Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ్యోతిక ఝాన్సీ రిలీజ్ డేట్ ఫిక్స్..!

తమిళంలో విడుదలై భారీ విజయం సాధించిన నాచియార్ చిత్రం తెలుగులో ఝాన్సీ పేరుతో విడుదలకు రెడీ అయ్యింది. జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాపై పాజిటివ్ టాక్ ఉంది. కోనేరు కల్పన, అభిరాం అజయ్ కుమార్ కలిసి కల్పనా చిత్ర మరియు యశ్వంత్ మూవీస్ బ్యానర్ ద్వారా

Webdunia
శనివారం, 11 ఆగస్టు 2018 (18:55 IST)
తమిళంలో విడుదలై భారీ విజయం సాధించిన నాచియార్ చిత్రం తెలుగులో ఝాన్సీ పేరుతో విడుదలకు రెడీ అయ్యింది. జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాపై పాజిటివ్ టాక్ ఉంది. కోనేరు కల్పన, అభిరాం అజయ్ కుమార్ కలిసి కల్పనా చిత్ర మరియు యశ్వంత్ మూవీస్ బ్యానర్ ద్వారా  సంయుక్తంగా తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. ఈ నెల‌ 17న విడుదలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
సంచలన దర్శకుడు బాల తన కెరీర్లో ఎన్నో అద్భుతమైన సినిమా తీశారు. విక్రమ్ నటించిన సేతు, సూర్య నటించిన నందా, సెన్సషనల్ హిట్ అయినా శివపుత్రుడు, విశాల్‌తో వాడు వీడు, ఇలా ఎన్నో విజయాలు అందుకున్న బాల జ్యోతికతో నాచియార్ సినిమా తీశారు. 
 
తమిళనాడులో ఘన విజయం సాధించింది. జ్యోతిక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్‌లో కనబడుతుంది. ఇళయరాజా సంగీతం మరో హైలైట్. జి వి ప్రకాష్ మరో కీలక పాత్రలో కనిపిస్తారు. ఈ సందర్భంగా నిర్మాతలు కోనేరు కల్పన మాట్లాడుతూ... నాచియార్ చిత్రం తమిళంలో ఘన విజయం సాధించింది. స‌న్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ బాల దర్శకత్వంలో నిర్మించబడిన ఈ చిత్రంతో జ్యోతిక తెలుగులో కొంతకాలం గ్యాప్ తరువాత వస్తున్న ఈ చిత్రాన్ని విడుదల చేయటం మాకు చాలా ఆనందంగా ఉంది. 
 
బాల అద్భుతమైన దర్శకత్వం ఒక్క ఎత్తయితే జ్యోతిక నటన మరో ఎత్తు. వీరి ఇద్దరి కలయికలో వచ్చిన ఈ సినిమా తమిళనాడు అంతటా విజయవంతంగా ప్రదర్శింపబడినది. ఇప్పుడు ఈ సినిమా తెలుగులో ఝాన్సీ అనే పవర్‌ఫుల్ టైటిల్‌తో ఆగష్టు 17న విడుదలకు సిద్ధంగా ఉంది. తమిళంలో ఎంతో విజయం సాధించిన ఈ సినిమాపై తెలుగులో అంచనాలు భారీగా ఉన్నాయి అని తెలిపారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments