సరి కొత్త సస్పెన్స్ థ్రిల్లర్ గా మెప్పించిన హీట్ మూవీ రివ్యూ

Webdunia
శుక్రవారం, 5 మే 2023 (16:35 IST)
h e at movie
ఈ మధ్య తెలుగు సినిమాలు మర్డర్ మిస్టరీలు, సస్పెన్స్ కథలతో వస్తున్నాయి. వేటికవే భిన్నమైనవిగా చూపిస్తున్నారు. ఇప్పుడు ఈ కోవలోకి చెందిన 'హీట్‌' అనే సినిమా నేడు థియేటర్స్ లో రిలీజయింది. ఎల్ ఉందొ చూద్దాం. 
 
వర్దన్ గుర్రాల, స్నేహా ఖుషి హీరో హీరోయిన్లుగా, మోహన్ సాయి, అంబికా వాణి, అప్పాజీ అంబరీష ముఖ్యపాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాను ఎం.ఆర్.వర్మ సమర్పణలో ర్యాన్ స్టూడియోస్, కౌముది సినిమాస్ బ్యానర్ల మీద ఎం.ఆర్.వర్మ, సంజోష్ సంయుక్తంగా నిర్మించగా ఎం.ఎన్.అర్జున్, శరత్ వర్మ దర్శకత్వం వహించారు.
 
కథ: 
 హీరో వర్దన్ గుర్రాల తన బాల్య మిత్రుడుడి ప్రేమించిన అమ్మాయితోనే పెళ్ళి చేస్తాడు. ఆ రోజు నైట్ పార్టీ చేసుకోవడానికి వెళ్లగా అక్కడ తన ఫ్రెండ్, ఫ్రెండ్ వైఫ్ కనిపించకుండా పోతారు. అదే సమయంలో కొన్ని హత్యలు కూడా జరుగుతాయి. దీంతో వాళ్ళు ఏమయ్యారు, ఆ హత్యలకు హీరోకు సంబంధం ఏంటి, హీరో తన స్నేహితులని కాపాడుకున్నాడా? మధ్యలో పోలీసులు హీరో కోసం వెతకడం. వీటి వెనుక ఎవరు ఉన్నారు అనేవి మిగిలిన కథ. 
 
సమీక్ష: 
 
మొదట్లోనే హీరో ఫ్రెండ్స్ మిస్సింగ్ నుంచి ఆసక్ష్తి గా ఉంటుంది. ఏ కథ ఒక్క రాత్రిలో  జరిగినట్టు చూపించారు. తెరపై హీరో టెన్షన్ పడుతుంటే ఆ సీన్స్ కి మనం కూడా నెక్స్ట్ ఏం జరుగుతుందా అనేట్టు టెన్షన్ పడతాం. సెకండ్ హాఫ్ మరింత రసవత్తరంగా నడిపించారు. స్క్రీన్ ప్లే అద్భుతంగా రాసుకున్నారు. సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలతో హీట్ సినిమా ప్రేక్షకులని మెప్పిస్తుంది. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కి అంతా ఆశ్చర్యపోతారు. కెమెరా విజువల్స్, సంగీతం కూడా కొత్తగా ట్రై చేసి సస్పెన్స్ అంశాలకు మరింత బలం చేకూర్చారు.
 
ఇది కాన్సెప్ట్ సినిమా కాబట్టి లవ్ ట్రాక్ పెద్దగా ఉండదు. ఇతర పాత్రలు మోహన్ సాయి, అంబికా రాణి తదితరులు బాగానే నటించారు. నిర్మాతల్లో ఒకరైన వర్మ కథనం కూర్చడం విశేషం. సంభాషణలు  బాగున్నాయి. రొటీన్ కంటే భిన్నంగా ఉంది. ఇలాంటివి ఓ టిటి లో చాలా పేరుతెస్తుంది. టైటిలుకు తగినట్లు ప్రేక్షకుడు హీట్ కు గురవుతాడు. సస్పెన్సు బాగుంది. 
 
హీట్ సినిమాకు గౌతమ్ రవిరామ్ సంగీతాన్ని అందించగా, రోహిత్ బాచు కెమెరామెన్‌గా పని చేశారు. సస్పెన్సు కొత్త కథలు కోరుకునే వారికి బాగా నచ్చుతుంది. 
రేటింగ్: 2.75/5

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అబ్బా.. నారా లోకేష్ పేరు, ఫోటోను డీపీగా పెట్టి రూ.54లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు

కాపురంలో కలహాలు.. సినీ ఫక్కీలో భార్య స్కెచ్.. అదృష్టం బాగుండి భర్త..?

కృష్ణా నదికి భారీ వరద, ప్రకాశం బ్యారేజీ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక

ఢిల్లీ రాజకీయాల్లో బీఆర్ఎస్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.. కేటీఆర్ వీడియో వైరల్

మొంథా తుఫాను వల్ల రూ.5265 కోట్ల ఆర్థిక నష్టం.. చంద్రబాబు ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments