Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూన్ 18న వరంగల్ ప్రేక్షకులను అలరించనున్న 'జీ తెలుగు సపరివార సకుటుంబ సమేతంగా'

Webdunia
శుక్రవారం, 17 జూన్ 2022 (16:16 IST)
ప్రేక్షకులు తాము ఎంతగానో ఆదరించే 'జీ తెలుగు' స్టార్స్‌ను ప్రత్యక్షంగా చూసే అవకాశం కల్పిస్తూ, ఛానల్ 'జీ తెలుగు సపరివార సకుటుంబ సమేతంగా' అనే కార్యక్రమంతో వరంగల్ ప్రజల ముందుకు రానుంది. 'అదిరింది' ఫేమ్ సద్దాం, యువనటి భానుశ్రీ ఈ ఈవెంట్‌కి హోస్ట్స్‌గా వ్యవహరిస్తుండగా, 'దేవతలారా దీవించండి', 'కృష్ణ తులసి' సీరియల్స్‌కి చెందిన నటీనటులు, 'సరేగమప' గాయనీగాయకులు, సింగర్ మధుప్రియ తదితరులు వేదికపై సందడి చేయనున్నారు. వరంగల్ లోని వేణుగోపాలస్వామి గుడి ఎదురుగా ఉన్న కొత్తవాడ గ్రౌండ్(తోట మైదాన్)లో శనివారం (జూన్ 18) సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది.

 
ఈ కార్యక్రమంలో భాగంగా, ఛానెల్ వరంగల్ వాసులకు ఒక సెల్ఫీ కాంటెస్ట్ ప్రకటించింది. ఇందులోభాగంగా, 'జీ తెలుగు' చూస్తూ సెల్ఫీతీసి 7032904615 నెంబరుకి వాట్సాప్ చేసి అద్భుతమైన బహుమతులతో సహా 'జీ తెలుగు' తారలు నేరుగా మీ ఇంటికే వచ్చే అవకాశాన్ని పొందవచ్చు. ‘జీ’ తారలు శనివారం సెల్ఫీ కాంటెస్ట్ విజేతల ఇళ్లను సందర్శించి అక్కడ అభిమానులతో ముచ్చటించి సాయంత్రం ఐదున్నర గంటలకు ఎంజీ రోడ్ చేరుకొని అక్కడ నుండి వేదిక వరకు ఊరేగింపుగా బయలుదేరుతారు. సరిగ్గా సాయంత్రం 6 గంటలకు మొదలవనున్న ఈ కార్యక్రమం, హాస్యపూరితమైన ఆటపాటలతో, ఉర్రూతలాడించే డాన్స్ ప్రదర్శనలతో, కితకితలాడించే కామెడీ స్కిట్స్‌తో అభిమానులకు మంచి వినోదాన్ని పంచనుంది.

 
వివరాల్లోకి వెళితే, సింగర్ మధుప్రియ, 'సరేగమప' ఫేమ్ వాగ్దేవి తమ గానంతో మంత్రముగ్దుల్ని చేయడానికి సిద్ధమవుతుండగా, భానుశ్రీ, దిలీప్ శెట్టి (అఖిల్ - కృష్ణ తులసి), చైత్ర సక్కరి (శ్రీవల్లి - దేవతలారా దీవించండి) వారి డాన్స్‌తో  అందరిని ఆకట్టుకోనున్నారు. 'డ్రామా జూనియర్స్' ఫేమ్ ప్రజ్వల్ హీరో బాలకృష్ణపై చేసే స్కిట్ ఈవెంట్‌కే హైలైట్‌గా ఉండబోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకాపాకు జయమంగళ రాజీనామా.. పెద్దకర్మ పోస్ట్.. బాబుకు పవన్ గౌరవం ఇస్తారా?

వైసిపికి మరో షాక్, ఎమ్మెల్సీ వెంకటరమణ రాజీనామా

వాయనాడ్‌‌లో ప్రియాంక గాంధీ ఘనవిజయం.. రాహుల్ రికార్డ్ బ్రేక్

'మహాయుతి' అదుర్స్.. మోదీ, అమిత్ షా, చంద్రబాబు అభినందనలు

మహారాష్ట్రలో మహాయుతి భారీ విజయం వెనుక 5 కీలక కారణాలు, ఏంటవి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments