Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

డీవీ
మంగళవారం, 25 జూన్ 2024 (19:20 IST)
Allu Sirish Gayatri Bharadwaj Prisha Rajesh Singh
మా నాన్న కూడా నాపై ఇంత ఖర్చు పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయలేదు. నాతో భారీ ఖర్చుతో బిగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ చేశారు జ్ఞానవేల్ గారు. పుష్ప 2 గురించి నేను ఇప్పుడు మాట్లాడను. మాట్లాడితే మరింత హైప్ క్రియేట్ చేస్తారు. టీజర్, ట్రైలర్ చూసి మీరే డిసైడ్ చేసుకోవాలి అని అల్లు శిరీష్ అన్నారు.
 
అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ "బడ్డీ". గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లు.  ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నారు. నేహ జ్ఞానవేల్ రాజా కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది. జూలై 26న "బడ్డీ" సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. 
 
azmal, Allu Sirish, Gayatri, Prisha, KE Gnanavel Raja and others
ఈ కార్యక్రమంలో హీరో అల్లు శిరీష్ మాట్లాడుతూ - లాస్ట్ ఇయర్ బడ్డీ పోస్టర్ రిలీజైనప్పుడు మళ్లీ రీమేక్ సినిమా చేస్తున్నావా అని అడిగారు. ఓటీటీలో ఇలాంటి సినిమా ఉందని చెప్పారు. నేను వారికి ఎన్ని చెప్పినా అనేది అనుకుంటారు అని వదిలేశా. బడ్డీ విషయంలో నాకు కూడా కొంచెం డౌట్ ఉండేది. టెడ్డీ బేర్ తో అడ్వెంచర్ యాక్షన్ మూవీ, ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకున్నా. కానీ ఇవాళ బడ్డీ ట్రైలర్ చూశాక నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. కొత్త తరహా సినిమా ఎప్పుడు వచ్చినా మన ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారు. ఇది రెగ్యులర్ టైప్ మూవీ కాదు. కొత్తగా ఉంటుంది. శామ్ గారి 100 అనే సినిమా చూసి చాలా బాగా చేశాడే అనుకున్నా. అలాగే శామ్ గారి ట్రిగ్గర్ ట్రైలర్ చూసి ఇంప్రెస్ అయ్యాను. రొమాంటిక్ హీరో ఇమేజ్ ఉన్న అథర్వాతో యాక్షన్ మూవీ చేశాడు అనుకున్నా. నేను శామ్ కు ఫోన్ చేసి మాట్లాడాను. మంచి స్క్రిప్ట్ ఉంటే చెప్పు సినిమా చేద్దామని అన్నా.  బడ్డీతో మా కాంబో కుదిరింది. ఈ సినిమాలో హీరో నేను కాదు టెడ్డీ బేర్. ఆ క్యారెక్టర్ కు ఇంప్రెస్ అయ్యే నేనీ సినిమా చేశా. నా హీరోయిజం చూపించాలని కాదు. జ్ఞానవేల్ గారికి థ్యాంక్స్అ న్నారు.
 
నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ, ఇప్పుడు బడ్డీ మూవీ చేస్తున్నాం. ఈ చిత్రంలో అలీ, అజ్మల్ బాగా సపోర్ట్ చేశారు. శామ్ బడ్డీతో మా సంస్థకు మరో మంచి సినిమా ఇస్తున్నాడు. నేను ఈ కథ కంటే శామ్ ను ఎక్కువ నమ్మాను. ఎడిటర్ రూబెన్, సినిమాటోగ్రాఫర్ కృష్ణన్ వసంత్ ప్రేమకథా చిత్రమ్ రీమేక్ తర్వాత మరోసారి మా సంస్థలో పనిచేస్తున్నారు. రూబెన్ పుష్ప, జవాన్ సినిమాలకు వర్క్ చేశారు. హిప్ హాప్ తమిళ మా బడ్డీ మూవీకి బ్యాక్ బోన్. ఆయన సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చారు. బడ్డీ సినిమా ఫుటేజ్ కొంతమందికి చూపించాను. శిరీష్ బడ్డీలో బాగా కనిపించారు, బాగా నటించారు అని వాళ్లు చెప్పారు. మీరంతా మా సినిమాను సపోర్ట్ చేసి బ్లాక్ బస్టర్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
 
హీరోయిన్ గాయత్రి భరద్వాజ్ మాట్లాడుతూ, ఈ కథ వైడ్ రేంజ్ ఆఫ్ ఆడియెన్స్ కు రీచ్ అయ్యేలా ఉంటుంది. డైరెక్టర్ శామ్, రైటర్ హేమంత్ కలిసి మరింత ఇంట్రెస్టింగ్ గా స్క్రిప్ట్ చేశారు. పిల్లలు పెద్దలు యూత్ ఫ్యామిలీ ఆడియెన్స్ అందరూ చూసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది. అల్లు శిరీష్ మంచి కోస్టార్. ఆయన నుంచి యాక్టింగ్ పరంగా చాలా విషయాలు నేర్చుకున్నాను. బడ్డీని థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయండి. అన్నారు.
 
హీరోయిన్ ప్రిషా రాజేశ్ సింగ్ మాట్లాడుతూ, శిరీష్ మంచి కోస్టార్. అతనితో కలిసి వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. సినిమాలో శిరీష్ కెప్టెన్ ఆదిత్యరామ్ గా కనిపిస్తారు. నాకు  శిరీష్ కంటే ఆదిత్యరామ్ క్యూట్ గా కనిపించాడు. బడ్డీ మూవీ మీ అందరికీ నచ్చుతుంది. థియేటర్ చూసి రెస్పాన్స్ చెప్పండి. అన్నారు.
 
యాక్టర్ అజ్మల్ మాట్లాడుతూ, నేను విలన్ రోల్స్ చేసి విసిగిపోయాను. ఈ సినిమాలో అలాంటి ఉండొద్దని కోరుకున్నా. డైరెక్టర్ శామ్ చెప్పిన ప్రతి డైలాగ్ నచ్చింది. సాయి హేమంత్ చెప్పిన స్క్రిప్ట్ కు గూస్ బంప్స్ వచ్చాయి. వెంటనే ఈ మూవీ చేస్తున్నానని చెప్పాను. ఈ క్యారెక్టర్ కోసం శిరీష్ తనను తాను మార్చుకుని తీరు బాగా నచ్చింది. జూలై 26న బడ్డీని థియేటర్ లో మీరంతా లవ్  చేస్తారు. అని చెప్పారు.
 
నటుడు అలీ మాట్లాడుతూ, మేము థాయ్ లాండ్ షూటింగ్ కోసం వెళ్లినప్పుడు అక్కడ జపనీస్, చైనీస్ వాళ్లు బడ్డీతో ఫొటోస్ తీసుకునేవారు. ఈ సినిమాను జపాన్, చైనాలో రిలీజ్ చేస్తే అక్కడ కూడా సక్సెస్ అవుతుంది. బడ్డీ సినిమాకు బాగా డబ్బులు రావాలి, సీక్వెల్ చేసేంత సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.
 
దర్శకుడు శామ్ ఆంటోన్ మాట్లాడుతూ- జ్ఞానవేల్ రాజా గారి ప్రొడక్షన్ లో డార్లింగ్ మూవీ చేశాను. ఈ సినిమా కోసం డిస్కషన్ జరిగినప్పుడు నన్ను స్క్రిప్ట్ కూడా అడగలేదు. కేవలం నా మీద నమ్మకంతో ఈ మూవీ ఇచ్చారు. ఈగ సినిమా ఈ బడ్డీ మూవీకి ఇన్సిపిరేషన్. బడ్డీకి సీజీ వర్క్ చేసినప్పుడు ఈగ మూవీతో పోల్చి సజెషన్స్ చెప్పేవాడిని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

సెకీతో సౌర విద్యుత్ ఒప్పందంలో ఎలాంటి సంబంధం లేదు : బాలినేని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments