Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బ్రహ్మ ఆనందం లో తాత, మనవళ్ళుగా బ్రహ్మానందం, రాజా గౌతమ్

Advertiesment
Brahmanandam, Raja Gautham,

డీవీ

, సోమవారం, 19 ఆగస్టు 2024 (18:08 IST)
Brahmanandam, Raja Gautham,
హాస్య బ్రహ్మ, పద్మశ్రీ బ్రహ్మానందం, అతని కుమారుడు రాజా గౌతమ్ ఔట్ అండ్ ఔట్ఎంటర్‌టైనర్ 'బ్రహ్మ ఆనందం'లో తాత, మనవళ్ళుగా అలరించబోతున్నారు. ఫస్ట్-టైమర్ RVS నిఖిల్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్‌పై రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు. సావిత్రి, శ్రీ ఉమేష్ యాదవ్ సమర్పిస్తున్నారు.
 
ఇటీవల మేకర్స్  బ్రాహ్మ ఆనందం ఫస్ట్ లుక్‌ను రిలిన్ చేశారు. బ్రహ్మానందం ట్రెడిషనల్ అవతార్‌లో కనిపించిన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు, రక్షా బంధన్‌ను పురస్కరించుకుని, మేకర్స్ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ని విడుదల చేశారు.
 
రాజా గౌతమ్ పరిచయంతో గ్లింప్స్ స్టార్ట్ అవుతుంది. అవసరాలు తీర్చుకోవడానికి ఇబ్బందులు పడుతున్న హోప్ లెస్ యువకుడిగా రాజా గౌతమ్ కనిపించిన తీరు ఆసక్తికరంగా వుంది. వెన్నెల కిషోర్ అతని స్నేహితుడిగా కనిపించారు. తను లైఫ్ లో ప్రోగ్రస్ లేని డాక్టర్.
 
అన్ని సమస్యలు, పరిష్కారాల అల్టిమేట్ "బాప్" గా బ్రహ్మానందం గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. దీంతో డ్రామా మరింత ఆసక్తికరంగా మారింది. ఇది హోలమ్స్ ఎంటర్‌టైనర్ అని గ్లింప్స్ ద్వారా స్పష్టమవుతుంది. మూడు పాత్రలను హిలేరియస్ గా డిజైన్ చేశారు.  
 
స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్100% సక్సెస్ రేట్‌తో న్యూ ఏజ్ కంటెంట్ బేస్డ్ సినిమాలను రూపొందిస్తోంది. వారి గత చిత్రాలు మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలను అందించాయి. 'బ్రహ్మా ఆనందం' మరో యూనిక్ ఎంటర్ టైనర్ కానుంది.  
 
ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ హీరోయిన్స్ గా కనిపించనున్నారు. వెన్నెల కిషోర్ ఫుల్ లెంగ్త్ రోల్ పోషిస్తుండగా, సంపత్, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషిస్తున్నారు.
 
ఈ చిత్రానికి శాండిల్య పిసాపాటి మ్యూజిక్ అందిస్తున్నారు.  మితేష్ పర్వతనేని డీవోపీ గా పని చేస్తున్నారు. ప్రసన్న ఎడిటర్.
 
డిసెంబర్ 6న బ్రహ్మ ఆనందం విడుదల కానుందని మేకర్స్ అనౌన్స్ చేశారు
 
తారాగణం: రాజా గౌతమ్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, ప్రియా వడ్లమాని. ఐశ్వర్య హోలక్కల్, సంపత్, రాజీవ్ కనకాల

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'బాహుబలి' హాలీవుడ్ వరకు వెళ్లిందంటే ప్రభాసే కారణం : సీఎం రేవంత్ రెడ్డి (Video)