Game changer teaser poster
దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ కొద్దిసేపటి క్రితమే చిత్ర దర్శక నిర్మాతలు గేమ్ ఛేంజర్ టీజర్, విడుదల అప్ డేట్ ను ప్రకటించారు. రామ్ చరణ్ అందరికీ దీపావళి విషెస్ చెబుతూ, నవంబర్ 9న టీజర్ ను, జనవరి 10న థియేటర్లలో సినిమాను విడుదల చేస్తున్నట్లు సరికొత్త పోస్టర్ ను విడుదల చేశారు. యాక్షన్ ఎపిసోడ్ తో కూడిన ఈ పోస్టర్ రెండో రామ్ చరణ్ పాత్రను రిలీవ్ చేసినట్లయింది. ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే.
దర్శకుడు శంకర్ గేమ్ ఛేంజర్ సినిమాను సరికొత్త కోణంలో ఆవిష్కరించారని తెలుస్తోంది. ఇప్పటికే చిత్రం నార్త్ ఇండియా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఫ్యాన్సీ మొత్తానికి అమ్ముడయ్యాయి. ఇది రామ్ చరణ్ కెరీర్‌లోనే హయ్యస్ట్. భారీ రేటుకే నార్త్‌లో గేమ్ చేంజర్ అమ్ముడైపోయింది.
కథ ప్రకారంగా చూసుకుంటే ఇందులో రామ్ చరణ్ నిజాయితీగా గల ఐఏఎస్ అధికారిగా, అణగారిన వర్గాల సంక్షేమం కోసం పోరాడే రాజకీయ నాయకుడిగా కనిపించబోతోన్నారు. కియారా అద్వానీ కథానాయికగా, అంజలి కీలక పాత్రలో నటిస్తున్నారు. తమన్ సంగీతం, నేపథ్య సంగీతం స్పెషల్ అట్రాక్షన్ కానుంది. ఎడిటింగ్‌ను బాధ్యతను ప్రఖ్యాత ద్వయం షమ్మర్ ముహమ్మద్, రూబెన్ నిర్వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ బ్యానర్‌పై దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.