Webdunia - Bharat's app for daily news and videos

Install App

రానా దగ్గుపాటి ప్రెసెంట్ చేసిన పరేషాన్ చిత్రం ఎలా ఉందంటే.. రివ్యూ

Webdunia
శుక్రవారం, 2 జూన్ 2023 (13:04 IST)
pareshan poster
నటీనటులు: తిరువీర్, పావని కరణం, బన్నీ అబిరాన్, సాయి ప్రసన్న, అర్జున్ కృష్ణ, శృతి రియాన్, బుడ్డరఖాన్ రవి, రాజు బెడిగెల
సాంకేతికత: సినిమాటోగ్రఫీ: వాసు పెండెం, సంగీత దర్శకులు: యశ్వంత్ నాగ్, నిర్మాతలు: సిద్ధార్థ్ రాళ్లపల్లి, దర్శకుడు : రూపక్ రోనాల్డ్సన్
 
ఈమధ్య తెలంగాణ కథలు మారుమూలాలకు చెందిన సమాజంలో వారి బిహేవియర్ తో సినిమాలు రావడం మొదలు పెట్టాయి. నటీనటులుకూడా వెలుగులోకి వస్తున్నారు. అలాంటి వారిలో హారర్ థ్రిల్లర్ చిత్రం “మాసూద” తో మంచి హిట్ అందుకున్న యంగ్ నటుడు తిరువీర్ ఒకరు. తను  హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “పరేషాన్” ఈరోజు విడుదల అయింది. రెండు ఏళ్లకు పైగా విడుదలకు కష్టాలు పడుతున్న సినిమాను హీరో రానా చూసి రిలీజ్ చేయడంతో క్రేజ్ వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం. 
 
కథ :
ఐసాక్ (తిరువీర్) బాగా చదువుకున్న వాడు. ఉద్యోగం రాక తన ఫ్రెండ్స్ సత్తి, పాషా మైదక్ అలాగే ఆర్జీవీ లతో అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటారు. అంతా  సింగరేణి ప్రాంతంలోని వారే. ఐసాక్ తండ్రి కొడుకు ఉద్యోగం  కోసం కొత్త డబ్బు ఇస్తాడు. కానీ ఆ డబ్బును చివరి నిముషంలో తన ఫ్రెండ్స్ అమ్మ ఆరోగ్యం కోసం ఇస్తాడు. దాంతో ఇంట్లో గొడవ. ఫ్రెండ్స్ అంతా తాగుడుకు బానిసలే. ఇదిలాఉండగా ఐసాక్, శిరీష(పావని కరణం) తో లవ్ లో ఉండటమే కాకుండా శారీరకంగా ఒకటి కావడంతో శిరీష గర్భం దాలుస్తుంది. దాంతో ఏమిచేయాలి అనే గందరగోళంలో వారు  ఏమిచేసారు ? ఆ తర్వాత ఫ్రెండ్స్ పాత్ర ఏమిటి.. అనేదే మిగిలిన సినిమా. 
 
విశ్లేషణ: 
తిరువీర్ టక్ జగదీష్ లో నెగటివ్ రోల్ చేసారు. ఆలా కొన్ని సినిమాలు వచ్చాయి. మాసూద లో హీరోగా చేసాడు. కొన్ని వెబ్ సిరీస్ చేసాడు. నటనాపరంగా బాగానే చేసాడు. మిగిలిన పాత్రలు కూడా సహజంగా ఉన్నాయి. సంగీతం, పాటలు, కెమెరా బాగుంది. కథగా చిన్న పాయింట్ ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ పరంగా సినిమా ఉంది.  ఇందుకు  దర్శకుడు రూపక్ రోనాల్డ్సన్ కృషి కనిపించింది. సినిమాలో కొన్ని రొమాంటిక్ ట్రాక్ లు బాగున్నాయి.
 
హీరో హీరోయిన్ కెమిస్ట్రీ ఆకట్టుకుంటాయి. ఫస్టాఫ్ ఆసక్తిగా అనిపిస్తుంది.సెకండ్ హాఫ్ చుట్టేసినట్లుంది. తెలంగాణా యూత్ అంటే తాగుడు, తందానాలు ఆడటం చూపిస్తున్నారు. నాని నటించిన దసరా కూడా అంతే. అదేమిటంటే ఇక్కడ కల్చర్ అని అంటుంటారు. ఇక భాషా కూడా అలాగే ఉంటుంది. మాటల విరుపు, సెటైర్లు, బూతులు అనేవి సహజం అని చెపుతుంటారు. కానీ ఇదే గతంలో,  అంటే తెలంగాణ రాక ముందు సినిమాలో ఉంటె పెద్ద రాద్దాంతం జరిగేది. సో, తీసింది, చేసింది  తెలంగాణ వారు కాబట్టి సరిపోయింది. ఏది ఏమైనా  దర్శకుడు రూపక్ రోనాల్డ్సన్, నిర్మాత తాము ఏదిచేసిన వినోదం కోసమే అని ఫిక్స్ అయ్యారు. తనతో కొంత లాజిక్ వదిలేసాడు. 
 
కథనం రోటీన్ గానే కనిపిస్తుంది. కామెడీ కొన్ని చోట్లా ఆకట్టుకోదు. దీనితో సగం సినిమా బోర్ గానే సాగదీతగా అనిపిస్తుంది. ఇక మరికొన్ని కామెడీ సీన్స్ అయితే పెట్టారు కానీ అవి నవ్వు తెప్పించవు. కథ పెద్దగా లేకపోవడంతో సెకండాఫ్ అంత ఇంపాక్ట్ కలిగించదు. సెకండాఫ్ లో ఎడిటర్ కు పని పెట్టాలిసింది. కొన్ని అనవసరంగా ఉన్నాయి. సరైన ఎమోషనల్ కంటెంట్ కూడా ఎక్కడ లేదు. తల్లి హీరోని తిడితే అన్నము ప్లేట్ విసిరేసి వెళ్ళిపోతాడు. ఇలాంటివి యూత్ పై ప్రభావం చూపుతాయి. 
 
వాసు సినిమాటోగ్రఫీ బాగుంది. డైలాగ్స్ ఒకే.  అలాగే ఎడిటింగ్ మాత్రం ఇంకా చేయాల్సింది. యశ్వంత్ మ్యూజిక్ బాగానే చేసాడు. దర్శకుడు రూపక్ పరవాలేదు అనిపించేలా చేసాడు. కేవలం తాగుడు, కామిడి పైనే ఫోకస్ పెట్టాడు. అది కూడా సిల్లీ కామిడీగా ఉంది. ఎమోషన్స్ మిస్ అయ్యాడు. జస్ట్ రొటీన్ యావరేజ్ గా చెప్పవచ్చు. రానాకు నచ్చి ఈ సినిమా రిలీజ్ చేసాడు. పరిమిత బడ్జెట్ తో సినిమా తీశారు. ఈ మేరకు అందరిని అలరిస్తుందో చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బస్సు టర్నింగ్ ఇచ్చుకుంది.. మహిళ రోడ్డుపై ఎలా పడిందంటే? (Video)

అగ్నివీర్ అజయ్ కుమార్‌కి రూ.98లక్షలు ఎక్స్‌గ్రేషియా అందిందా లేదా?

బాలుడి కోసం కాన్వాయ్ ఆపిన పవన్ కల్యాణ్.. వీడియో వైరల్

దేశంలో కాలుష్యానికి 33 వేల మంది మృత్యువాత

అప్పుడు కాంగ్రెస్ నాయకుడు.. ఇప్పుడు టీడీపీకి విధేయుడు.. ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments