప్పే పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌ ఈలలు వేయిస్తున్నాయి.
 
కాగా, విజయ్‌ దేవరకొండ కెరీర్‌లోనే మొదటి పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ ఇది. మథర్‌ సెంటిమెంట్‌, కిక్‌ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. ఇందులో విజయ్‌కు తల్లిగా అలనాటి నటి రమ్యకృష్ణ కీలకపాత్ర పోషించారు. అనన్యపాండే కథానాయిక. పూరీ కనెక్ట్స్‌, ధర్మా ప్రొడెక్షన్స్‌ పతాకంపై ఛార్మి, కరణ్‌ జోహార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్‌ ప్రొడెక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఆగస్టు 25 ఈ సినిమా విడుదల కానుంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నెలకు రూ.లక్ష జీతం... పైసా కట్నం లేకుండా పెళ్లి.. భార్య చేతిలో తన్నులు తిన్న భర్త (Video)

డాక్టర్లు చేతులెత్తేశారు.. ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ ప్రాణం పోసింది!

పురుషులకూ గర్భ నిరోధక పిల్ - కొత్త పిల్‌ను అభివృద్ధి చేసిన అమెరికా

పలు దేశాలపై డోనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలు : భారత్ - చైనాలపై ఎంతంటే?

రాయచూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి పర్యావరణ ఆమోదం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments