కేరీర్ ఆరంభం నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆలరిస్తున్న టాలీవుడ్ హీరోల్లో నితిన్ ఒకరు. ఒక నిర్మాత కొడుకుగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైనప్పటికీ.. "జయం" చిత్రంతో తన కెరీర్‌ను జబర్దస్త్‌గా ప్
కేరీర్ ఆరంభం నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆలరిస్తున్న టాలీవుడ్ హీరోల్లో నితిన్ ఒకరు. ఒక నిర్మాత కొడుకుగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైనప్పటికీ.. "జయం" చిత్రంతో తన కెరీర్‌ను జబర్దస్త్‌గా ప్రారంభించాడు. "దిల్"తో సక్సెస్ అందుకున్న తర్వాత ఆశించిన మేర విజయాలను అందుకోలేకపోయాడు. పదేళ్ల తర్వాత 'ఇష్క్', 'గుండెజారి గల్లంతయ్యిందే' వంటి వరుస విజయాలతో సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చాడు నితిన్. త్రివిక్రమ్ 'అ.. ఆ... ' చిత్రంతో కలెక్షన్ల పరంగా రూ.50 కోట్ల క్లబ్ హీరోగా మారిపోయాడు.
ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. నితిన్ ఓ హీరో. కానీ, ఈయనకు హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని. అభిమాన దర్శకుడు త్రివిక్రమ్. వీరిద్దరూ కలిసి నితిన్‌తో సినిమా తీశారు. అంతేకాదు, త్రివిక్రమ్ ఈ సినిమాకు కథను అందించారు. ఇప్పుడు నితిన్ చేసిన 25వ చిత్రం 'చల్ మోహన్ రంగ'. యూత్‌ను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా టాక్ ఎలా ఉందనే సంగతి అటుంచితే, 'మోహన్ రంగ' పాత్రలో నితిన్ అదరగొట్టేశాడని అంటున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా? లేదా ? అని తెలుసుకోవాలంటే సినిమా కథలోకి వెళదాం...
కథ
మోహన్ రంగ (నితిన్) అల్లరిచిల్లరిగా తిరుగుతూ, దేన్నైనా తేలిగ్గా తీసుకునే కుర్రాడు. జీవితంలో స్థిరపడటం కోసం అమెరికాకి వెళ్ళి ఉద్యోగం చేయాలనుకుంటాడు. అయితే మూడేళ్ళ పాటు ప్రయత్నించినా వీసా మంజూరు కాదు. నాలుగో యేడాది మాత్రం సరోజ అనే బామ్మ (రోహిణి హట్టంగడి) శవాన్ని అడ్డం పెట్టుకుని అమెరికా వెళతాడు. అక్కడ అతనికి విచిత్రమైన పరిస్థితుల మధ్య మేఘ (మేఘా ఆకాశ్) అనే అమ్మాయి పరిచయమవుతుంది. క్రమంగా ఇద్దరి మధ్య చనువు పెరుగుతుంది. అది కాస్త ప్రేమగా మారుతుంది. ఆ విషయాన్ని ఒకరితో ఒకరు పంచుకోవాలని.. ఓ చోట కలుద్దామనుకుంటారు. అయితే.. భిన్నమైన మనస్తత్వాలు ఉన్న తమ మధ్య రిలేషన్ నిలబడదు అనే కారణంతో ఇద్దరు ఒకరినొకరు కలవకుండానే విడిపోతారు. వేర్వేరు కారణాలతో స్వదేశానికి వచ్చేస్తారు. అక్కడ వారిద్దరూ తిరిగి కలుకున్నారా? చిన్నప్పుడే తమ మధ్య పరిచయం ఉందన్న విషయాన్ని వాళ్ళు తెలుసుకున్నారా? మోహన్ రంగ, మేఘ ప్రేమకథ ఏ తీరాలకు చేరింది? అనేది వెండితరపైనే చూడాల్సిందే.
విశ్లేషణ:
విధి అనేది మనకు అనుకూలంగా ఉంటే మనం కావాలనుకున్నది ఎలాగైనా మనకు దక్కుతుంది. అనే కాన్సెప్ట్‌తో త్రివిక్రమ్ మళ్లీ తన స్టైల్‌లో రాసుకున్న కథే 'ఛల్ మోహన్ రంగ'. ఒకసారి జరిగితే రెండోసారి జరగదు.. ఒకవేళ రెండోసారి కూడా జరిగితే.. మూడోసారి తప్పకుండా జరుగుతుంది. ఈ కాన్సెప్ట్‌ను హీరో హీరోయిన్ పాత్రలకు ఆపాదించాడు. హీరో హీరోయిన్స్ చుట్టూ ఉండే పాత్రలు ఇంతకు ముందు త్రివిక్రమ్ గత చిత్రాల్లో కనపడినట్టు అనిపిస్తాయి. ఇందులో హీరో మందు కొట్టే సీన్ ఖుషీ సినిమాను గుర్తుకు తెస్తుంది. కృష్ణచైతన్య సినిమాను కూల్‌గా తెరకెక్కించే ప్రయత్నం మనకు కనపడుతుంది. హీరో.. హీరోయిన్ అనుకోకుండా చిన్నప్పుడే కలుసుకోవడం.. పెద్దయిన తర్వాత కలుసుకోవడం. ఓ జర్నీలో హీరోయిన్ .. హీరో మధ్య పరిచయం పెరగడం.. అది కాస్త ప్రేమగా మారడం ఇవన్నీ అన్ని చిత్రాల్లో చూస్తున్నవే.
సినిమా ఫస్టాఫ్ అంతా అమెరికాలో ఉండటం.. సెకండాఫ్ అంతా కునూర్ గెస్ట్‌హౌస్‌లో బాగా డబ్బున్న వారి మధ్య సాగుతుంది. ఫస్ట్ హాఫ్‌లో కనపడే పెద్ద పులి సాంగ్ మాత్రం యూత్‌కు బాగా నచ్చతుంది. ఇక త్రివిక్రమ్ కథల్లో కనపడే బలమైన ఎమోషన్స్ ఈ సినిమాలో ఎక్కడా కనపడదు. ఇక సాంకేతికంగా చూస్తే నటరాజన్ సినిమాటోగ్రఫీ సూపర్బ్. ట్యూన్స్ వినడానికి బావున్నాయి. పాటల పిక్చరైజేషన్, ఎడిటింగ్ బావుంది. నేపథ్య సంగీతం ఒకే. ఇక పాత్రల విషయానికి వస్తే టైటిల్ పాత్ర పోషించిన నితిన్ ఫుల్ ఎనర్జీతో నటించాడు. తన నటనతో పాత్రలో ఒదిగిపోయాడు. ఇక మేఘా ఆకాశ్.. తన తొలి సినిమా 'లై' కంటే మంచి పరిణితి కనపరిచి నటించింది. మొత్తంగా చూస్తే కామెడీ, మేకింగ్‌లో క్వాలిటీ కనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్:
నితిన్, మేఘా ఆకాశ్ నటన, సంగీతం, సినిమాటోగ్రఫీ, మేకింగ్ క్వాలిటీ.
మైనస్ పాయింట్స్:
త్రివిక్రమ్ మార్క్ పాత కథే, మాస్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే సన్నివేశాలు లేకపోవడం, సినిమాలో బలమైన ఎమోషన్స్ పండించే పాత్రలు లేకపోవడం.