Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయి ధరమ్ తేజ్ - అనిల్ రావిపూడిల 'సుప్రీమ్' మే 5 విడుదల

'సుప్రీమ్' హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా, బబ్లీ బ్యూటీ రాశీ ఖన్నా హీరోయిన్‌గా, 'పటాస్' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'సుప్రీమ్'. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమ

Webdunia
శుక్రవారం, 29 ఏప్రియల్ 2016 (21:07 IST)
'సుప్రీమ్' హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా, బబ్లీ బ్యూటీ రాశీ ఖన్నా హీరోయిన్‌గా, 'పటాస్' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'సుప్రీమ్'. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో, శిరీష్ నిర్మిస్తోన్న ఈ చిత్రం నేడు సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ లభించింది.
 
సుప్రీమ్ మే 5న భారీ విడుదలకు సిద్ధం అవుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలే ఉన్నాయి. పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రాల తరువాత శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థతో సాయి ధరమ్ తేజ్ చేస్తోన్న మూడవ చిత్రం ఇది.
 
"సుప్రీమ్ అందరినీ అలరించే ఒక మాస్ ఎంటర్టైనర్. వేసవి సెలవుల్లో కుటుంబ సమేతంగా చూసి ఎంజాయ్ చేసే చిత్రం. మే 5న భారీ విడుదల చేస్తున్నాం. ఇటీవలే విడుదల చేసిన ఆడియోకు మంచి స్పందన వస్తోంది. సాయి కార్తీక్ అందించిన పాటలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి ", అని శిరీష్ అన్నారు. దర్శకులు అనిల్ రావిపూడి మాట్లాడుతూ, "మంచి ఎంటర్టైన్మెంట్ ఉన్న ఒక మాస్ చిత్రం ఇది. యాక్షన్, కామెడీ, రొమాన్స్, ఫ్యామిలీ సెంటిమెంట్ సమపాళ్ళలో ఉండే చిత్రం ఇది. సాయి ధరమ్ తేజ్ డాన్స్ అండ్ పెర్ఫార్మన్స్ ఆకట్టుకుంటుంది", అన్నారు.
 
సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా, రాజేంద్ర ప్రసాద్, రవి కిషన్, సాయి కుమార్, పోసాని కృష్ణ మురళి, శ్రీనివాస్ రెడ్డి, మురళీ మోహన్, రఘు బాబు, జయప్రకాశ్ రెడ్డి, వెన్నెల కిషోర్ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments