"2పాయింట్ఓ'' పాట అదిరింది.. నా ప్రియమౌ ప్రియమో బ్యాటరివే.. నీ బస్‌కి కండక్ట ర్ నే.. అంటూ? (video)

Webdunia
మంగళవారం, 13 నవంబరు 2018 (15:39 IST)
ప్రముఖ దర్శకుడు శంకర్ రూపొందిన "2పాయింట్ఓ'' సినిమా నవంబర్ 29వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమాకు చెందిన ట్రైలర్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇక నవంబర్ 29వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
 
తాజాగా రోబో సీక్వెల్ తెలుగు వర్షన్‌కు సంబంధించిన లిరికల్ వీడియోను విడుదల చేశారు. "నా ప్రియమౌ ప్రియమో బ్యాటరివే విడిచి వెళ్లిపోవద్దే…. నా ప్రియమౌ ప్రియమో బ్యాటరివే అసలేం తరగొద్దే" అంటూ ఈ పాట వీడియోలో కొనసాగుతోంది. ఈ పాటకు ఏఆర్ రెహ్మాన్ పాటలు అందించారు. 
 
ఈ పాటలో కంప్యూటర్‌కు సంబంధించిన పదాలే అధికంగా వున్నాయి. రోబోస్ రూపంలోని హీరో, హీరోయిన్లు పాడుకునేలా ఈ పాటను ట్యూన్ చేశారు. ''నా వైఫై వైఫే నువ్వే'' అనే పదాలు బాగున్నాయి. అలాగే ''నీ బస్‌కి కండక్టర్ నే" అనే లైన్ రజనీ ఫ్యాన్సును కట్టి పడేస్తోంది. 
 
ఎందుకంటే.. రజనీకాంత్ సినీ పరిశ్రమకు రాకముందు కండక్టర్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ లిరికల్ సాంగ్ నెట్టింట వైరల్ అవుతోంది. రోబో-2ను అత్యద్భుతమైన సాంకేతిక విలువలతో శంకర్ తెరకెక్కించారు. ఈ సినిమా కలెక్షన్ల పరంగా కుమ్మేయనుందని టాక్ వస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విజయవాడ నడిబొడ్డున మావోయిస్టులు - 31 మంది నక్సలైట్లు అరెస్టు

Bengaluru Scam: రూ.32కోట్ల స్కామ్.. ఆమెకు అంత సంపాదన ఎలా వచ్చింది? నెటిజన్ల ప్రశ్న

తెలుగు రాష్ట్రాలను భయపెడుతున్న వర్షాలు.. తీవ్రమైన చలి

రూ.5వేలు ఇస్తామని చెప్పి.. జ్యూస్‌లో మద్యం కలిపారు.. ఆపై సామూహిక అత్యాచారం

అంబులెన్స్‌లో మంటలు... వైద్యుడితో సహా నలుగురి సజీవదహనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments