Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

Advertiesment
Rajesh Konchada, Sravani Shetty and others

దేవీ

, శనివారం, 5 ఏప్రియల్ 2025 (18:31 IST)
Rajesh Konchada, Sravani Shetty and others
స్వచ్చమైన వింటేజ్ విలేజ్ లవ్ ఎమోషనల్ డ్రామాల లోటుని భర్తీ చేసేందుకు ‘కౌసల్య తనయ రాఘవ’ చిత్రం రాబోతోంది. రాజేష్ కొంచాడా, శ్రావణి శెట్టి నటీనటులుగా ఏఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై కుటుంబమంతా కలిసి చూసే మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా అడపా రత్నాకర్ నిర్మిస్తున్న ఈ మూవీకి స్వామి పట్నాయక్ కథ, కథనం, దర్శకత్వం బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు.
 
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు, టీజర్‌, సాంగ్స్ అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో శనివారం ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఆర్కే నాయుడు, చంటి, నిర్మాత రత్నాకర్ సంయుక్తంగా ఈ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇక ఈ ట్రైలర్‌ను ఓపెన్ చేసిన తీరు.. కథను చెప్పిన తీరు.. పాత్రల్ని పరిచయం చేసిన విధానం బాగుంది.
 
సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారని అర్థం అవుతోంది. ఓ ఊరు.. అందులో హీరో, హీరోయిన్, విలన్ పాత్ర.. అయితే ఈ చిత్రంలో మాత్రం ప్రేమతో పాటుగా మంచి సందేశాన్ని ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. చదువు ముఖ్యమని అంతర్లీనంగా సందేశాన్ని ఇచ్చాడు దర్శకుడు. 80వ దశకంలో జరిగిన కథను తెరపై మరింత అందంగా మల్చినట్టు అనిపిస్తుంది.
 
కౌసల్య తనయ రాఘవ చిత్ర ట్రైలర్‌లో విజువల్స్, మ్యూజిక్ ఎంతో నేచురల్‌గా ఉన్నాయి. యోగి రెడ్డి కెమెరా వర్క్ నాటి కాలానికి తీసుకెళ్లినట్టుగా అనిపిస్తుంది. రాజేష్ రాజ్ తేలు మ్యూజిక్ ఎంతో వినసొంపుగా ఉంది. ఈ ట్రైలర్‌లో మ్యూజిక్, విజువల్స్ అయితే అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమాను ఏప్రిల్ 11న రిలీజ్ చేసేందుకు దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. 
 
దర్శకుడు స్వామి పట్నాయక్ మాట్లాడుతూ .. ‘కౌసల్య తనయ రాఘవ సినిమా అద్భుతంగా వచ్చింది. నాకు సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. నిర్మాత రత్నాకర్ ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. రాజేష్, శ్రావణి, ఆర్కే నాయుడు ఇలా అందరూ అద్భుతంగా నటించారు. మా చిత్రం ఏప్రిల్ 11న రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
 
నిర్మాత రత్నాకర్ మాట్లాడుతూ,  ఈ చిత్రాన్ని స్వామి పట్నాయక్ అద్భుతంగా తెరకెక్కించారు. రాజేష్, శ్రావణి చక్కగా నటించారు. మా చిత్రం ఏప్రిల్ 11న విడుదల కానుంది. అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.
 
నటుడు ఆర్కే నాయుడు, మనీషా, లోహిత్, చంటి మాట్లాడుతూ, మదర్ సెంటిమెంట్‌ను చక్కగా చూపించారు.  సినిమాను అందరూ చూడండి’ అని అన్నారు.
 
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సంతోష్ మాట్లాడుతూ, ఈ చిత్రంలో ప్రతీ సీన్ అద్భుతంగా ఉంటుంది. డైరెక్టర్ అద్భుతంగా తీశారు. ఇందులో ఏ ఒక్కరూ నటించలేదు. అందరూ తమ తమ పాత్రల్లో జీవించేశారు. కెమెరావర్క్, మ్యూజిక్ చాలా రిచ్‌గా ఉంటుంది’ అని అన్నారు
 
మ్యూజిక్ డైరెక్టర్ రాజేష్ రాజ్ తేలు మాట్లాడుతూ, మ్యూజిక్ అద్భుతంగా వచ్చింది. ఆర్ఆర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. నాకు అవకాశం ఇచ్చిన రత్నాకర్ గారికి, స్వామి పట్నాయక్ గారికి థాంక్స్’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్