Webdunia - Bharat's app for daily news and videos

Install App

కామెడీ, యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలతో గోపీచంద్ విశ్వం టీజర్ వచ్చేసింది

డీవీ
మంగళవారం, 3 సెప్టెంబరు 2024 (17:26 IST)
Visaw- gopichand
హీరో గోపీచంద్ తో  శ్రీను వైట్ల రూపొందిస్తున్న స్టైలిష్ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'విశ్వం'. ప్రమోషన్స్‌ను కిక్ స్టార్ట్ చేస్తూ మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు.
 
టీజర్ నరేష్ వాయిస్‌ ఓవర్‌తో ప్రారంభమైయింది. గోపీచంద్, కావ్యా థాపర్ పాత్రల పరిచయం, వారి క్యారెక్టర్స్ లో కామెడీ స్పార్క్‌ ఆకట్టుకున్నాయి. టీజర్ లో ప్రముఖ నటీనటులతో కామెడిక్ సీన్స్ హిలేరియస్ గా వున్నాయి, టీజర్ చివరి భాగంలో యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ అదిరిపోయాయి.
 
ఎంటర్‌టైన్‌మెంట్,యాక్షన్‌ని ఎఫెక్టివ్‌గా బ్యాలెన్స్ చేస్తూ హైలీ ఎంటర్‌టైనింగ్ టీజర్ ని ప్రజెంట్ చేశారు శ్రీను వైట్ల. డైలాగ్‌లు, కామెడీ, యాక్షన్‌ బ్లెండ్ మంచి కమర్షియల్ ఔటింగ్ ని ప్రామిస్ చేస్తున్నాయి.
 
గోపీచంద్ అల్ట్రా-స్టైలిష్‌గా కనిపించారు. తన ఇంటెన్సిటీతో కామెడీని బ్లెండ్ చేసే పాత్రలో మెరిశారు. కావ్య థాపర్ తన గ్లామర్‌తో ఆకట్టుకోగా, నరేష్, వెన్నెల కిషోర్, మిగతా నటులు వినోదాన్ని అందించారు.
 
కెవి గుహన్ సినిమాటోగ్రఫీ ప్రత్యేకంగా నిలిచింది, చైతన్ భరద్వాజ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కథకు మరింత డెప్త్ ని జోడించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌ పై నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ నిర్మాణ విలువలు టాప్ క్లాస్ లో వున్నాయి.
 
శ్రీనువైట్ల బ్లాక్‌బస్టర్స్‌కు పని చేసిన గోపీ మోహన్ స్క్రీన్‌ప్లే రాశారు. అమర్‌రెడ్డి కుడుముల ఎడిటర్‌, కిరణ్ మన్నె ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. "విశ్వం" అక్టోబర్ 11న దసరాకి విడుదల కానుంది, పండగ సీజన్‌లో ఇది పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వుండబోతోంది.
 
నటీనటులు: గోపీచంద్, కావ్య థాపర్, వెన్నెల కిషోర్ తదితరులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీవారి లడ్డూలో చేప నూనె - బీఫ్ టాలో - పంది కొవ్వు వినియోగం...

ఏపీలో కొత్త మద్యం పాలసీ.. రూ.99కే క్వార్టర్ బాటిల్!

తిరుపతి లడ్డూ తయారీలో ఆవు నెయ్యి స్థానంలో జంతువుల కొవ్వు కలిపారా?

దేశంలో జమిలి ఎన్నికలు తథ్యం.. అమలుకు ప్రత్యేక కమిటీ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ముంబై నటినే కాదు.. ఆమె సోదరుడిని కూడా వేధించిన పీఎస్ఆర్ ఆంజనేయులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments