Brahmaji, Shatru, Master Mahendran, Amardeep Challapalli and others
బ్రహ్మాజీ, శత్రు, మాస్టర్ మహేంద్రన్ కీలక పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ 'కర్మణ్యేవాదికారస్తే'. క్రైం ఇన్వెస్టిగేషన్ జానర్ లో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ గురువారం రిలీజైంది. 2.38 నిమిషాలు ఉన్న ఈ ట్రైలర్లో ఫైట్స్, గన్ ఫైరింగ్, రొమాన్స్, థ్రిలింగ్ వంటి సన్నివేశాలు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. మూవీ ట్రైలర్లో బీజీఎమ్ హైలెట్గా నిలుస్తోంది.
క్రైమ్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ చిత్రాన్ని డి ఎస్ ఎస్ దుర్గా ప్రసాద్ గారు ఉషస్విని ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అమర్ దీప్ చల్లపల్లి డైరెక్టర్ గా చేస్తున్నారు.ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేశారు.ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ ప్రభు అతిథిగా హాజరై టీమ్ కి విషెస్ చెప్పారు.
హీరో మాస్టర్ మహేంద్ర మాట్లాడుతూ, ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా వుంటుంది.ఫస్ట్ హాఫ్ ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, సెకండ్ హాఫ్ లో ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది.నాకు సినిమా తప్ప ఇంకా ఏమి తెలియదు. నాలాగా సినిమానే ప్రపంచం అనుకునే వాళ్ళకి ఇలాంటి ఒక డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ దొరకడం చాలా కష్టం. సినిమా మీద వున్న నమ్మకంతో ప్రొడ్యూసర్ ఈ సినిమాను ముందుకు తీసుకువెళ్లారు. అన్నారు.
బెనర్జీ మాట్లాడుతూ, ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమాలో ఇన్ డెప్త్ స్టోరీ ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ సినిమాలో కొత్త వాళ్ళు చేశారా లేదా పాత వాళ్ళు చేశారా అనేది కాకుండా ఎంత బాగా చేశారు అనేది ఈ సినిమాలో కనిపిస్తుంది. సినీ ఇండస్ట్రీలో కొత్త జనరేషన్ వాళ్లు చాలా చక్కగా ప్రోగ్రెసివ్ గా చేస్తున్నారు. కరోనా తరువాత సినిమాలు థియేటర్ వరకు వెళ్లడం కష్టమైపోతుంది అలానే సినిమాలు చచ్చిపోతున్నాయి. కొన్ని సినిమాలు మాత్రం చిన్నవి పెద్దవి అన్న తేడా లేకుండా మంచి సక్సెస్ ని అందుకుంటున్నాయి. ఈ సినిమా కూడా అలాగే సక్సెస్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్." అని అన్నారు
బ్రహ్మాజీ మాట్లాడుతూ, ఈ సినిమా కాన్సెప్ట్ చాలా బాగుంటుంది. శత్రువులు ఎక్కడో ఉండరు మన చుట్టూనే మన ఇంట్లోనే ఉంటారు అని ఒక చక్కటి కాన్సెప్ట్ తో డైరెక్టర్ గారు ఈ సినిమాని మన ముందుకు తీసుకువస్తున్నారు. ఈ సినిమా స్టార్ట్ చేసిన కొత్తలో సినిమా మీద ఒపీనియన్ చాలా తక్కువగా ఉండేది కానీ రోజురోజుకీ షూటింగ్ టైంలో ఈ కంటెంట్ చూస్తే చాలా ఆశ్చర్యం కలిగింది. కంటెంట్ ఏంటి ఇంత బాగుంది అనిపించింది. ఇందులో చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇకపోతే క్లైమాక్స్ చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఇద్దరు కూడా ఎంతో ఫ్యాషన్ ఉన్న వ్యక్తులు. ఈ మధ్యకాలంలో కంటెంట్ వున్న చిన్న సినిమాలే ఎక్కువగా ఆడుతున్నాయి. కాబట్టి ఈ సినిమా కూడా మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. జైహింద్.." అని అన్నారు
డైరెక్టర్ మాట్లాడుతూ, ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ కు కూడా ఎంతో ప్రత్యేకత ఉంటుంది. ఇందులో నటించిన ప్రతి ఒక్కరికి కూడా చాలా ధన్యవాదాలు. నామీద నమ్మకంతో ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గా మారి ఇంతమంచి కంటెంట్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న ప్రొడ్యూసర్ గారికి కూడా నా ధన్యవాదాలు. దయచేసి అందరూ థియేటర్ కి వెళ్లి ఈ సినిమాని చూడవలసిందిగా కోరుతున్నాను. మంచి కంటెంట్ ఉన్న సినిమాని మీ ముందుకు తీసుకు వస్తున్నాం అందరూ సపోర్ట్ చేస్తారు అని భావిస్తున్నాను."అని అన్నారు.
ప్రొడ్యూసర్ మాట్లాడుతూ, ఒక చిన్న సినిమాగా కాకుండా ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాగా మీరు ఆదరిస్తారు అని నేను గట్టిగా నమ్ముతున్నాను. థాంక్యూ.."అని అన్నారు.