Webdunia - Bharat's app for daily news and videos

Install App

యంగ్ టైగర్ తీసుకున్న నిర్ణయాలు, వ్యక్తిగత సిబ్బంది కోసం ఏం చేసాడో తెలుసా?

Webdunia
శుక్రవారం, 8 మే 2020 (20:49 IST)
చక్కటి నటన, అద్భుతమైన డైలాగ్ డెలివరీలో తాతకు తగ్గ మనవడు అనిపించుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కేవలం సినిమాల పరంగానే కాకుండా తన అభిమానులు, ప్రజల పట్ల ప్రేమను చూపిస్తూ, సామాజిక సమస్యలపై స్పందిస్తూ అంతకు మించి మంచి పేరును తెచ్చుకున్నాడు.
 
ఒక్కో సినిమాకు మరింతగా పరిణితి చెందిన నటుడిగా ఎదుగుతూనే ఆపద సమయంలో తనను నమ్ముకున్నవారికి చేయూతనిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. కరోనా కష్టాల నుండి సినీ కార్మికులను కాపాడటానికి సీసీసీ (కరోనా క్రైసిస్ ఛారిటీ) ఏర్పాటు చేసి, దానికి రూ. 25 లక్షల విరాళం అందించాడు, ఆ తర్వాత పరిశ్రమలోని హీరోలంతా కూడా దీనికి విరాళాలు ఇచ్చారు. దీనితో పాటుగా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా విరాళం అందించాడు.
 
ఇక తన వద్ద పని చేస్తున్న వ్యక్తిగత సిబ్బందికి ఇప్పుడు మరో సాయం అందించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. తన వద్ద నమ్మకంగా పని చేస్తున్న టీమ్ సభ్యుల యొక్క కుటుంబాల పూర్తి బాధ్యతను ఎన్టీఆర్ తీసుకున్నాడు. కరోనా లాక్ డౌన్ ఉన్నంత కాలం వారి బాధ్యతలను తానే తీసుకుంటానని ప్రకటించాడు. వారి వేతనాన్ని పెంచడంతో పాటుగా రాబోయే రోజులలో వారికి ఏ ఆపద వచ్చినా తాను చూసుకుంటానని హామీ ఇచ్చాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మైన‌ర్ బాలిక‌పై లైంగిక దాడి- గర్భం దాల్చింది.. ఫన్ బకెట్ భార్గవ్‌కు 20 ఏళ్లు జైలు

పిన్నాపురంలో పవన్ పర్యటన.. హెలికాప్టర్‌ ద్వారా సోలార్ పవర్ ప్రాజెక్ట్ పరిశీలన (video)

ఘనంగా ఘట్కేసర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 6 వార్షికోత్సవం: ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

Konda Pochamma Sagar Reservoir: సెల్ఫీ పిచ్చి.. ఐదుగురు యువకులు మృతి (video)

Pawan Kalyan: రూ.10 లక్షల విలువైన పుస్తకాలకు ఆర్డర్ చేసిన పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments