Webdunia - Bharat's app for daily news and videos

Install App

న‌య‌నతార కో.. కో.. కోకిల అంటూ వ‌చ్చేది ఎప్పుడో తెలుసా..?

లేడీ సూప‌ర్‌స్టార్ న‌య‌న‌తార టైటిల్ రోల్‌లో నెల్సన్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మించిన చిత్రం `కో.. కో.. కోకిల‌`. ఇటీవ‌ల త‌మిళంలో `కోల‌మావు కోకిల‌` పేరుతో విడుద‌లైన ఈ చిత్రం సెన్సేష‌న‌ల్ హిట్ టాక్‌తో.. అద్వితీయ‌మైన క‌

Webdunia
శనివారం, 25 ఆగస్టు 2018 (21:13 IST)
లేడీ సూప‌ర్‌స్టార్ న‌య‌న‌తార టైటిల్ రోల్‌లో నెల్సన్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మించిన చిత్రం `కో.. కో.. కోకిల‌`. ఇటీవ‌ల త‌మిళంలో `కోల‌మావు కోకిల‌` పేరుతో విడుద‌లైన ఈ చిత్రం సెన్సేష‌న‌ల్ హిట్ టాక్‌తో.. అద్వితీయ‌మైన క‌లెక్ష‌న్స్‌తో బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేస్తుంది. ఈ చిత్రాన్ని తెలుగులో `కో.. కో.. కోకిల‌` పేరుతో ఈ నెల‌ 31న విడుద‌ల చేస్తున్నారు. 
 
ఈ సంద‌ర్భంగా లైకా ప్రొడ‌క్ష‌న్స్ ప్ర‌తినిధి మాట్లాడుతూ... ప్ర‌స్తుతం ద‌క్షిణాది లేడీ సూప‌ర్‌స్టార్‌గా నయ‌న‌తారకు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆమె న‌టించిన కో కో కోకిల సినిమాకు స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి. బాలీవుడ్ ద‌ర్శ‌కుడు క‌ర‌ణ్ జోహార్‌తో పాటు స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌, సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ మా సినిమా చూసి అభినందించారు. వారి అభినంద‌నలు మాకెంతో ఉత్సాహాన్ని ఇచ్చాయి. 
 
ఓ సాధార‌ణ‌మైన అమ్మాయి.. ఓ స్మ‌గ్లింగ్ గ్యాంగ్ చేతిలో అనుకోకుండా చిక్కుకుపోతుంది. అటువంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల నుండి ఆమె ఎలా బ‌య‌ట‌ప‌డింద‌నేదే  పాయింట్‌ను డైరెక్ట‌ర్ నెల్స‌న్ ఆస‌క్తిక‌రంగా తెర‌కెక్కించారు. ఈ సినిమా త‌మిళంలో తిరుగులేని విజ‌యాన్ని సొంతం చేసుకుంది. యోగిబాబు కామెడీ సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ కానుంది. శివకుమార్ విజ‌య‌న్ సినిమాటోగ్ర‌ఫీ.. అనిరుధ్ ర‌విచంద్ర‌న్ మ్యూజిక్‌.. నెల్స‌న్ టేకింగ్‌.. న‌య‌న‌తార న‌ట‌న సినిమాకు పెద్ద ఎసెట్‌గా నిలిచాయి. ఈ చిత్రాన్ని ఆగ‌స్ట్ 31న తెలుగులో గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం అన్నారు. 
 
న‌య‌న‌తార, యోగిబాబు, శ‌ర‌ణ్య పొన్‌వ‌న్న‌న్ తారాగ‌ణంగా న‌టించిన ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్ ర‌విచంద్ర‌న్‌, కెమెరా: శివ‌కుమార్ విజ‌య‌న్‌, నిర్మాణం:  లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, ద‌ర్శ‌క‌త్వం: నెల్స‌న్‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీమ, నెల్లూరు, అనంతపై బాబు కన్ను- టీడీపీ సభ్యత్వ డ్రైవ్‌లోనూ అదే ఊపు..

క్షమించరాని తప్పు చేసావు అన్నయ్యా...? ఆత్మాభిమానం ఉండొచ్చు.. ఆత్మహత్య?

బీజేపీ పట్ల పవన్ కల్యాణ్ మెతక వైఖరి ఎందుకు?

ముంబై నటి కాదంబరి జెత్వాని కేసు.. విచారణ ఏమైంది?

2,200 ఎకరాల్లో కేవలం 20 మంది పోలీసులే.. నాదెండ్ల మనోహర్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments