Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేజ లవ్ ట్రెండ్‌కు భిన్నంగా "నేనే రాజు నేనే మంత్రి" ... రాధ మాటే వేదమన్న జోగేంద్ర

"బాహుబలి" చిత్రంలో విలన్ పాత్రలో (బిల్లాలదేవుడు), ఆ తర్వాత 'ఘాజీ'లో హీరోగా మెప్పించిన రానా దగ్గుబాటి.. విలక్షణమైన నటుడు తేజ దర్శకత్వంలో నటించిన చిత్రం "నేనే రాజు.. నేనే మంత్రి". ఈ చిత్రం శుక్రవారం ప్ర

Webdunia
శుక్రవారం, 11 ఆగస్టు 2017 (16:08 IST)
చిత్రం : నేనే రాజు నేనే మంత్రి. 
నిర్మాణ సంస్థలు: సురేష్‌ ప్రొడక్షన్స్‌, బ్లూ పానెట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌.
నటీనటులు: రానా, కాజల్‌, కేథరిన్‌, అశుతోష్‌ రాణా, పోసాని కృష్ణమురళి, అజయ్‌, నవదీప్‌, తనికెళ్లభరణి, జయప్రకాష్‌ రెడ్డి తదితరులు.
సంగీతం: అనూప్‌ రూబెన్స్‌.
సినిమాటోగ్రఫీ: వెంకట్‌ సి.దిలీప్‌.
నిర్మాతలు: డి.సురేష్‌బాబు, కిరణ్‌రెడ్డి, భరత్‌ చౌదరి.
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తేజ.
 
"బాహుబలి" చిత్రంలో విలన్ పాత్రలో (బిల్లాలదేవుడు), ఆ తర్వాత 'ఘాజీ'లో హీరోగా మెప్పించిన రానా దగ్గుబాటి.. విలక్షణమైన నటుడు తేజ దర్శకత్వంలో నటించిన చిత్రం "నేనే రాజు.. నేనే మంత్రి". ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇటీవలి కాలంలో తేజకు అనుకున్న స్థాయిలో విజయాలు లేవు. అలాంటి దర్శకుడి దర్శకత్వంలో రానా నటించిన చిత్రమే ఇది. ఈ సినిమాలోని పొలిటికల్‌ డైలాగ్స్‌, రానా నటన సినిమాపై మంచి అంచనాలే పెంచాయి. అయితే, శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం రివ్యూను ఓసారి పరిశీలిస్తే.. 
 
కథ: 
 
ఒక ఊరిలో జోగేంద్ర(రానా), రాధ(కాజల్‌) భార్యభర్తలు. ఒకరంటే ఒకరికి అమితమైన ప్రాణం. జోగేంద్ర ధర్మ వడ్డీలకు డబ్బులు ఇస్తూ జీవనం సాగిస్తుంటాడు. పెళ్లైయిన మూడేళ్లకు రాధ గర్భవతి అవుతుంది. మొక్కు తీర్చుకోవడానికి గుడికి వెళ్లిన రాధను ఊరి సర్పంచ్‌(ప్రదీప్‌ రావత్‌) భార్య గుడిమెట్లపై నుంచి తోసేస్తుంది. దాంతో రాధ గర్భం పోతుంది. ఆ తర్వాత రాధను పరీక్షించిన వైద్యులు.. ఆమెకు ఇక పిల్లలు పుట్టరని చెపుతారు. దీంతో గ్రామ సర్పంచ్ అంటే రాధకు అమితమైన కోపం. ఆ సర్పంచ్ కుర్చీలో తన భర్త కూర్చోవాలని భావించి, ఎలాగైనా సర్పంచ్‌ కావాలని భర్త జోగేంద్రను కోరుతుంది. భార్య అంటే అమితమైన ఇష్టముండే జోగేంద్ర భార్య మాటకు కట్టుబడతాడు. తన తెలివి తేటలతో సర్పంచ్‌ అవుతాడు. తన పదవి పోవడంతో మాజీ సర్పంచ్‌, జోగిని హత్య చేయాలని చూస్తే, జోగియే మాజీ సర్పంచ్‌ను చంపిస్తాడు. 
 
జోగేంద్ర పదవి, డబ్బు, ప్రజల్లో అతనికున్న పలుకుబడిని చూసి ఎమ్మెల్యే చౌడప్ప(సత్య ప్రకాష్‌) అతన్ని పోలీసు కేసు నుండి తప్పిస్తాడు. ఈ కేసులో ఎమ్మెల్యేకు సిఐ(అజయ్‌) సహాయపడతాడు. చివరకు అజయ్‌, ఎమ్మెల్యేలు జోగిని డబ్బులు అడుగుతారు. జోగి తన తెలివితో సిఐని మరో ఊరికి బదిలీ చేయించి, ఎమ్మెల్యేను చంపేసి తాను ఎమ్మెల్యే అవుతాడు. అక్కడ నుండి జోగేంద్ర రాజకీయ చదరంగం ఆడటం మొదలు పెడతాడు. జోగేంద్రకు శివ(నవదీప్‌) కుడిభుజంలా అండగా నిలబడతాడు. రాజకీయ ప్రత్యర్థులు ఆడే ఆటలో నిజానిజాలు తెలియకుండా శివను జోగేంద్ర చంపేస్తాడు. ఆ తర్వాత ముఖ్యమంత్రి కుర్చీపై కన్నేస్తాడు. ఈ కుర్చీలాటలో చివరకు ఎవరు గెలుస్తారు? జోగేంద్ర చివరికి ఏం సాధిస్తాడు? ఏం పొగొట్టుకుంటాడు? అనేదే మిగిలిన కథ. 
 
విశ్లేషణ:
ఈ చిత్రం మొత్తం ప్రధానంగా జోగేంద్ర, రాధ పాత్రలపైనే సాగుతుంది. జోగేంద్రగా రానా, రాధగా కాజల్‌ వారి పాత్రల్లో ఒదిగిపోయారు. 'బాహుబలి', 'ఘాజీ' వంటి డిఫరెంట్‌ మూవీస్‌ చేసిన రానా 'లీడర్‌' తర్వాత చేసిన పొలిటికల్‌ జోనర్‌ మూవీ ఇది. సామాన్య వడ్డీ వ్యాపారి సీఎం కావాలనుకున్నప్పుడు అతను ఎదిగే క్రమం, అందులో అతను ఎదుర్కొనే సమస్యలు అన్నింటినీ చక్కగా చూపించారు. ఈ చిత్రంలో రానా లుక్‌ కూడా ఆకట్టుకుంటుంది. ఇక కాజల్‌ కూడా హోమ్లీ పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. ప్రీ క్లైమాక్స్‌లో హాస్పిటల్‌ సీన్‌లో కాజల్‌ నటన మెప్పిస్తుంది. ఇక నవదీప్‌ కీలక పాత్రలో తన పాత్రకు న్యాయం చేశాడు. విలన్‌ పాత్రలో అశుతోష్‌ రానా మెప్పించగా, పోసాని కృష్ణమురళి తనదైన శైలిలో సెటైరికల్‌ డైలాగ్స్‌తో ప్రేక్షకులను నవ్వించాడు. దూరదర్శన్‌ కెమెరామెన్‌గా బిత్తిరి సత్తి తనదైన యాసతో, మరోవైపు సెంట్రల్‌ జైలు సూపరిడెంట్‌ పాత్రలో జయప్రకాష్‌ రెడ్డిలు అలరించారు.
 
ఇక సాంకేతిక విషయాలకు వస్తే, దర్శకుడు తేజ ఇప్పటి వరకు లవ్‌స్టోరీతోనే పెద్ద విజయాలను సాధించాడు. ఈసారి తన ట్రెండ్‌కు భిన్నంగా చేసిన సినిమా ఇది. పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ఐదేళ్ల కాలంలో ఓ వ్యక్తి ప్రయాణాన్ని తేజ తెరకెక్కించే ప్రయత్నమే ఈ చిత్రం. స్క్రీన్‌ప్లే బాగుంది. అనూప్‌ నువ్వే నువ్వే సాంగ్‌, జోగేంద్ర టైటిల్‌ సాంగ్‌ ఇలా అన్ని మాంటేజ్‌ సాంగ్స్‌ ఒకే అనిపించాయి. వెంకట్‌ సి.దిలీప్‌ సినిమాటోగ్రఫీ బావుంది. లక్ష్మీభూపాల్‌ మాటలు సినిమాకు ప్లస్‌ అయ్యాయి. రానా సందర్భానుసారం చెప్పే సామెతలు ఆకట్టుకున్నాయి. ప్రజల గురించి చాలా మంది రాజకీయ నాయకులు ఎలా ఆలోచిస్తారు. అసలు సానుభూతి ఓట్లు వేయడం, వారసత్వ రాజకీయాలు మీద ఇలా అన్నింటిపై వచ్చే డైలాగ్స్‌ ప్రేక్షకులను మెప్పిస్తాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అసభ్యకర పోస్టులు... వర్రా వాంగ్మూలం.. పెద్ద తలకాయలకు బిగుస్తున్న ఉచ్చు!!

అవినీచమైన వ్యాఖ్యలు... నటి కస్తూరికి ముందస్తు బెయిల్ ఇవ్వలేం : మద్రాస్ హైకోర్టు

శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య

Dehradun Car Accident: మద్యం తాగి గంటకు 180 కి.మీ వేగంతో కారు, ఆరుగురు మృతి (video)

ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ రాష్ట్ర విద్యార్థి మృతి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

అరటి పండులో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం