Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిద్ధాంతం కోసం కట్టుబడే అందరికీ దిల్ రూబా చిత్రం కనెక్ట్ అవుతుంది : కిరణ్ అబ్బవరం

డీవీ
శనివారం, 4 జనవరి 2025 (10:00 IST)
Kiran Abbavaram, Dil Ruba team
కిరణ్ అబ్బవరం నటిస్తున్న "దిల్ రూబా" సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తున్నామని చిత్ర నిర్మాతలు వెల్లడించారు. రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. చిత్రాన్ని ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ  ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.
 
ఈ కార్యక్రమంలో హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ, మా ప్రొడ్యూసర్ రవి, రవి, సురేష్ రెడ్డి 2019లో పరిచయం. నా రాజావారు రాణిగారు సినిమా డిస్ట్రిబ్యూట్ చేశారు. తనొక ప్రొడ్యూసర్ అయినా సినిమా కోసం ప్రతి ఒక్కరినీ రిక్వెస్ట్ చేస్తుంటారు. డైరెక్టర్ కరుణ్ కథ చెప్పే విధానం చాలా కొత్తగా అనిపించింది. ఏ సందర్భాన్నైనా ఆకట్టుకునేలా చెప్పగలడు. "దిల్ రూబా" సినిమాలో నేను చేసిన సిద్ధు, సిద్ధార్థ్ క్యారెక్టర్  చాలా స్పెషల్ గా హార్డ్ హిట్టింగ్ గా ఉంటుంది. తను నమ్మిన సిద్ధాంతం కోసం ప్రేమతో సహా ఏ విషయంలోనైనా వెనక అడుగు వేయడు. తన నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం కట్టుబడి ఉంటాడు. అలాంటి సిద్ధార్థ్ లు మీలోనూ ఉంటారు. వారందరికీ "దిల్ రూబా" బాగా నచ్చుతుంది. అలాగే ఏడాదికి కనీసం 3 సినిమాలు రిలీజ్ కు తీసుకురావాలనేది నా కోరిక. అది ఎంతవరకు వీలవుతుందో ప్రయత్నిస్తాను. అన్నారు.
 
ప్రొడ్యూసర్ రవి మాట్లాడుతూ - మా శివమ్ సెల్యులాయిడ్ సంస్థలో గతంలో ఓ మూవీ చేశాం. నేను డిస్ట్రిబ్యూషన్ లో చాలా కాలంగా ఉన్నాను. కిరణ్ నా దగ్గరకు ఈ కథ తీసుకొచ్చారు. విశ్వ కరుణ్ డైరెక్టర్ అని చెప్పి పరిచయం చేశారు. కథ చెప్పినప్పుడే ఇది ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే నమ్మకం కలిగింది. చేస్తే ఇలాంటి మూవీని ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నాం. "దిల్ రూబా" టీజర్ లో మీరు చూసింది కొంతే. నెక్స్ట్ ట్రైలర్ వస్తుంది. ఫిబ్రవరిలో మూవీ రిలీజ్ చేస్తాం. కిరణ్ అబ్బవరంను ఇప్పటివరకు చూడని విధంగా ఒక ఇంటెన్స్ క్యారెక్టర్ లో మీరు చూస్తారు అని అన్నారు.
 
డైరెక్టర్ విశ్వకరుణ్ మాట్లాడుతూ - "దిల్ రూబా" కథను కిరణ్ గారికి అరగంట పాటు చెప్పాను. ఆయనకు కథ విన్న వెంటనే నచ్చి స్క్రిప్ట్ రెడీ చేసుకో అని పంపారు. మనందరి జీవితాల్లోని ప్రేమను స్ఫూర్తిగా తీసుకుని ఈ మూవీ చేశా. "దిల్ రూబా" సినిమాను ఫిబ్రవరిలో రిలీజ్ కు తీసుకొస్తున్నాం. మీరంతా ఈ లవ్ స్టోరీని థియేటర్స్ లో ఎంజాయ్ చేస్తారు. అన్నారు.
 
ఇంకా కో ప్రొడ్యూసర్ సురేష్ రెడ్డి, సినిమాటోగ్రాఫర్ డానియేల్ విశ్వాస్, కొరియోగ్రాఫర్ ఈశ్వర్, జిత్తు మాట్లాడుతూ - "దిల్ రూబా హిట్ కావాలని ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

HMPV కొత్త వైరస్.. ఆస్పత్రులు నిండిపోలేదు.. చలికాలం అవి సహజమే

యూకే పర్యటన కోసం పర్మిషన్ సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు

Madhavi Latha: తాడిపత్రి వాళ్లు పతివ్రతలు కాబట్టి సినిమాల్లోకి రాకండి.. మాధవీ లత

పవన్ కల్యాణ్‌కు తలనొప్పి తెస్తున్న రేవ్ పార్టీలు.. మళ్లీ కొత్త కేసు.. ఎక్కడ?

Kumari Aunty : కుమారి ఆంటీ వ్యాపారంతో ట్రాఫిక్ జామ్.. వారం పాటు బంద్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

కోడి గుడ్లు, పాలు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

అతి నిద్రతో అనారోగ్య సమస్యలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments