Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లైగర్ ట్రైలర్‌కే 75 అడుగుల కటౌటా..?

Liger
, బుధవారం, 20 జులై 2022 (21:35 IST)
Liger
స్టార్ హీరోల ఫ్యాన్స్ కటౌట్ల వద్ద రాజీ పడరు. తాజాగా రౌడీ హీరోకు మాత్రం సినిమా రిలీజ్‌కు ముందే కటౌట్ పెట్టేశారు ఫ్యాన్స్. ఇప్పటికీ లైగర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాకముందే ఈ కటౌట్‌తో ఆ మూవీపై ప్రేక్షకుల్లో అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో అర్థమైపోయింది. తాజాగా పూరీ జగన్నాధ్‌లాంటి డ్యాషింగ్ డైరెక్టర్‌తో సినిమా చేసే ఛాన్స్ కొట్టేశాడు విజయ్ దేవరకొండ.
 
పూరీ, విజయ్ కాంబినేషన్‌లో వస్తున్న మొదటి చిత్రమే 'లైగర్'. ఈ మూవీ ఆగస్ట్ 25న విడుదల కానుంది. ఇప్పటికే లైగర్ టీజర్‌తో తనలోని ఫైర్‌ను చూపించిన విజయ్.. ఇప్పుడు ట్రైలర్ లాంచ్‌కు సిద్ధమవుతున్నాడు. 
 
అయితే ఈ ట్రైలర్ లాంచ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్‌లో 75 అడుగుల విజయ్ కటౌట్‌ను పెట్టారు ఫ్యాన్స్. కనీసం ట్రైలర్ కూడా విడుదల కాని ఒక మూవీకి ఈ రేంజ్‌లో రెస్పాన్స్ రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నీకు దేవుడు సక్సెస్ అండ్ హెల్త్ ఇవ్వాలని కోరుకుంటున్నాను.. ప్రగతి