Webdunia - Bharat's app for daily news and videos

Install App

శైల‌జారెడ్డి అల్లుడు సెకండ్ సింగిల్ రెడీ..!

అక్కినేని నాగ చైత‌న్య హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం శైల‌జారెడ్డి అల్లుడు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో నాగ‌ వంశీ నిర్మిస్తున్నారు. నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తోన్న ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలకమైన పాత్రను పోషిస

Webdunia
బుధవారం, 15 ఆగస్టు 2018 (18:28 IST)
అక్కినేని నాగ చైత‌న్య హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం శైల‌జారెడ్డి అల్లుడు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో నాగ‌ వంశీ నిర్మిస్తున్నారు. నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తోన్న ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. గోవాలో చైతు, అనూ ఇమ్మాన్యుయేల్ పైన ఒక రొమాంటిక్ సాంగ్‌ను శేఖ‌ర్ మాస్ట‌ర్ నృత్య ద‌ర్శ‌క‌త్వంలో చిత్రీక‌రించారు. ఈ పాట యూత్‌కి బాగా క‌నెక్ట్ అవుతుందంటున్నారు చిత్ర యూనిట్.
 
ఈ పాట చిత్రీకరణతో ఈ సినిమా షూటింగు పార్ట్ పూర్తయింది. ఈ సంద‌ర్భంగా డైరెక్ట‌ర్ మారుతి ట్విట్ట‌ర్లో స్పందిస్తూ... సెకండ్ సింగిల్‌ను ఈ నెల 16న రిలీజ్ చేయ‌నున్నాం. ఈ పాట కూడా అంద‌రికీ న‌చ్చుతుంది అనుకుంటున్నాను అన్నారు. ఇక ఈ మూవీని గ్రాండ్‌గా ఈ నెల 31వ తేదీన విడుదల చేయనున్నారు. ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. మ‌రి.. అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగా శైల‌జారెడ్డి అల్లుడు అంద‌ర్నీ ఆకట్టుకుంటాడ‌ని ఆశిద్దాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొండ నాలుకకు మందు ఇస్తే ఉన్న నాలుక ఊడిపోయింది...

కాంగ్రెస్ నేతపై వాటర్ బాటిల్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాడి

వీధి కుక్కలను వెంటాడి కాల్చిన చంపిన వ్యక్తి, ఎందుకంటే? (video)

ధర్మస్థల కేసులో బిగ్ ట్విస్ట్ - తవ్వకాల్లో బయటపడిన అస్థిపంజరం

తిరుప్పూర్ ఎస్ఐను నరికిచంపిన నిందితుడి కాల్చివేత.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments