Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్ఆర్ఆర్ టీజర్‌తోనే వివాదాస్పదం, కొమురం భీంకి పాలాభిషేకం, ఏమైంది?

Webdunia
శనివారం, 24 అక్టోబరు 2020 (21:38 IST)
ఆర్.ఆర్.ఆర్. కరోనా ముందు నుంచి తెలుగు ప్రేక్షకుల్లో హీట్ రేపుతున్న సినిమా. సినిమా షూటింగ్ కాస్త ఆలస్యమవుతున్నా ఇద్దరు ప్రముఖ యువ హీరోలతో తెరకెక్కుతున్న చిత్రమిది. ఈ సినిమాపై భారీ అంచనాలే ప్రేక్షకుల్లో ఉన్నాయి. ఈ టీజర్ కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూశారు అభిమానులు.
 
అయితే టీజర్ విడుదలైంది. కోట్లాదిమంది అభిమానులు తిలకించారు. కానీ ఇదే అసలు సమస్యగా మారింది. టీజర్ కాస్త వివాదాస్పదంగా మారింది. అందుకు కారణం కొమురం భీమ్ ముస్లిం టోపీ ధరించడమే. ఇందులో ఎన్టీఆర్ కొమురం భీంగా నటిస్తున్నాడు.
 
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో ఉన్న కొమురం భీం ప్రాంగణంలో ఉన్న కోమురం భీమ్ విగ్రహానికి యువసేన నేతలు పాలాభిషేకం చేశారు. భీమ్‌కు టోపీ ఎలా పెడతారని ప్రశ్నించారు. కొమురం భీమ్ నిజాం నిరంకశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశారని.. ఆయన చరిత్ర గురించి అసలు రాజమౌళి సరిగ్గా తెలుసుకోకుండా సినిమా తీస్తున్నారంటూ మండిపడ్డారు. ఇష్టం వచ్చినట్లు సినిమా తీసి తమ మనోభావాలు దెబ్బ తినేవిధంగా ప్రవర్తిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments