Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజాయితీ గల యువకుడి కథగా అలనాటి రామచంద్రుడు ట్రైలర్‌

డీవీ
శనివారం, 27 జులై 2024 (19:18 IST)
Krishna Vamsi, Moksha,
కృష్ణ వంశీ, మోక్ష లీడ్ రోల్స్ లో నటిస్తున్న లవ్ ఎంటర్ టైనర్ ‘అలనాటి రామచంద్రుడు’. చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హైనివా క్రియేషన్స బ్యానర్ పై  హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
 
ఇది ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించే నిజాయితీ గల యువకుడి కథ. తను ఆమెతో గడిపిన ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేస్తాడు. చుట్టుపక్కల ఉన్నవారందరూ తన ప్రేమ గురించి అమ్మాయికి చెప్పమని బలవంతం చేస్తారు. కానీ ఆమె నో చెబితే ఏమౌతుందో అని భయపడతాడు. అయితే వీరి మధ్య కొన్ని అనుకోని సంఘటనలు చోటుచేసుకుంటాయి.
 
కథలోని డ్రామా, ఎమోషనల్ రిచ్‌నెస్‌ని ట్రైలర్ అద్భుతంగా క్యాప్చర్ చేసింది. అర్థవంతంగా రాసిన డైలాగ్‌లు, హత్తుకునే సన్నివేశాలతో మంచి రొమాంటిక్ డ్రామాతో కంప్లీట్ లవ్ స్టొరీని చూడబోతున్నామనే భరోసా ఇచ్చింది ట్రైలర్.
 
కృష్ణ వంశీ డెబ్యుటెంట్ లా కాకుండా మంచి అనుభవం వున్న నటుడిలా ఆకట్టుకునే పెర్ఫార్మెన్స్ తో అలరించాడు. మోక్ష కూడా తన పాత్రని పర్ఫెక్ట్ గా పోషించింది. ట్రైలర్‌లో బ్రహ్మాజీ, సుధ, ప్రమోధిని, వెంకటేష్ కాకమును, చైతన్య గరికిపాటి వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించారు.
 
సంగీత దర్శకుడు శశాంక్ టి తన లవ్లీ స్కోర్‌తో సినిమాటోగ్రాఫర్ ప్రేమ్ సాగర్ క్యాప్చర్ చేసిన విజువల్స్ ని ఎలివేట్ చేశాడు. శ్రీకర్ ఎడిటర్.
 
ఆగస్ట్ 2న విడుదల కానున్న సినిమాపై ట్రైలర్ అంచనాలను మరింత పెంచేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వన్ నేషన్-వన్ ఎలక్షన్: దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఎంత ఖర్చవుతుందో తెలుసా

కేటీఆర్‌ను కలవలేదు.. కనీసం ఫేస్ టు ఫేస్ చూడలేదు.. దువ్వాడ మాధురి (video)

Chain Snatching in Guntur: ఆంజనేయ స్వామి గుడి సెంటర్‌ వద్ద మహిళ మెడలో..? (video)

సంధ్య థియేటర్‌ లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయకూడదు : సీవీ ఆనంద్

కుప్పంలో పర్యటించనున్న నారా భువనేశ్వరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments