బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన తల్లీ కుమార్తెల వ్యవహారం...

ఠాగూర్
బుధవారం, 13 నవంబరు 2024 (16:38 IST)
బుల్లితెర నటి రూపాలీ గంగూలీ సారాభాయ్ వర్సెస్ సారాభాయ్, అనుపమ అనే సీరియల్స్‌తో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో "ప్రేమంటే ఇంతే" అనే సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో నటించింది. టెలివిజన్ ఇండస్ట్రీలోనే రిచ్చెస్ట్ నటిగా రూపాలీ రికార్డ్ క్రియేట్ చేసింది. 2013లో వ్యాపారవేత్త అశ్విన్ కె వర్మను వివాహం చేసుకుంది. అప్పటికే అశ్విన్‌కు పెళ్లి అయ్యి ఒక కూతురు కూడా ఉంది. ఆమె పేరే ఇషా. రూపాలీని పెళ్లి చేసుకోవడానికే అశ్విన్.. ఇషా తల్లి స్వప్నకు విడాకులు ఇచ్చినట్లు తెలుస్తోంది. అశ్విన్‌కు రూపాలీకి ఒక బాబు కూడా ఉన్నాడు. నిత్యం సోషల్ మీడియాలో ఆమె తన కుటుంబంతో కలిసి దిగిన ఫోటోలను రూపాలీ షేర్ చేస్తూ ఉంటుంది. 
 
ఈ నేపథ్యంలో రూపాలీ గురించి సవతి కూతురు అయినా ఇషా ఒక వీడియోలో సంచలన వ్యాఖ్యలు చేసింది. "నా తండ్రిని ఆమె దూరం చేసింది. నా తల్లికి అన్యాయం చేసింది. పెళ్లి అయిన మగాడితో సంబంధం పెట్టుకొని నా కుటుంబాన్ని విడగొట్టింది. బలవంతంగా నా తండ్రి చేత విడాకుల పత్రాలపై సంతకం చేసేలా చేసింది. రూపాలీ కోసమే మా నాన్న మలేషియా వదిలి భారత్‌కు వెళ్ళిపోయాడు. మరో మగాడే లేనట్లు.. పెళ్లి అయిన మగాడితో సంబంధం పెట్టుకోవడం తప్పు అంటూ మాట్లాడింది". ఈ వీడియో నెట్టింట పెద్ద దుమారాన్నే రేపింది.  వీడియోపై రూపాలీ కూడా సీరియస్ అయ్యింది. ఇషాపై పరువు నష్టం దావా వేస్తూ. లీగల్ నోటిసులు పంపించింది. దీంతో ఇషా ఆ వీడియోను డిలీట్ చేసింది. తన ఇన్‌స్టా అకౌంట్‌ను ప్రైవేట్‌లో పెట్టింది. బాలీవుడ్‌లో ఇప్పుడీ సనతీ తల్లీ కూతుళ్ల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

YSRCP: కోటి సంతకాల సేకరణ.. ప్రైవేట్ చేతికి వైద్య కళాశాలలను అప్పగిస్తారా? రోజా ఫైర్

నరసాపురం - చెన్నై వందే భారత్ రైలు ప్రారంభం ... 17 నుంచి పూర్తి సేవలు

ఆలస్యంగా నడుస్తున్న ఇండిగో విమానాలు: పరుపుతో సహా విమానాశ్రయానికి ప్రయాణికుడు (video)

బ్యాంకు ఏజెంట్ దారుణ హత్య... గోనె సంచిలో కట్టి.. కారులో బంధించి నిప్పంటించారు..

Orvakal: ఫార్మాస్యూటికల్ హబ్‌గా అభివృద్ధి చెందుతోన్న ఓర్వకల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

తర్వాతి కథనం
Show comments