Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

డీవీ
గురువారం, 28 నవంబరు 2024 (13:10 IST)
Udvegam Movie Review
నటీనటులు: త్రిగుణ్, దీప్సిక, శ్రీకాంత్ అయ్యంగార్, సురేష్, పరుచూరి గోపాలకృష్ణ, శివ కృష్ణ, అంజలి తదితరులు 
సాంకేతికత: 
సంగీతం: కార్తిక్ కొడగండ్ల
సినిమాటోగ్రఫీ: జి.వి. అజయ్ కుమార్
ఎడిటర్: జశ్వీన్ ప్రభు
నిర్మాతలు: జి శంకర్, ఎల్ మధు
బ్యానర్స్: కళా సృష్టి ఇంటర్నేషనల్, మణిదీప్ ఎంటర్టైన్మెంట్
దర్శకుడు: మహిపాల్ రెడ్డి
పీఆర్ఓ: హరీష్, దినేష్
 
ఉద్వేగం చిత్రం
త్రిగుణ్ ప్రధాన పాత్ర పోషించిన  కోర్టు డ్రామా. మహిపాల్ రెడ్డి దర్శకత్వం వహించారు. దీప్సిక కథానాయికగా నటించగా శ్రీకాంత్ అయ్యంగార్, పరుచూరి గోపాలకృష్ణ,  సీనియర్ సురేష్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఉద్వేగం చిత్రం, మంచి అంచనాలతో నవంబర్ 29న థియేటర్లలో అడుగు పెదుతోంది. ఈ సినిమా ప్రత్యేకంగా ప్రముఖులకు చూపించారు. ఎలా ఉందో చూద్దాం.
 
కథ:
కథ తెలంగాణ నేపథ్యంలో సాగుతుంది. మహీంద్రా (త్రిగుణ్) ఓ లేయర్స్స్ ఆర్గనైజేషన్ లో లాయర్. తనదైన శైలిలో క్రిమినల్ కేసులను డీల్ చేస్తుంటాడు. అతని గురువు పరుచూరి గోపాలకృష్ణ. న్యాయం కోసం జడ్జిని సైతం ఎదిరించే కేరక్టర్. 
 
ఇక న్యాయ వృత్తి శ్వాసగా  భావించే మహీంద్రా లైఫ్ లో ప్రేయసి అమ్ములు (దీప్షిక) కూడా ప్రధాన భాగం. మహీంద్రా అనుకోకుండా గ్యాంగ్ రేప్  కేసు డీల్ చెయ్యాల్సి వస్తుంది. కేస్ ను తీవ్రంగా తీసుకుని కేసులో A2 అయిన సంపత్ అనే నిందితుడి కోసం వాదించడానికి మహీంద్రా రంగంలోకి దిగుతాడు. ఇది నచ్చని అమ్ములు మహేంద్రతో గొడవపడి విడిపోతుంది.
 
మరోవైపు  లాయర్ ప్రసాద్ (శ్రీకాంత్ అయ్యంగార్) ఈ కేస్‌లో పసలేదని నలుగురుకి శిక్ష విధించి కేస్ క్లోజ్ చేయాలని జడ్జి సమక్షంలో వాదిస్తాడు. కానీ మహీంద్రా లోతుగా పరిశోధించి a4 ముద్ధాయిని కాపాడాలని చూస్తాడు. 
 
ఆ కోణంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? ఈ గ్యాంగ్ రేప్ కేసుని మహీంద్రా ఎలా డీల్ చేశాడు? సంపత్ ని ఆధారాలతో కేసు నుంచి బయట పడేయగలిగడా? చివరికి ఏం జరిగింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
 
సమీక్ష:
లాయర్‌లకు ఉద్వేగం అనేది వృత్తిపరంగా ఎలావుంటుందో చూపించారు. సినిమా అనేది క్రైమ్, ఎమోషన్స్ మేళవింపుతో రూపొందిన పర్ఫెక్ట్ కోర్టు డ్రామా. ఎక్కువ భాగం కోర్టు లోనే జరుగుతుంది. వాదోపవాదాలు పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రాన్ని తలపిస్తాయి. ఈ క్రమంలో తెలంగాణ యాసలో డైలాగ్స్ పర్ఫెక్ట్‌గా, స్పంటేనినియంగా ఉన్నాయి. 
 
దర్శకుడు, రచయిత పనితనం కనపడింది. సాధారణంగా ఈ తరహా కోర్టు డ్రామా సినిమాల్లో బాధిత అమ్మాయి తరపున హీరో కేసు వాదించడం చూస్తుంటాం. కానీ ఇందులో బాధిత అమ్మాయి తరపున కాకుండా, A2 నిందితుడు తరపున హీరో కేసు వాదించడం అనేది కొత్త పాయింట్. దాంతో చూసే ప్రేక్షకులు.. ఓ వైపు అమ్మాయికి న్యాయం జరగాలని కోరుకుంటూనే, మరోవైపు A2 గెలవాలని కోరుకుంటారు. దాంతో సినిమా చూస్తున్నప్పుడు ఓ కొత్త అనుభూతి కలుగుతుంది. అదే ఉద్వేగం సినిమాకి బాగా ప్లస్ అయింది.
 
సినిమా కాస్త నెమ్మదిగా ప్రారంభమవుతుంది కానీ, కథలోకి వెళ్ళే కొద్దీ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. 20 నిమిషాల తర్వాత నుంచి.. సినిమా అసలు ఎక్కడా డౌన్ అవకుండా, చివరివరకూ అదే టెంపో మెయింటైన్ చేసింది. ముఖ్యంగా కోర్టు రూమ్ సన్నివేశాలు, ట్విస్ట్ లు ఎంతగానో ఆకట్టుకున్నాయి. శ్రీకాంత్ అయ్యంగార్, త్రిగుణ్ మధ్య సన్నివేశాలు అద్భుతంగా పండాయి. అలాగే త్రిగుణ్, దీప్షిక మధ్య వచ్చే సన్నివేశాలు కూడా రియాలిటీకి దగ్గరగా ఉండటంతో బాగా వర్కవుట్ అయ్యాయి. నిజ జీవితంతో పోల్చుకుంటూ, ప్రేక్షకులు ఆ సన్నివేశాలకి బాగా కనెక్ట్ అయ్యే అవకాశముంది.
 
దర్శకుడు ట్విస్ట్‌లతో ప్రేక్షకులను కట్టిపడేసేలా సినిమాని రూపొందించాడు. కొన్ని సన్నివేశాలు ఆశించిన స్థాయిలో లేనప్పటికీ.. ట్విస్ట్ లు, కథనంలో ఉన్న వేగం కారణంగా ప్రేక్షకులు సినిమాకి కనెక్ట్ అయ్యి, చివరి వరకు ఎంతో ఆసక్తితో ట్రావెల్ అవుతారు.
 
నటీనటులు:
యువ లాయర్‌గా త్రిగుణ్ స్క్రీన్ ప్రెజెన్స్‌, నటనలోనూ పరిణితి కనబరిచాడు. దీప్షిక తన పాత్రకు తగ్గట్టుగా చక్కగా నటించింది. త్రిగుణ్ తో కలిసి ఉన్న ఎమోషనల్ సన్నివేశాల్లో మెప్పించింది. త్రిగుణ్ గురువు పాత్రలో పరుచూరి గోపాలకృష్ణ ఎప్పటిలాగే తన మార్క్ చూపించారు. 
 
ఆ పాత్రలో కొంచెం డబ్బింగ్ లోపించింది. జడ్జిగా సీనియర్ నటుడు సురేష్ సీరియస్‌తో పాటు నవ్వులు పంచారు. ఇక లాయర్‌గా శ్రీకాంత్ అయ్యంగార్ మరోసారి తన విలక్షణ నటనతో ఆకట్టుకున్నారు. సీనియర్ నటుడు శివకృష్ణ కూడా తాను పోషించిన పోలీస్ పాత్రకు పూర్తి న్యాయం చేశారు.
 
సాంకేతిక నిపుణులు:
దర్శకుడు మహిపాల్ రెడ్డి ఈ కోర్టు డ్రామాను ఎలాంటి డైవర్షన్స్ లేకుండా నీట్‌గా, ఎంగేజింగ్‌గా ప్రజెంట్ చేశారు. తనదైన స్క్రీన్ ప్లే, నేరేషన్‌తో ప్రేక్షకులను చివరి వరకు కథతో ప్రయాణం చేసేలా చేయగలిగారు.
 
 జి.వి. అజయ్ కుమార్ కెమెరా పనితనం బాగానే ఉంది. జశ్వీన్ ప్రభు ఎడిటింగ్ ఇంకా మెరుగ్గా ఉండాల్సింది. మ్యూజిక్ డైరక్టర్‌గా కార్తిక్ కొడగండ్ల డీసెంట్ జాబ్ చేశారు. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి. చివరగా. చెప్పాలంటే.. ఏ4 ముద్దాయిపై సానుభూతి కోసం సన్నివేశం ఇంకా బలంగా రాసుకోవాల్సింది. 
 
అమ్మాయి ఏ4 ముద్దయి పిలవగానే రావడం, స్నేహితులు మంచి వారు కాదని తెలిపే సన్నివేశాలుపై కసరత్తు చేయాల్సింది. మొత్తంగా 'ఉద్వేగం' చిత్రం చూడాల్సిన సినిమా.
 
రేటింగ్: 3/5

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

'పప్పుగాడు' అనే మాట అనలేదు.. జగన్ అంటే అభిమానం: రామ్ గోపాల్ వర్మ (video)

చెన్నైకు 480 కిమీ దూరంలో తీవ్ర వాయుగుండం.. ఏపీకి భారీ వర్షాలు

అయ్యప్పమాల ధరించిన ఆర్టీసీ డ్రైవర్‌కు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ (Video)

లోక్‌సభ సభ్యురాలిగా ప్రియాంకా గాంధీ ప్రమాణ స్వీకారం

దక్షిణాదిలో బీజేపీ ప్రచారాస్త్రంగా పవన్ కళ్యాణ్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం