Webdunia - Bharat's app for daily news and videos

Install App

శంకర్ గారితో పని చేయడం అదృష్టం: రామ్ చరణ్

డీవీ
శనివారం, 9 నవంబరు 2024 (19:22 IST)
kiyara, charan, anjali
గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజర్’. ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో జ‌న‌వ‌రి 10, 2025న  మూవీ గ్రాండ్ రిలీజ్ కానుంది. న‌వంబ‌ర్ 9న ల‌క్నోలో ఈ మూవీ టీజ‌ర్‌ను రిలీజ్ చేశారు. 
 
రామ్ చరణ్ మాట్లాడుతూ. శంకర్ గారిని ఈ రోజు మిస్ అవుతున్నాం. ఆయన ఫైనల్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఆయనతో కలిసి పని చేయడం అదృష్టం. ఇండియాలో లక్నో చాలా పెద్ద నగరం. ఇక్కడ మనుషులు మనసులు కూడా చాలా పెద్దవి. మా గత చిత్రాన్ని ఇక్కడ పెద్ద మనసుతో ఆదరించారు. ఈ రోజు ఇక్కడ టీజర్ లాంచ్ జరగడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.
 
ఎస్ జే సూర్య మాట్లాడుతూ.. ‘గేమ్ చేంజర్ సినిమాలో టీజర్‌ను మాత్రమే చూశారు. ఇక అసలు సినిమా ముందుంది. ఈ రోజు శంకర్ గారు కూడా ఇక్కడకు రావాల్సి ఉంది. కానీ ఎడిటింగ్‌లో ఆయన బిజీగా ఉన్నారు. రామ్ చరణ్, శంకర్ కలిసి చేసిన ఈ చిత్రం అద్భుతంగా ఉండబోతోంది. గేమ్ చేంజర్ సంక్రాంతికి రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
 
అంజలి మాట్లాడుతూ.. ‘గేమ్ చేంజర్‌లో నా పాత్ర విని వెంటనే ఓకే చెప్పాను. చాలా కొత్తగా ఉంటుంది. నాకు ఎంతో ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఈ మూవీ ఒప్పుకోవడానికి రామ్ చరణ్, శంకర్ గారు, దిల్ రాజు గారు కూడా కారణం. సంక్రాంతికి ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు. 
 
 
దిల్ రాజు మాట్లాడుతూ.. ‘మా ప్రొడక్షన్‌లో 50వ చిత్రమిది. శంకర్ గారెతో పని  చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నాను. పైగా అది రామ్ చరణ్‌తో అవ్వడం మరింత ఆనందంగా ఉంది’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియాంకా గాంధీ భర్తకు ఏడేళ్ల కఠిన జైలుశిక్ష విధించాలి : ఈడీ

ఎయిర్‌పోర్టులకు ధీటుగా రైల్వే స్టేషన్ల అభివృద్ధి : డాక్టర్ పెమ్మసాని

భర్తతో గొడవపడి ముగ్గురు పిల్లలతో కలిసి కాలువలో దూకిన భార్య

బాబాయిని చంపిన అబ్బాయి బ్యాచ్‌కు ఓటు వేద్దామా? పులివెందులలో టీడీపీ వినూత్న ప్రచారం

మేమే బాస్‌ అనుకునేవారికి భారత్ వృద్ధి నచ్చలేదు : రాజ్‌నాథ్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments