Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ది ఫాగ్' ట్రైలర్‌ను విడుదల చేసిన తమ్మారెడ్డి భరద్వాజ్

కొత్త కథలతో కొత్త కథనాలతో తెలుగు సినిమా వెలిగిపోతుంది. ఘాజి, అర్జున్ రెడ్డి, ఆర్ ఎక్స్ 100, కేర్ అఫ్ కంచెరపాలం ఇలా ఎన్నో కొత్త చిత్రాలతో కొత్త కథనంతో కొత్త నటీనటులతో విడుదలై విజయవంతం అయ్యాయి. ఇప్పుడు మరో చిత్రం మరో కొత్త అంశంతో తెలుగు ప్రేక్షకుల ముం

Webdunia
శనివారం, 8 సెప్టెంబరు 2018 (16:08 IST)
కొత్త కథలతో కొత్త కథనాలతో తెలుగు సినిమా వెలిగిపోతుంది. ఘాజి, అర్జున్ రెడ్డి, ఆర్ ఎక్స్ 100, కేర్ అఫ్ కంచెరపాలం ఇలా ఎన్నో కొత్త చిత్రాలతో  కొత్త కథనంతో కొత్త నటీనటులతో విడుదలై విజయవంతం అయ్యాయి. ఇప్పుడు మరో చిత్రం మరో కొత్త అంశంతో తెలుగు ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. 
 
మ్యాజిక్ లైట్స్ స్టూడియోస్ మరియు వర్షి మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఎమ్ వి రెడ్డి నిర్మాతగా కొత్త నటీనటులతో "ది ఫాగ్" అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మధుసూదన్ దర్శకుడు. అయితే ఈ చిత్రానికి సంబందించిన మొదటి ట్రైలర్‌ను ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ చేతులమీదుగా విడుదల చేసారు. 
 
ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ "ఎమ్ వి రెడ్డి నిర్మాతగా మధుసూదన్ దర్శకత్వం లో వస్తున్నా సినిమా "ది ఫాగ్". ఈ సినిమా ట్రైలర్ ఇప్పుడే చూసాను. సినిమా చాలా కొత్తగా ఉంది. కొత్త కెమెరాతో ఎటువంటి లైట్స్ లేకుండా కొత్త లొకేషన్స్‌లో సున్నా ఉష్ణోగ్రతలో హాలీవుడ్ స్టైల్‌లో తీశారు. ట్రైలర్ చాలా బాగుంది. చిన్న సినిమా అంటున్నారు కానీ చాలా పెద్ద సినిమాగా కనిపిస్తుంది. ఈ రోజుల్లో మనకి తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీ సినిమా కావాలి, ఆలా తీస్తే సినిమాకి మంచి లాభం వస్తుంది అని నా అంచనా. ఈ సినిమా దర్శకుడు మధుసూదన్ కెరీర్‌కి మరియు తెలుగు సినిమాకి మంచి మలుపు అవుతుంది" అని అన్నారు. 
 
నటీనటులు : విరాట్  చంద్ర, హరిణి, చందన, ఆత్మనంద, ప్రణీత, సతీష్ రెడ్డి, ప్రమోద్, చందు, మహేష్ రాజు, సాంకేతికనిపుణులు : కెమెరా : యల్లనూరు హరినాథ్, సతీష్ రెడ్డి, మ్యూజిక్: సందీప్, పిఆర్ఓ మధు బాబు VR, కో -ప్రొడ్యూసర్ : గోవర్ధన్  రెడ్డి, ప్రొడ్యూసర్ : M V రెడ్డి, డైరెక్టర్: మధుసూదన్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మార్నింగ్ వాక్ నుంచి మ్యారేజ్ వరకు.. 60 యేళ్ల వయసులో 51 యేళ్ల మహిళను పెళ్లాడిన దిలీప్ ఘోష్

lady don zikra అరేయ్ గూట్లే... నా బ్రదర్‌ను పొడిచినోడిని లేపేయ్?!: లేడీ డాన్ జిక్రా హస్తం?!!

ఏపీ నుంచి రాజ్యసభ స్థానానికి తమిళనాడు బీజేపీ నేత అన్నామలై?

ఈ రాత్రి నా భర్తను చంపేద్దాం.. ఆపై పామును వదిలేద్దాం.. పనైపోతుంది.. ప్రియుడితో..?

వైకాపాలో 2వ స్థానం నుంచి 2 వేల స్థానానికి చేర్చారు : విజయసాయి రెడ్డి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments