రవితేజ మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ఈగల్. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం 2024లో విడుదలవుతున్న భారీ అంచనాలున్న సినిమాల్లో ఒకటి. టీజర్ విడుదలైన తర్వాత క్రేజ్ నెక్స్ట్ లెవల్ కి చేరుకుంది. ఇప్పుడు మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్స్ ప్రారంభించారు.
గ్రామీణ పండుగ వేడుకలు జరుపుకుంటున్న గ్రామస్థులతో కూడిన రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఆడు మచ్చా పాటని ఊరా మాస్ అంథమ్ గా కంపోజ్ చేశారు దావ్‌జాంద్. రవితేజ తన గెటప్, డ్రెస్సింగ్ స్టైల్ పరంగా విభిన్నంగా, మాస్ గా కనిపించారు. నల్ల చొక్కా, ధోతీ ధరించి, మెడలో రుద్రాక్ష మాలతో పూర్తిగా కొత్త అవతార్ లో ఆకట్టుకున్నారు.
దావ్‌జాంద్ అన్ని మాస్ ఎలిమెంట్స్ తో, పక్కా థియేటర్ సాంగ్‌ను రూపొందించారు. ఈ ట్యూన్ లైవ్ ఇండియన్ పెర్కషన్స్, ఫ్లూట్స్, పేపర్ హొర్న్స్ తో సాంగ్ ప్రోగ్రామింగ్ ఎక్స్ ట్రార్డినరీ గా వుంది. రెండిషన్ లోకల్ ఫ్లేవర్ తో అద్భుతంగా అలరించింది.
కల్యాణ చక్రవర్తి మాస్ ను ఆకట్టుకునే సాహిత్యాన్ని రాశారు. రాహుల్ సిప్లిగంజ్ ఎనర్జిటిక్ వాయిస్ తో లైవ్లీ గా పాటని ఆలపించారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. రవితేజ తన అద్భుతమైన డ్యాన్స్ మూవ్స్‌తో పాటలోని ఎనర్జీని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళారు. ఈ పాట అభిమానులకు కన్నుల పండగలా ఆకట్టుకుంది.
ఈ సినిమాలో రవితేజ మల్టిపుల్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తుండగా, కావ్య థాపర్ మరో కథానాయిక. నవదీప్, మధుబాల ఇతర ముఖ్య తారాగణం.
కార్తీక్ ఘట్టమనేని ఎడిటింగ్ & దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మణిబాబు కరణంతో పాటు దర్శకుడు స్వయంగా స్క్రీన్ ప్లే రాశారు. టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
మణిబాబు కరణం డైలాగ్స్ అందించారు. దావ్‌జాంద్ సంగీత సమకూరుస్తున్నారు. శ్రీనాగేంద్ర తంగల ప్రొడక్షన్ డిజైనర్.
ఈగల్ 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలో విడుదల కానుంది.