Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫాదర్స్‌ సూసైడ్‌ స్టోరీతో బాపు సినిమా : బ్రహ్మాజీ

డీవీ
మంగళవారం, 28 జనవరి 2025 (19:03 IST)
Vishwak Sen, Brahmaji, Balagam Sudhakar Reddy, Amani
నటుడు బ్రహ్మాజీ లీడ్ రోల్‌లో నటించిన చిత్రం ‘బాపు’. ఏ ఫాదర్స్‌ సూసైడ్‌ స్టోరీ అనేది ట్యాగ్‌లైన్.  బలగం సుధాకర్‌ రెడ్డి, ఆమని, అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ తదితరులు ప్రధాన పాత్రల్లో నిజ జీవిత ఘటనల ఆధారంగా దర్శకుడు దయా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని రాజు, సీహెచ్ భాను ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరోయిన్‌ రష్మిక మందన్న సోషల్‌ మీడియా వేదికగా ‘బాపు’ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
 
టీజర్ లాంచ్ ఈవెంట్‌కు అతిథిగా హాజరైన విశ్వక్ సేన్ మాట్లాడుతూ..‘‘నా ఫస్ట్ సినిమా కూడా ఇండిపెండెంట్ సినిమా. ఇండిపెండెంట్ సినిమా గెలవడం చాలా ముఖ్యం. ఇలాంటి సినిమా సక్సెస్ అయితేనే మేకర్స్‌కు ఉత్సాహం వస్తుంది. అలాగే ఇలాంటి సినిమాలు చేయాలనుకునే మిగతావాళ్లకు కూడా ధైర్యం వస్తుంది. నిజాయితీగా తీసిన సినిమా ఇది. టీజర్ చూస్తే చాలా బాగుంది. కచ్చితంగా ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది. ఇలాంటి సినిమాకు ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలి. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అని చెప్పారు.
 
నిర్మాత మధుర శ్రీధర్ మాట్లాడుతూ..‘‘మలయాళ సినిమాలు చూసి మన తెలుగులో నేటివిటీ సినిమాలు రావని అనుకుంటారు. కానీ బాపు సినిమా చూస్తే అది తప్పని అర్థమవుతుంది. పల్లెటూర్లలో మానవసంబంధాలు ఎలా ఉంటాయి? డబ్బు అవసరాలు వచ్చినప్పుడు ఎలా ఆలోచిస్తారు అనే విషయాలు చాలా ఆసక్తికరంగా ఇందులో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సినిమాను సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తున్నాం. చిన్న సినిమాలకు ప్రేక్షకులు రావట్లేదని చాలా మంది అన్నారు. కానీ పెళ్లి చూపులు, కేరాఫ్ కంచెరపాలెం సినిమాలకు ఎలా వచ్చారో అలా సినిమాకు కూడా వస్తారనే గట్టి నమ్మకంతో ఉన్నాం. అందుకే సినిమా 21న విడుదల చేస్తున్నా.. వారం ముందుగానే ఫిబ్రవరి 14 నుంచి ప్రీమియర్ షోలు వేయాలని డిసైడ్ అయ్యాం. మంచి సినిమాను అందరికీ తెలియజేయండి’’ అని చెప్పారు.
 
బ్రహ్మాజీ మాట్లాడుతూ..‘‘చాలా సినిమాలకు చిరంజీవి గారు వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చేవారు. అలాగే ఇప్పుడు చిన్న సినిమాలకు విశ్వక్ సపోర్ట్ చేస్తున్నారు. విశ్వక్ లాంటి వాళ్లు ఉండడం వల్ల ఇండస్ట్రీ చాలా బాగుంది. తన లైలా సినిమా ఫిబ్రవరి 14న విడుదల ఉన్నా కూడా ఇక్కడకు వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్యూ వెరీ మచ్. ఈ సినిమా విషయానికి వస్తే డైరెక్టర్ దయ నాకు స్టోరీ చెప్పారు. చాలా బాగా నచ్చింది. బడ్జెట్ సమస్య ఉన్నా కూడా అధిగమించి సినిమా చేశాం. ఇప్పుడు క్యారవాన్ లేకపోతే చిన్న ఆర్టిస్టులు కూడా రావట్లేదు. కానీ ఈ సినిమాకు ఎవరూ క్యారవ్యాన్ వాడలేదు. కరీంనగర్‌లో ఒక విలేజ్‌లో షూటింగ్ చేశాం. అందరూ కష్టపడి ఒక మంచి సినిమా చేశాం. ఇది రెగ్యులర్ క్యారెక్టర్ కాదు. ఒక డిఫరెంట్ స్టోరీ. టీమ్ అందరూ చాలా బాగా చేశారు. మంచి సినిమాను తెలుగువాళ్లు ఎప్పుడూ ఆదరిస్తారు. ఈ సినిమాను కూడా అందరూ చూసి ఆదరించాలని కోరుతున్నా. ఈ సినిమా టీజర్‌ను లాంచ్ చేసిన రష్మికకు థ్యాంక్స్. ఏ సినిమా ఏంటి? అనే వివరాలు అడగకుండా టీజర్ లాంచ్‌కు ఒప్పుకున్నారు. ఎంత టాలెంటెడో అంత డౌన్ టు ఎర్త్ ఉంటుంది.’’ అని చెప్పారు.
 
సీనియర్ నటి ఆమని మాట్లాడుతూ..‘‘ఈ సినిమా గురించి చాలా చెప్పొచ్చు కానీ చెప్పకూడదు. చాలా మంచి సినిమా. ఇందులో కథే హీరో. మేమంతా చాలా ఇన్వాల్వ్ అయి చేశాం. మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇది. డైరెక్టర్ దయగారు చాలా బాగా తీశారు. డబ్బింగ్ చెప్పేటప్పుడు చూశాను. చాలా పెద్ద హిట్ అవుతుందనిపించింది. నిర్మాత గారు చాలా ధైర్యం చేసి ఈ సినిమా తీశారు. ఈ సినిమా మంచి సక్సెస్ కావాలి. ప్రేక్షకులంతా ఈ సినిమాను పెద్ద హిట్ చేయాలని కోరుతున్నా’’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పహల్గామ్ దాడి నుంచి తృటిలో తప్పించుకున్న కేరళ హైకోర్టు జడ్జీలు!!

అఘోరీకి బెయిల్ ఎపుడు వస్తుందో తెలియదు : లాయర్ (Video)

Pahalgam Terrorist Attack పహల్గామ్ దాడితో కాశ్మీర్ పర్యాటకం నాశనం: తిరుగుముఖంలో పర్యాటకులు

పహల్గామ్ ఉగ్రదాడి : పాకిస్థాన్‌పై భారత దాడికి ప్లాన్!!

టెన్త్ రిజల్ట్స్ : కాకినాడ విద్యార్థిని నేహాంజనికి 600/600 మార్కులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments