Webdunia - Bharat's app for daily news and videos

Install App

Yamudu: ఆసక్తి కలిగేలా జగదీష్ ఆమంచి నటించిన యముడు కొత్త పోస్టర్

దేవీ
శనివారం, 26 ఏప్రియల్ 2025 (15:43 IST)
Yamudu new poster
ప్రస్తుతం మైథలాజికల్ టచ్ ఉన్న చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్లు అవుతున్న సంగతి తెలిసిందే.  ఈ క్రమంలో జగన్నాధ పిక్చర్స్ పతాకంపై జగదీష్ ఆమంచి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం ‘యముడు’. ధర్మో రక్షతి రక్షితః అనే ఉప శీర్షిక. ఈ చిత్రంలో శ్రావణి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్టర్‌ను మేకర్లు రిలీజ్ చేశారు.
 
ఇది వరకు రిలీజ్ చేసిన ‘యముడు’ టైటిల్ పోస్టర్, దీపావళి స్పెషల్‌గా రిలీజ్ చేసిన పోస్టర్లు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా మరో పవర్ ఫుల్ పోస్టర్‌ను మేకర్లు రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో యుముడి రూపంలో జగదీష్ అందరినీ భయపెట్టించేశారు. వెనకాల ఉన్న మహిషాకారం, యముడి చేతికి ఉన్న సంకెళ్లు ఇలా అన్నీ కూడా గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి.
 
హీరోయిన్‌ను యమపాశంతో కట్టి పడేసిన తీరు, యముడి ఆహార్యంలో హీరో కనిపించిన తీరు చూస్తే రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే అనేలా ఉన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో చిత్రయూనిట్ బిజీగా ఉంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pahalgam: ఎల్ఓసి వద్ద ఉద్రిక్తత.. భూగర్భ బంకర్లను శుభ్రం చేస్తున్నారు..

35 తుపాకులు సిద్ధం చేసుకోండి?: గుర్రాలపై తీసుకెళ్లిన వ్యక్తి ఫోన్ సంభాషణ

Lecturer: లెక్చరర్‌ రాజీనామా: చెప్పుతో దాడి చేసిన విద్యార్థిని సస్పెండ్

కర్రెగుట్టలో భారీ ఎన్‌కౌంటర్‌: ఎన్‌కౌంటర్‌లో 28 మంది మావోల మృతి

మరో మహిళతో భర్త అక్రమ సంబంధం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments