వై.ఎస్ జీవిత కథ ఆధారంగా యాత్ర అనే సినిమాను ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఆనందో బ్రహ్మ డైరెక్టర్ మహి వి రాఘవ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో వై.ఎస్ పాత్రను మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవల
వై.ఎస్ జీవిత కథ ఆధారంగా యాత్ర అనే సినిమాను ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఆనందో బ్రహ్మ డైరెక్టర్ మహి వి రాఘవ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో వై.ఎస్ పాత్రను మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇందులో సుహాసిని, అనసూయ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా వై.ఎస్ తండ్రి పాత్రకు జగపతిబాబుని ఎంపిక చేసారు.
ఇదిలాఉంటే.. ఈ మూవీ టీజర్ రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. డేట్ కూడా ఫిక్స్ చేసేసారు. ఇంతకీ ఎప్పుడంటే.. వై.ఎస్ జయంతి రోజైనా జులై 8న యాత్ర టీజర్ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మా సినిమాలను నిర్మించిన విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ బయోపిక్‌ను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పక్కా ప్లాన్‌తో షూటింగ్ జరుపుకుంటోంది. యాత్ర బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుందని ఆశిద్దాం.