Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిజమైన ప్రేమ కథతో విడుదలకు సిద్దంగా కౌసల్య తనయ రాఘవ

Advertiesment
Rajesh Konchada - Shravani Shetty

డీవీ

, బుధవారం, 10 ఏప్రియల్ 2024 (08:54 IST)
Rajesh Konchada - Shravani Shetty
ఫీల్ గుడ్, వింటేజ్ విలేజ్ లవ్ స్టోరీలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. అలాంటి ఓ మంచి గ్రామీణ ప్రేమ కథా చిత్రంగా రాజేష్ కొంచాడా, శ్రావణి శెట్టి హీరో హీరోయిన్ల గా నటించిన  ‘కౌసల్య తనయ రాఘవ’ అనే మూవీ రాబోతోంది. ఏఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై కుటుంబమంతా కలిసి చూసే మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఒక మనిషికి మనిషి ఇచ్చే విలువలు మీద,  ఒక మనసుకి ఇంకొక మనసు మీద ఉండే నిజమైన ప్రేమ మీద 1980 వ  సంవత్సరం నేపథ్యంలో జరిగే ఓ అందమైన కుటుంబ ప్రేమ కథే ఈ ‘కౌసల్య తనయ రాఘవ’. 
 
అడపా రత్నాకర్ నిర్మిస్తున్న ఈ మూవీకి స్వామి పట్నాయక్ కథ, కథనం, దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పాటలను మ్యాంగో మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్‌లో రిలీజ్ చేయగా మంచి స్పందన వచ్చింది.  ఈ కౌసల్య తనయ రాఘవ షూటింగ్ అంతా పాలకొండ పరిసర ప్రాంతాల్లో పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చివరి దశలో ఉంది. మరి కొన్ని రోజుల్లో ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ డేట్‌ని మేకర్లు ప్రకటించనున్నారు. 
 
ఈ చిత్రానికి రాజేష్ రాజ్ తేలు సంగీతమందించగా.. యోగి రెడ్డి కెమెరామెన్‌గా పని చేశారు. శ్రీ కృష్ణ ప్రసాద్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తించగా.. అర్జిత్ అజయ్ సాహిత్యాన్ని అందించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జెర్సీ డైరక్టర్‌తో విజయ్ దేవరకొండ.. శ్రీలీల స్థానంలో భాగ్యశ్రీ?