ద్వందార్థాలు, లిప్‌కిస్‌తో చాందినీ చౌద‌రికి అవ‌కాశాలు వ‌స్తాయా!

Webdunia
శుక్రవారం, 17 జూన్ 2022 (16:36 IST)
Kiran Abbavarapu, Chandini Chaudhary,
యూత్‌ఫుల్ సినిమాల పేరుతో యువ‌తీ యువ‌కులు మందుకొట్ట‌డం, బూతులు మాట్లాడ‌డం, లిప్‌కిస్ చేయ‌డం ఇప్పుడు ప‌రిపాటి అయింది. తెలుగు అమ్మాయి చాందిని చౌదరి ఇందుకు మిన‌హాయింపు కాదు. క‌ల‌ర్‌ఫొటో సినిమాతో ప‌రిచ‌య‌మైన ఈ అమ్మ‌డు తాజాగా స‌మ్మ‌త‌మే అనే సినిమాతో రాబోతోంది. ఈ చిత్రం ట్రైల‌ర్‌ను రాష్ట్ర మంత్రి కె.టి.ఆర్‌. ఆవిష్క‌రించారు. అందులో మందు కొట్ట‌డం, బూతులు మాట్లాడ‌డం, లిప్‌కిస్‌లు వుండ‌డం విశేషం. తెలంగాణాకుచెందిన గోపీనాథ్ రెడ్డి ద‌ర్శ‌కుడు, నిర్మాత కూడా కావ‌డం విశేషం.

 
అయితే ఇందులో ప‌లు స‌న్నివేశాలు యూత్‌ను అల‌రించేవిగా వున్నాయి. హీరోయిన్లు అవ‌కాశాల కోసం క‌థ న‌చ్చింది అంటే చాలు ద‌ర్శ‌కనిర్మాతలు బోల్డ్‌గా న‌టించమ‌ని అడిగేస్తున్నారు. ఇందులో ఎస్.ఆర్‌. క‌ళ్యాణ మండ‌పం హీరో కిర‌న్ అబ్బ‌వ‌ర‌పు హీరో. త‌ను ఈమెను ప్రేమించ‌డం, ఈమె హోట‌ల్‌కు తీసుకెళ్ళ‌డం. బూస్ట్ తాగుతావా! అని హీరోను అడ‌గ‌డం.. నేను కూల్‌డ్రింగ్‌ తాగుతాన‌న‌డం.. అదికాదు. బూస్ట్ అంటే మందు కొడ‌తావా! అని అర్థం అంటూ వివ‌ర‌ణ ఇవ్వ‌డం.


ఇలా కొత్త కొత్త అర్థాలు, వెండితెరపై ప్ర‌జెంట్‌చేయ‌డంపై ఇదేదో లోక‌జ్ఞానంలాగా ద‌ర్శ‌క నిర్మాత‌లు యూత్‌పై రుద్దుతున్న‌ట్లు కొంద‌రు విమ‌ర్శిస్తున్నారు. సినిమా ఎలా వుంటుందో కానీ, మ‌ర‌లా యూత్ పేరుతో బూతు సినిమాలు వ‌స్తున్నాయ‌నే టాక్ అయితే వ‌చ్చింది. మ‌రి ఇలాంటి సినిమాలు వ‌ల్ల కొత్త‌గా స్వంత డ‌బ్బుల‌తో ద‌ర్శ‌కుడిగా మారిన తెలంగాణ ద‌ర్శ‌కుడు ప‌రిస్థితి, హీరోహీరోయిన్లు ప‌రిస్థితి మ‌రిన్ని అవ‌కాశాలు వ‌స్తాయో లేదో చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వివాహం కాలేదన్న మనస్తాపంతో యువతి ఆత్మహత్య

భారత వస్తువులపై సుంకాలు.. 50 నుంచి 18 శాతానికి తగ్గించిన ట్రంప్.. మోదీ హ్యాపీ

మా ఇంటిపై జరిగిన దాడికి పవన్ బాధ్యత వహించాలి.. అంబటి కుమార్తె డిమాండ్

కల్తీ జరిగిందనేది నూటికి నూరు శాతం నిజం.. లడ్డూ వివాదంపై చర్చ జరగాల్సిందే..

CPI Narayana: కేంద్ర బడ్జెట్‌ పనికిరానిది.. దార్శనికత లేనిది.. నారాయణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం

winter health, గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసి తాగితే?

ఫ్యూజీఫిల్మ్ ఇండియా సరికొత్త సాంకేతికత అధునాతన ఇమేజింగ్, హెల్త్‌కేర్ ఐటి పరిష్కారాల ఆవిష్కరణ

హైదరాబాద్‌ ఐఆర్‌ఐఏ 2026లో బీపీఎల్ మెడికల్ టెక్నాలజీస్ అధునాతన ఇమేజింగ్, ఏఐ సామర్థ్యాల ప్రదర్శన

సాధారణ దగ్గు, జలుబు వదిలించుకునే మార్గం

తర్వాతి కథనం
Show comments