Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాఠశాలకు వెళ్లేందుకు మొండికేసిన మనవడు.. స్కూలుకు తీసుకెళ్లి వదిలిపెట్టిన రజనీకాంత్!!

సెల్వి
శనివారం, 27 జులై 2024 (16:31 IST)
స్కూల్‌కు వెళ్లేందుకు తన రెండో కుమార్తె సౌందర్య కుమారుడు, తన మనవడు వేధ్ మొండికేశాడు. దీంతో సూపర్ స్టార్ రజనీకాంత్ స్వయంగా తన మనవడిని స్కూలుకు తీసుకెళ్లి వదిలిపెట్టాడు. మనవడితో కారులో రజనీ స్కూల్‌కు వెళుతున్న ఫోటోను ఆయన కుమార్తె సౌందర్య శుక్రవారం ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేయడంతో ఈ విషయం బయటకు పొక్కింది. 
 
'ఈ రోజు నా కుమారుడు స్కూల్‌కు వెళ్ళనని మొండికేయడంతో వాడి సూపర్‌ హీరో తాత (రజనీ) పాఠశాలకు స్వయంగా తీసుకెళ్లారు. వెండితెర అయినా, నిజజీవితంలో అయినా ఎలాంటి పాత్రనైనా నా తండ్రి అద్భుతంగా పోషిస్తారు' అని ఆమె ట్వీట్ చేశారు. 
 
కాగా, సౌందర్య కుమారుడు వేద్‌ను పాఠశాల తరగతి గదిలోకి తీసుకెళ్ళిన రజనీకాంత్‌ను ఇతర పిల్లలుసంభ్రమాశ్చర్యాలతో చూశారు. ఎపుడూ వెండితెరపై కనిపించే తలైవర్ తమ కళ్లముందు ప్రత్యక్షం కావడంతో వారి ఆనందానికి హద్దే లేకుండాపోయింది. 
 
ఇదిలావుంటే, 'వేట్టయాన్‌’ సినిమా పూర్తి చేసిన రజనీకాంత్‌ ఇపుడు లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో 'కూలీ' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌లో గ్యాప్‌ లభించడంతో ప్రస్తుతం ఆయన స్థానిక పోయెస్‌ గార్డెన్‌లో ఉన్న తన నివాసంలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీమ, నెల్లూరు, అనంతపై బాబు కన్ను- టీడీపీ సభ్యత్వ డ్రైవ్‌లోనూ అదే ఊపు..

క్షమించరాని తప్పు చేసావు అన్నయ్యా...? ఆత్మాభిమానం ఉండొచ్చు.. ఆత్మహత్య?

బీజేపీ పట్ల పవన్ కల్యాణ్ మెతక వైఖరి ఎందుకు?

ముంబై నటి కాదంబరి జెత్వాని కేసు.. విచారణ ఏమైంది?

2,200 ఎకరాల్లో కేవలం 20 మంది పోలీసులే.. నాదెండ్ల మనోహర్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments