Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జపాన్‌లో భూకంపం.. తృటిలో తప్పించుకున్న రాజమౌళి!!!

rajamouli

ఠాగూర్

, గురువారం, 21 మార్చి 2024 (12:45 IST)
జపాన్ దేశాన్ని మరోమారు భారీ భూకంపం కుదిపేసింది. గురువారం ఉదయం రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతో ఈ భూప్రకంపనలు నమోదయ్యాయి. వీటి నుంచి దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తృటిలో తప్పించుకున్నారు. ఈ భూకంపం సంభవించినపుడు రాజమౌళి, ఆయన కుమారుడు కార్తికేయ, ఇతర కుటుంబ సభ్యులు ఓ భవనంలోని 28వ అంతస్తులో ఉన్నారు. ఈ భూకంపం వల్ల తాము తీవ్ర భయాందోళనకు గురైనట్టు కార్తికేయ ట్వీట్ చేశారు. 
 
ఆర్ఆర్ఆర్ చిత్రం స్పెషల్ స్క్రీనింగ్‌ కోసం దర్శకుడు రాజమౌళి, ఆయన తనయుడు కార్తికేయ, నిర్మాత శోభు యార్లగడ్డలు జపాన్‌లో ఉంటున్నారు. వారు బస చేసిన ప్రాంతంలో భూకంపం సంభవించింది. భూప్రకంపనల వల్ల తాను భయాందోళనలకు గురయ్యానని కార్తికేయ ట్వీట్‌ చేశారు.
 
భూకంపం అలర్ట్‌కు సంబంధించిన ఫొటో షేర్‌ చేసిన ఆయన.. 'జపాన్‌లో ఇప్పుడే భూకంపం వచ్చింది. నేను 28వ ఫ్లోర్‌లో ఉన్నా. భూమి కంపించడం చూసి కొద్ది క్షణాల్లో భూకంపమని అర్థమైంది. నేను చాలా భయపడ్డా. కానీ, నా చుట్టూ ఉన్న జపాన్‌వాసులు ఎలాంటి కంగారు లేకుండా.. ఏదో వర్షం పడుతున్నట్లు ఏమాత్రం చలించలేదు' అని రాసుకొచ్చారు.  ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు.. 'స్క్రీనింగ్‌ అయిపోయింది కదా. ఇండియా వచ్చేయండి', 'అక్కడ అంతా బాగానే ఉందా' అని కామెంట్స్‌ చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కవల పిల్లలకు జన్మనివ్వనున్న హీరోయిన్ అమలాపాల్!!