సస్పెన్స్ థ్రిల్లర్ సబ్జెక్టుతో కారుణ్య శ్రేయాన్స్ ఫిలింస్ చిత్రం

డీవీ
బుధవారం, 20 మార్చి 2024 (16:59 IST)
clap by Tummalapalli Rama Satyanarayana
యస్వంత్, సాయితేజ, అరుషి, నిఖిల హీరోలు హీరోయిన్లుగా ఊర శ్రీనివాస్ దర్శకత్వంలో చిత్రం పూజ కార్యక్రమాలతో నేడు ఫిలిం ఛాంబర్ లో ప్రారంభ‌మైంది. సస్పెన్స్ థ్రిల్లర్ సబ్జెక్టుతో రూపొందుతోంది. కారుణ్య శ్రేయాన్స్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై, పోతురాజు నర్సింహారావు, కందిమల్ల సాయితేజ నిర్మాణంలో ఆరంభమైంది. 
 
ఈ కార్యక్రమంలో పాల్గొన్న అమ్మ న్యూస్ ఛానల్ సీఈఓ కంది రామచంద్రారెడ్డి గౌరవ దర్శకత్వం వహించగా, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ క్లాప్ కొట్టారు, రచయిత బిక్కి కృష్ణ స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా వారు చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు.
 
తుమ్మలపల్లి రామ సత్యనారాయణ మాట్లాడుతూ... ఈ సినిమా నిర్మాణంలో నా వంతు  బాధ్యత తీసుకుంటా. మంచి టాలెంట్ ఉన్న ఊర శ్రీను గొప్ప దర్శకుడు అవుతాడు. కంటెంట్ ఉంటే చిన్న సినిమాలు కూడా వంద కోట్లు సాధిస్తున్న రోజులు ఇవి. ఈ సినిమా కూడా అలాంటి విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది.
 
లిరిక్ రైటర్ కళారత్న బిక్కి కృష్ణ మాట్లాడుతూ... సాహిత్య విలువలు ఉన్న పాటలు రాశాను. ఈ సినిమాకు రామసత్యనారాయణ సహకారం ఉంటుంది.  చిత్ర నిర్మాత పోతురాజు నర్సింహారావు మాట్లాడుతూ.. మా అబ్బాయి హీరోగా చేస్తున్నాడు. అందరి సహకారం ఉండాలి. కొత్త తరం నటులను ఆశీర్వదించండి అన్నారు. 
 
డైరెక్టర్ ఊర శ్రీనివాస్ మాట్లాడుతూ, మా సస్పెన్స్ triller అందరిని ఆకట్టుకుంటుంది. త్వరలో ఫస్ట్ షెడ్యూల్ స్టార్ అవుతుందని అన్నారు...
మ్యూజిక్ డైరెక్టర్ శ్రీధర్ ఆత్రేయ మాట్లాడుతూ.. పాటలు బాగా వచ్చాయి. నాలుగు పాటలు ఉన్నాయి. మ్యూజికల్ హిట్ కూడా అవుతుందని నమ్మకం ఉంది. సినిమాను సూపర్ హిట్ చేయాలి. కథ రచయిత సుస్మా ప్రియదర్శిని మాట్లాడుతూ.. థ్రిల్లర్ అండ్ కామెడీ మిక్స్ చేసి తీస్తున్న సినిమా ఇది. అందరిని ఆకట్టుకుని హిట్ అవుతుందన్న నమ్మకం నాకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bapatla, ఇంట్లో అమ్మానాన్నలు ఏమవుతారోనన్న స్పృహ వుంటే ఇలా బైక్ నడుపుతారా, గుద్దేశారు (video)

Kurnool Bus Accident: కర్నూలు ఘటన.. బస్సు ఓనర్ అరెస్ట్

రేవంత్ రెడ్డి ఓ బ్లాక్‌మెయిలర్.. జూబ్లీహిల్స్‌ ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేస్తే అంతే సంగతులు: హరీష్

Pawan Kalyan: అధికారుల పనితీరుపై ఏపీ డిప్యూటీ సీఎం తీవ్ర అసంతృప్తి

తెలంగాణలో కొత్త రాజకీయ సమీకరణాలు.. కొత్త ఉప ముఖ్యమంత్రిగా ఎవరంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments