Webdunia - Bharat's app for daily news and videos

Install App

కె.జి.ఎఫ్‌.2 ట్రైల‌ర్, సినిమా విడుద‌ల‌ను ప్ర‌క‌టించిన య‌ష్‌

Webdunia
గురువారం, 3 మార్చి 2022 (18:13 IST)
KGF 2 poster
రాకింగ్‌ స్టార్ య‌ష్ క‌థానాయ‌కుడిగా న‌టించిన మోస్ట్ అవెయిటెడ్ పాన్ ఇండియా మూవీ KGF Chapter 2. పాన్ ఇండియా డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ, క్రేజీ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలుస్తోన్న ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. KGF Chapter 1 పాన్ ఇండియా రేంజ్ బాక్సాఫీస్ దగ్గ‌ర క్రియేట్ చేసిన సెన్సేష‌న్‌ను ఇప్పుడే ఎవ‌రూ మ‌ర‌చిపోలేం. ఈ దీంతో సెకండ్ పార్ట్‌పై భారీ హైప్స్ క్రియేట్ అయ్యాయి. ఆ అంచ‌నాల‌ను మించేలా భారీ బ‌డ్జెట్‌, స్టార్ క్యాస్టింగ్‌, హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో KGF Chapter 2 సినిమాను రూపొందించారు మేక‌ర్స్‌. 
 
కె.జి.ఎఫ్‌.2  చిత్రాన్ని ఏప్రిల్ 14న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ఇప్ప‌టికే హోంబ‌లే ఫిలింస్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా KGF Chapter 2 ట్రైల‌ర్ డేట్‌కు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న‌న‌ను వెలువ‌రిచారు. మార్చి 27 సాయంత్రం 6 గంట‌ల 40 నిమిషాల‌కు KGF Chapter 2 ట్రైల‌ర్‌ను రిలీజ్ చేస్తున్నారు. ఎన్నాళ్ల నుంచో ఫ్యాన్స్‌, సినీ ప్రేక్ష‌కులు ఎదురు చూస్తున్న ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. చాలా సినిమాలు ట్రైల‌ర్స్ వ‌చ్చేశాయి. కానీ త‌మ అభిమాన హీరో ట్రైలర్ రాక‌పోయినా ఫ్యాన్స్ చాలా న‌మ్మ‌కంతో, ఎగ్జ‌యిట్మెంట్‌తో వెయిట్ చేశారు. హోంబ‌లే ఫిలింస్ వారి నిరీక్ష‌ణ‌కు తెర దించుతూ ప్ర‌క‌ట‌న‌ను ఇచ్చింది. 
 
అదే స‌మ‌యంలో ఇత‌ర సినిమాల రిలీజ్ స‌మ‌యంలో KGF Chapter 2 ట్రైల‌ర్‌ను ప్ర‌ద‌ర్శిస్తారంటూ వ‌చ్చిన వార్త‌ల‌ను నిర్మాణ సంస్థ తోసిపుచ్చింది. అభిమానులు కోరుకున్న‌ట్లే మేక‌ర్స్ ఓ స్పెష‌ల్ డేట్ రోజున KGF Chapter 2 ట్రైల‌ర్‌ను విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.  ప్ర‌స్తుతం నెల‌కొన్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఇత‌ర సినిమాల‌తో క్లాష్ లేకుండా త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుని అడుగులు ముందుకు వేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments