Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంకటేష్.. నిజంగానే 'బాబు బంగారమే'... కానీ (రివ్యూ రిపోర్ట్)

అభిమానులు ఎపుడెపుడాని ఎదురుచూసిన "బాబు బంగారం" ఎట్టకేలకు విడుదలైంది. ''గోపాల గోపాల'' చిత్రం తర్వాత వెంకటేష్‌ హీరోగా నటిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Webdunia
శుక్రవారం, 12 ఆగస్టు 2016 (11:56 IST)
చిత్రం : బాబు బంగారం
బ్యానర్‌ : సితార క్రియేషన్స్‌
దర్శకుడు : మారుతి
నిర్మాత : నాగవంశీ, పిడివి ప్రసాద్‌
సంగీతం : గిబ్రాన్‌
రేటింగ్ : 3.5/5
విడుదల తేదీ : ఆగష్టు 12, 2016
నటీనటులు : వెంకటేష్‌, నయనతార, వెన్నెల కిషోర్‌, పోసాని కృష్ణమురళి.
 
అభిమానులు ఎపుడెపుడా అని ఎదురుచూసిన "బాబు బంగారం" శుక్రవారం విడుదలైంది. ''గోపాల గోపాల'' చిత్రం తర్వాత వెంకటేష్‌ హీరోగా నటించిన చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 'భలేభలే మగాడివోయ్‌'తో భారీ సక్సెస్‌ను అందుకున్న మారుతి ఈ సినిమాతో మరో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకోవడం ఖాయం అని అభిమానులు అంటున్నారు. ఈ నేపథ్యంలో విడుదల అయిన ఈ సినిమా ఎలా ఉంది అనేది ఈ రివ్యూలో చూద్దాం.
 
కథలోకి వెళితే : ఏసీపీ కృష్ణ (వెంకటేష్‌) ఒక మర్డర్‌ కేసును డీల్ చేస్తాడు. ఆ మర్డర్‌ కేసుకు సంబంధించిన ఒక వీడియో శైలజ(నయనతార) తండ్రి వద్ద ఉందనే విషయం కృష్ణకు తెలుస్తుంది. దాంతో శైలజకు దగ్గరై.. నిజంగానే ఆమెను ప్రేమిస్తాడు. కానీ కొన్ని కారణాల వల్ల నయనతార మాత్రం కృష్ణ కేసు కోసమే తనని ప్రేమించాడని అనుకుని అతనితో లవ్ బ్రేకప్ చేసుకుంటుంది. ఆ తర్వాత కృష్ణ ఆ కేసును ఎలా పరిష్కరిస్తాడు, శైలజ ప్రేమను ఎలా పొందుతాడు అనేది మిగిలిన కథ.
 
నటీనటుల ఫర్ఫార్మెన్స్‌ : వెంకటేష్‌ ఎప్పటిలాగే ఫన్నీగా చాలా ఎనర్జిటిక్‌గా కనిపించాడు. కామెడీ పోలీస్‌ ఆఫీసర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. బాడీలాంగ్వేజ్‌, డైలాగ్‌ డెలవరీతో అందరిని మెప్పించాడు. ఈ చిత్రంలో మంచి నటన కనబర్చి నిజంగానే బాబు బంగారం అనిపించుకున్నాడు. మళయాళీ భామ నయనతార కూడా ఈ పాత్రకు తన వంతు న్యాయం చేసింది. ఎమోషన్‌ సీన్స్‌తో పాటు లవ్‌ సీన్స్‌లలో కూడా తన యాక్టింగ్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందం, అభినయంతో మెప్పించింది. పోసాని సీరియస్‌ రోల్‌లో కామెడీ చేసి మెప్పించాడు. పృథ్వీ ''బత్తాయి బాబ్జీ'' పాత్రలో చాలా బాగా నవ్వించాడు. అతని కోసం మారుతి రాసుకున్న క్యారెక్టర్ బాగా వర్కవుటైంది.
 
సాంకేతికపరంగా: జిబ్రాన్‌ అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా రెండు పాటలు సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాయి. బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ కూడా బాగుంది. సన్నివేశాలకు తగ్గట్లుగా జిబ్రాన్‌ సంగీతాన్ని అందించి ఆకట్టుకున్నాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ముఖ్యంగా యాక్షన్‌ సన్నివేశాల్లో సినిమాటోగ్రఫీ ఆకట్టుకునే విధంగా ఉంది. ఎడిటింగ్‌ చిన్న చిన్న లోపాలున్నాయి. నిర్మాణ విలువలు చాలా గొప్పగా ఉన్నాయి. కెమెరా వర్క్ చాలా బాగుంది.

దర్శకుడు మారుతి వెంకటేష్ నుండి రెండు వేరియేషన్లలో నటనను రాబట్టడంలో తన టాలెంట్‌ని నిరూపించుకున్నాడు. మొదటి‌పార్ట్‌ను చాలా కామెడీగా చూపించిన సెంకడ్ హాఫ్ మాత్రం సీరియస్‌గా సాగింది. దర్శకుడు మారుతి ఫుల్‌లెంగ్త్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సినిమాను సాగించాడు. అయితే ఫస్ట్‌హాఫ్‌లో కథను మరింత ఆసక్తికరంగా నడిపించి ఉంటే బాగుండేదనిపిస్తుంది.
 
మైనస్ పాయింట్స్ :
మైనస్ పాయింట్స్ విషయంలో ముందుగా చెప్పుకోవాల్సింది కథ గురించి. కథ రొటీన్‌గా అనిపించింది. సినిమా నడుస్తున్నంత సేపు తర్వాత ఏం జరుగుతుందో ఇట్టే ఊహించేయ్యొవచ్చు. దర్శకుడు మారుతి వెంకటేష్, ఆయన స్టార్‌డమ్ చుట్టూ కథను అల్లుకునే విధంగా రూపొందించాడు. సినిమా రెండో భాగం చాలా వరకూ సీరియస్‌గానే సాగుతుందే తప్పు పెద్దగా చెప్పుకోదగ్గ కథనం కూడా లేదు. పోసాని తన కామెడీతో ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ విఫలం అయ్యాడు. అలాగే మొదటి భాగం తర్వాత సినిమాలోని ట్విస్ట్ కూడా తెలిసిపోవడంతో మిగతా సినిమాపై ఆసక్తి తగ్గుతుంది.
 
ఫైనల్ పాయింట్ :
మొత్తం మీద బాబు బంగారం చిత్రం వెంకటేష్‌ను చాలా రోజుల తరువాత ఓ ఆసక్తికరమైన పాత్రలో చూపించింది. వెంకటేష్ నటనలో చూపిన భిన్నత్వం, మొదటి హాఫ్‌లో సాగే కామెడీ అభిమానులను ఆకట్టుకుంటుంది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం సీరియస్‌గా నడుస్తూ కాస్త బోర్ కొట్టిస్తుంది. ఏది ఏమైనా మారుతి కథను బాగానే రూపొందించాడు. రొటీన్ స్టోరీ అన్న విషయాన్ని మర్చిపోతే కుటుంబంతో వెళ్లి ఈ టైమ్ పాస్ ఎంటర్టైనర్‌ను చూసి హాయిగా ఎంజాయ్ చెయ్యొచ్చు. 
 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments