Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొర‌టాల శివ‌గారికి పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను : ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి

డీవీ
గురువారం, 2 మే 2024 (16:10 IST)
Koratala Shiva, SS Rajamouli, Satyadev and others
‘‘‘కృష్ణ‌మ్మ‌’ మూవీతో స‌మ‌ర్ప‌కుడిగా మారుతున్న కొర‌టాల శివ‌గారికి మ‌న‌స్ఫూర్తిగా అభినంద‌న‌లు తెలియజేస్తున్నాను. ఆయ‌న ఈ సినిమాను ప్రెజెంట్ చేస్తున్నారంటే అంద‌రికీ స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ ఉంటుంది. శివ‌గారికి ఈ సినిమా పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను.- అని డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి అన్నారు.
 
స‌త్య‌దేవ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం ‘కృష్ణ‌మ్మ‌’. వి.వి.గోపాలకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మలపాటి ఈ మూవీని నిర్మించారు. ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ సినిమాను మే 10న భారీ ఎత్తున‌ విడుదల చేస్తున్నాయి. ఈ మూవీ ప్రీ రిలీజ్ హైద‌రాబాద్‌లో జరిగింది. ఈ కార్య‌క్ర‌మానికి పాన్ ఇండియా డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి, స్టార్ డైరెక్ట‌ర్స్‌ కొర‌టాల శివ‌, అనీల్ రావిపూడి, గోపీచంద్ మ‌లినేని ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు. 
 
రాజమౌళి తెలుపూతూ,  డైరెక్ట‌ర్ గోపాల‌కృష్ణ  టీజ‌ర్‌, ట్రైల‌ర్ల‌లో తక్కువ షాట్స్‌లోనే చాలా ఎట్రాక్టివ్‌గా, సినిమాను థియేట‌ర్స్ చూడాల‌నిపించేలా చేశాడు. త‌న‌కు ఆల్ ది బెస్ట్‌. స‌త్య‌దేవ్ న‌ట‌న‌లో ఏ ఎమోష‌న్‌ను అయినా ప‌ల‌కించ‌గ‌ల‌డు. అలాంటి వారు చాలా త‌క్కువ‌గా ఉంటారు. త‌న‌కు స‌రైన ఓ సినిమా ప‌డితే స్టార్‌గా ఎదుగుతారు. ‘కృష్ణ‌మ్మ‌’తో త‌ను స్టార్ అవుతాడ‌ని భావిస్తున్నాను. స‌త్య‌దేవ్ స‌హా టీమ్‌కు ఆల్ ది బెస్ట్‌. కాల‌భైర‌వ క‌థ వినేట‌ప్పుడే క‌థ‌లోని మెయిన్ ఎమోష‌న్ ఏంటి.. నేనేం చేయాల‌ని ఆలోచిస్తాడు. త‌ను అలాగే ఇన్‌టెన్సిటీతో మ్యూజిక్ ఇస్తాడు. టీజ‌ర్‌, ట్రైల‌ర్‌కు త‌ను ఇచ్చిన మ్యూజిక్ వింటుంటే గ‌ర్వంగా అనిపించింది. ఎంటైర్ టీమ్‌కు ఆల్ ది బెస్ట్‌’’ అన్నారు.
 
మ్యూజిక్ డైరెక్ట‌ర్ కాల‌భైర‌వ మాట్లాడుతూ ‘‘‘కృష్ణ‌మ్మ‌’ సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నాం. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ నుంచి నేను సినిమా చూస్తున్నాను. కొన్ని స‌న్నివేశాలైతే హాంట్ చేస్తూనే ఉన్నాయి. నేను ఎంజాయ్ చేసిన‌ట్లే ఈ సినిమాను అంద‌రూ ఎంజాయ్ చేస్తార‌నిపిస్తోంది. మే 10న మూవీ రిలీజ్ కానుంది. మా డైరెక్ట‌ర్ వి.వి.గోపాల‌కృష్ణ‌గారు గురించి చెప్పాలంటే ఆయ‌న‌కు విజ‌యవాడ‌తో మంచు అనుబంధం ఉంది. ‘కృష్ణ‌మ్మ‌’తో ప్రేక్ష‌కుల‌ను ఓ కొత్త ప్ర‌పంచంలోకి తీసుకెళ్లారు. స‌త్య‌దేవ్‌గారు అద్భుతంగా న‌టించారు. ఆయ‌న‌కు నేను అభిమానిగా మారిపోయాను. అన్నారు.
 
హీరోయిన్ అతీరా రాజ్‌ మాట్లాడుతూ ‘‘మా టీమ్‌ను స‌పోర్ట్ చేయ‌టానికి వ‌చ్చిన రాజ‌మౌళి, కొర‌టాల శివ‌, గోపీచంద్‌, అనీల్ రావిపూడిగారికి థాంక్స్‌. కృష్ణ‌మ్మ‌’ నా తొలి తెలుగు సినిమా. రిలీజ్ ఎప్పుడు అవుతుందా అని ఎగ్జ‌యిట్‌మెంట్‌తో వెయిట్ చేస్తున్నాను. నాకు అవ‌కాశం ఇచ్చిన గోపాల‌కృష్ణ‌గారికి, నిర్మాత కృష్ణ‌గారికి, కొర‌టాల శివ‌గారికి థాంక్స్‌. కాల భైర‌వ అద్భుత‌మైన మ్యూజిక్‌ను అందించారు. మా సినిమాను విడుద‌ల చేస్తున్న మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ప్రైమ్ షో ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ వారికి థాంక్స్‌. హీరో స‌త్య‌దేవ్‌గారు మాలాంటి న‌టీన‌టులకు ఇన్‌స్పిరేష‌న్‌. ఎంటైర్ టీమ్‌కు థాంక్స్‌’’ అన్నారు.
 
హీరోయిన్ అర్చనా అయ్యర్ మాట్లాడుతూ ‘‘‘కృష్ణ‌మ్మ‌’కు స‌పోర్ట్ చేయ‌టానికి వ‌చ్చిన లెజెండ్రీ డైరెక్ట‌ర్స్‌కి థాంక్స్‌. గోపాల్ గారు లేక‌పోతే నా ప‌ద్మ అనే క్యారెక్ట‌ర్‌కి అర్థం ఉండేది. ఎంతో ఇష్ట‌ప‌డి క‌ష్ట‌ప‌డి చేసిన సినిమా. మే 10న రాబోతున్న మా సినిమాను ప్రేక్ష‌కులు చూసి ఆశీర్వ‌దించాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.
 
బి.వి.ఎస్‌.ర‌వి మాట్లాడుతూ ‘‘‘కృష్ణ‌మ్మ‌’ సినిమా కథేంటో నాకు తెలుసు. నిజాయతీ ఉన్న క‌థ‌. నిజంగా జ‌రిగిందేమో అనిపించేలా ఉంటుంది. న‌టీన‌టుల కంటే పాత్ర‌లే మ‌న‌కు క‌నిపిస్తాయి. సినిమాలో ఓ చిన్న పెయిన్ ఉంటుంది. స‌త్య‌దేవ్ ఎమోష‌న్స్‌ను చ‌క్క‌గా ప‌లికించే న‌టుడు. అరుణాచ‌ల క్రియేష‌న్స్ నాకెంతో ద‌గ్గ‌రైన సంస్థ‌. ఈ బ్యాన‌ర్‌లో నేను జవాన్ సినిమాను చేశాను. కృష్ణ‌గారు మంచి నిర్మాత‌. డైరెక్ట‌ర్ గోపాల కృష్ణ సినిమాను బాగా తెర‌కెక్కించార‌ని ట్రైల‌ర్ చూస్తుంటే తెలుస్తుంది. కాల‌భైర‌వ మంచి సంగీతాన్ని అందిస్తున్నారు. ఎంటైర్ టీమ్‌కు అభినంద‌న‌లు’’ అన్నారు.
 
చిత్ర ద‌ర్శ‌కుడు వి.వి.గోపాల‌కృష్ణ మాట్లాడుతూ ‘‘కథలో ఓ నిజాయతీ ఉంది. అలాగే తెర‌కెక్కించేసెయ్ వెనుక నేనుంటాను. ఆయ‌న వ‌ల్లే సినిమా ఇక్క‌డి వ‌ర‌కు వ‌చ్చింది. మే 10 త‌ర్వాత సినిమా చూస్తే టైటిల్ ఏంటో అర్థ‌మ‌వుతుంది.  సినిమా చూసి ఆశీర్వ‌దించండి’’ అన్నారు.
 
మైత్రీ మూవీ మేక‌ర్స్ య‌ల‌మంచిలి ర‌వి శంక‌ర్ మాట్లాడుతూ ‘‘‘కృష్ణ‌మ్మ‌’ టైటిల్ వినగానే బాగా కనెక్ట్ అయ్యింది. ట్రైలర్ చూస్తుంటే హత్తుకుంది. కొరటాల శివగారు కథను నిజాయతీగా చెబుతారు. ఆయ‌న స‌మ‌ర్ప‌ణ‌లో ఈ సినిమా వ‌స్తుండ‌టం ఆనందంగా ఉంది. పుష్ప‌లో అల్లు అర్జున్ న‌ట‌న‌ ఎంత ఇన్‌టెన్స్‌గా ఉంటుందో..‘కృష్ణ‌మ్మ‌’ సినిమాలో స‌త్య‌దేవ్‌గారి న‌ట‌న‌లో అంతే ఇన్‌టెన్సిటీ ఉంటుంది. డైరెక్ట‌ర్‌గారు సినిమాను బ్ర‌హ్మాండంగా తెర‌కెక్కించారు. మే 10న ‘కృష్ణ‌మ్మ‌’ను చూసి భ‌లే సినిమా చూశామ‌ని అంద‌రూ అనుకుంటారు.. నా మాట‌ల‌ను గుర్తుపెట్టుకోండి’’ అన్నారు.
 
హీరో స‌త్య‌దేవ్ మాట్లాడుతూ ‘‘రాజమౌళిగారు, అనీల్ అన్న, గోపీ అన్న, శివగారు చూపించిన ప్రేమాభిమానాలు నాకు కొండంత ధైర్యాన్నిచ్చింది. రెండు వారాలుగా ఈ సినిమా ప‌రంగా అన్నీ పాజిటివ్ విషయాల‌నే వింటున్నాను. న‌న్ను ఎప్ప‌టిక‌ప్పుడు ఇన్‌స్పైర్ చేసేది నా అభిమానులు, సినీ ప్రేక్ష‌కులే. ‘కృష్ణ‌మ్మ‌’ సినిమా గురించి అంద‌రం మాట్లాడుకునేలా ఉంటుంది. కొర‌టాల‌గారు సినిమాను ఓకే చేయ‌గానే సినిమా స‌గం స‌క్సెస్ అనుకున్నాం. క‌థ న‌చ్చ‌గానే ఈ సినిమాకు ఆయ‌న స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రించ‌టానికి రెడీ అయ్యారు. ఈ జ‌ర్నీలో ఆయ‌న స‌పోర్ట్ మ‌ర‌చిపోలేం. మా కృష్ణ‌గారు వెనుక‌డుగు వేయ‌కుండా సినిమాను నిర్మించారు. మా డైరెక్ట‌ర్ గోపాల‌కృష్ణ‌గారు సినిమాను చ‌క్క‌గా తెర‌కెక్కించారు. క్రికెట్‌కు స‌చిన్ ఎలాగో మ‌న ఇండియ‌న్ సినిమాకు రాజ‌మౌళిగారు అలా. మ‌నం గొప్ప‌గా క‌ల‌లు క‌నొచ్చు అని ఆయ‌న రుజువు చేశారు. ఆయ‌న్ని చూసి మ‌నం గ‌ర్వంగా ఫీల్ అవుతున్నాం. ‘కృష్ణ‌మ్మ‌’ సినిమా విష‌యానికి వ‌స్తే.. మా డైరెక్ట‌ర్‌గారు సినిమాను రెండు గంట‌ల ప‌ది నిమిషాలుగా తెర‌కెక్కించారు. క‌థ విన‌గానే ఇది వంద కోట్ల్ కంటెంట్ ఉన్న సినిమా అని అనుకున్నాను. అదే ఆయ‌న‌కు చెప్పాను. ఈ సినిమాలో యాక్ట్ చేసిన ల‌క్ష్మ‌ణ్‌, కృష్ణ నా ఫ్రెండ్స్‌గా అద్భుతంగా న‌టించారు. అతీర, అర్చ‌న‌, నంద‌గోపాల్ ఇలా అంద‌రూ అద్భుతంగా న‌టించారు. కాల భైర‌వ మ్యూజిక్ అద‌ర‌గొట్టేశాడు. సినిమా రిలీజ్ త‌ర్వాత పాట‌లు ఇంకా పెద్ద హిట్ అవుతాయి. మా సినిమాటోగ్రాఫ‌ర్ స‌న్నీకి థాంక్స్‌. కృష్ణ‌న‌ది ఎన్ని మ‌లుపులు తిరిగి దాని గ‌మ్య‌స్థానం చేరుకుంటుందో మా క‌థ‌లోనూ అన్నీ మ‌లుపులుంటాయి. అలాంటి ర‌స్టిక్ పాత్ర‌లు, ఎమోష‌న్స్‌ను మా డైరెక్ట‌ర్‌గారు క్రియేట్ చేశారు. ఆయ‌న‌కు రుణ‌ప‌డి ఉంటాను. మా సినిమాను రిలీజ్ చేస్తున్నమైత్రీ మూవీ మేక‌ర్స్‌, ప్రైమ్ షోఎంట‌ర్‌టైన్‌మెంట్స్ వారికి థాంక్స్‌. మే 10న సినిమాను అంద‌రూ త‌ప్ప‌కుండా చూడండి’’ అన్నారు.
 
డైరెక్టర్ గోపీచంద్ మలినేని మాట్లాడుతూ ‘‘కొరటాల శివగారి సినిమాలు పద్ధతిగా, మంచి కంటెంట్‌తో ఉంటాయి. అలాగే ఆయ‌న స‌మ‌ర్ప‌ణ‌లో వ‌స్తున్న ‘కృష్ణ‌మ్మ‌’లో కూడా మంచి కంటెంట్ ఉంది. ఈ మూవీ నిర్మాత కృష్ణ‌గారితో మంచి అనుబంధం ఉండేది. సినిమా అంటే మంచి ప్యాష‌న్ ఉన్న వ్య‌క్తి. స‌త్య‌దేవ్ న‌ట‌న చాలా స‌హ‌జంగా ఉంది. ఇన్‌టెన్స్ యాక్టింగ్‌తో మెప్పిస్తారు. ట్రైల‌ర్ చూస్తుంటే ప్ర‌తీ క్యారెక్ట‌ర్‌లో రియలిస్టిక్ అప్రోచ్ క‌నిపిస్తుంది. నేను కాల‌భైర‌వ వాయిస్‌కి పెద్ద అభిమానిని. ఈ సినిమాకు త‌న మ్యూజిక్ ఇచ్చారు. పాట‌లే కాదు.. సాలిడ్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు. మే 10న రిలీజ్ అవుతోన్న ఈ సినిమా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.
 
డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడి మాట్లాడుతూ ‘‘‘కృష్ణ‌మ్మ‌’ ట్రైలర్ ఎక్స్‌ట్రార్డిన‌రీగా ఉంది. స‌త్య‌దేవ్, డైరెక్ట‌ర్ గోపాల‌కృష్ణ‌, నిర్మాత కృష్ణ కొమ్మ‌ల‌పాటిగారు స‌హా ఎంటైర్ టీమ్‌కు కంగ్రాట్స్‌. కాల భైర‌వ మ్యూజిక్‌లో చాలా ఇంపాక్ట్ కనిపిస్తోంది. స‌త్య‌దేవ్‌కి సినిమా అంటే చాలా రెస్పెక్ట్. మంచి పాత్ర‌లు చేస్తూ హీరోగా త‌న‌దైన గుర్తింపును సంపాదించుకున్నారు. నిర్మాత కృష్ణ‌గారికి అభినంద‌న‌లు. ఈ సినిమా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను. కొర‌టాల శివ‌గారు స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్న‘కృష్ణ‌మ్మ‌’ సినిమా మ‌రిన్ని సినిమాల‌ను ముందుండి చేసేంత విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నాను. ‘కృష్ణ‌మ్మ‌’ సినిమా మే 10న సినిమా రిలీజ్ అవుతుంది. చూసి అంద‌రూ ఆశీర్వదించాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.
 
చిత్ర స‌మ‌ర్ప‌కుడు కొర‌టాల శివ మాట్లాడుతూ ‘‘రాజమౌళిగారికి స్పెషల్ థాంక్స్. గోపీ, అనీల్‌కి థాంక్స్‌. ‘కృష్ణ‌మ్మ‌’ సినిమా క‌థ విన‌మ‌ని నిర్మాత కృష్ణ చెప్ప‌గానే డైరెక్ట‌ర్ గోపాల‌కృష్ణ వ‌చ్చి క‌థ చెప్పాడు. విన‌గానే ఈ సినిమాలో నేను భాగం అవుతాన‌ని చెప్పాను. అలా నేను ఈ సినిమాకు స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రించాను. డైరెక్ట‌ర్ గోపాల‌కృష్ణ సినిమాను చ‌క్క‌గా రాసుకున్నాడు. షూటింగ్ పూర్తి చేసి త‌నే సినిమా చూపించాడు. మంచి టీమ్‌.. మంచి ఎఫ‌ర్ట్‌తో సినిమా చేశారు. స‌త్య‌దేవ్‌.. నేను చూసిన మంచి న‌టుల్లో త‌నొక‌డు. ఎంత పెద్ద డైలాగ్ అయినా, సీన్ అయినా సుల‌భంగా చేసేయ‌గ‌ల‌డు. ‘కృష్ణ‌మ్మ‌’తో త‌ను మ‌రింత మంచి స్థానాన్ని చేరుకుంటాడ‌ని ఆశిస్తున్నాను. ఇత‌ర న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్‌కు అభినంద‌న‌లు. కాల భైర‌వ చాలా మంచి సంగీతాన్ని ఇచ్చాడు. ప్ర‌తి పాట సిట్యువేష‌న్‌ను బ‌ట్టి గొప్ప మ్యూజిక్ ఇచ్చాడు. త‌న‌కు ఆల్ ది బెస్ట్‌. నిర్మాత కృష్ణ‌తో ఎప్ప‌టి నుంచో మంచి ప‌రిచ‌యం ఉంది. ఈ సినిమాతో త‌న‌కు మంచి విజ‌యం రావాల‌ని కోరుకుంటున్నాను. మే 10న రిలీజ్ కాబోతున్న ‘కృష్ణ‌మ్మ‌’కు పెద్ద విజ‌యాన్ని అందిస్తార‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుజరాత్ గిఫ్ట్ సిటీ తరహాలో అమరావతి... తొలి పైప్ గ్యాస్ సిటీగా...

మరింతగా బలపడిన అల్పపీడనం.. నేడు ఉత్తరాంధ్రలో అతి భారీ వర్షాలు

వృద్ధుడిని వెయిట్ చేయించిన ఉద్యోగులు.. నిల్చునే ఉండాలని సీఈఓ పనిష్​మెంట్... (Video)

వన్ నేషన్-వన్ ఎలక్షన్: దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఎంత ఖర్చవుతుందో తెలుసా

కేటీఆర్‌ను కలవలేదు.. కనీసం ఫేస్ టు ఫేస్ చూడలేదు.. దువ్వాడ మాధురి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments