చిన్ను క్రిష్, గీతిక రతన్ జంటగా, ప్రసాద్ ఏలూరి దర్శకత్వంలో సముద్రాల సినీ క్రియేషన్స్ బ్యానర్ పై సముద్రాల మంత్రయ్య బాబు నిర్మాతగా నిర్మించిన సినిమా 'లవ్ యు రా'. ఈ చిత్రంలోని 'యూత్ అబ్బా మేము' అనే పాటను తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేయగా ఇప్పుడు యూట్యూబ్ లో ఈ పాట మంచి స్పందన అందుకుంటుంది. కంచరపాలెం మ్యూజిక్ డైరెక్టర్ స్వీకర్ అగస్థి పాడారు, పాటలు రత్నం బట్లురి రాయగా, ఈశ్వర్ పెరవలి సంగీతం సమకూర్చిన ఈసినిమా కి రవి బైపల్లి సినిమాటోగ్రఫీ అందించారు. బ్రదర్ ఆనంద్ కొరియోగ్రఫీ అందించారు. ఇంకా ఈ సినిమా లో శేఖర్ బండి, సాయినాగ్, మధుప్రియ, దివ్య, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ షేకింగ్ శేషు, జబర్దస్త్ నాగిరెడ్డి, జబర్దస్త్ చిట్టి బాబు, జబర్దస్త్ కట్టప్ప ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.
ఈ సందర్భంగా నిర్మాత సముద్రాల మంత్రయ్య బాబు మాట్లాడుతూ, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అద్భుతమైన కథతో సినిమాను తెరకెక్కించాం. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను చేసుకుంటుంది. త్వరలోనే విడుదల తేదీతో ప్రేక్షకుల ముందుకు వస్తాం అన్నారు.
దర్శకుడు ప్రసాద్ ఏలూరి మాట్లాడుతూ, ఈ సినిమా గురించి చెప్పాలంటే ఈ కథ ను వినగానే ఒకే చేసిన నిర్మాతగారికి కృతజ్ఞతలు. త్వరలోనే ఈ సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అన్నారు.