Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా సాధికారత గురించి సూపర్ స్టార్స్ చెప్పడాని రావడం చాలా ఆనందంగా ఉంది : కాజల్ అగర్వాల్

Webdunia
మంగళవారం, 17 అక్టోబరు 2023 (18:38 IST)
Kajal Aggarwal
నందమూరి బాలకృష్ణ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘భగవంత్ కేసరి'. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీలీల కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్, పాటలు, ట్రైలర్ ప్రతి ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేశాయి. భగవంత్ కేసరి దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదల కానున్న నేపధ్యంలో హీరోయిన్  కాజల్ అగర్వాల్ విలేకరుల సమావేశంలో ‘భగవంత్ కేసరి’ విశేషాలని పంచుకున్నారు.

‘భగవంత్ కేసరి'లో మీరు చేసిన కాత్యాయని పాత్ర ఎలా వుంటుంది ?
కాత్యాయని ఒక సైకాలజిస్ట్. చాలా స్మార్ట్, ఇంటెలిజెంట్. అలాగే నా పాత్ర చాలా సరదాగా వుంటుంది. నా పాత్రలో చాలా హ్యుమర్ వుంటుంది. ఈ పాత్ర చేస్తున్నపుడు చాలా ఎంజాయ్ చేశాను.  

‘భగవంత్ కేసరి' స్త్రీశక్తి, మహిళా సాధికారతని చాటే కథని తెలుస్తుంది. ఇలాంటి కథలో భాగం కావడం ఎలా వుంది ?  
ఈ కథని ఎంచుకోవడానికి కారణం ఇదే. ‘భగవంత్ కేసరి' కాన్సప్ట్ నాకు చాలా నచ్చింది. ఆడపిల్లని ధైర్యంగా పెంచడం, అలాగే మహిళా సాధికారత గురించి మాట్లాడే అవసరం ప్రస్తుత సమాజంలో వుంది. మన సూపర్ స్టార్స్ ఇలాంటి కథలు చెప్పడాని ముందుకు రావడం చాలా ఆనందాన్ని ఇస్తుంది. నా పాత్ర ఎలా వుందో అని కాకుండా  ఈ కథ చెప్పాల్సిన అవసరం వుందని చేసిన సినిమా ఇది.  ఇలాంటి మంచి సందేశం ప్రజల్లోకి వెళ్ళాలి. అలాంటి ఓ గొప్ప సినిమాలో భాగం కావడం ఆనందం వుంది.

బాలకృష్ణ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించిది ?
బాలకృష్ణ చాలా స్వీట్ అండ్ ఫ్రెండ్లీ. ఆయనకు గొప్ప సెన్స్ ఆఫ్ హ్యూమర్ వుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన చాలా నిజాయితీ గల మనిషి. ఆయనతో వర్క్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. మా మధ్య కొన్ని ఫన్నీ సీన్స్ వున్నాయి. ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు.

అనిల్ రావిపూడి గారి రైటింగ్, డైరెక్షన్ స్టైల్ గురించి ?
అనిల్ రావిపూడి గారి సినిమాలని చాలా ఇష్టపడతాను. ఆయన టైమింగ్, సెన్స్ ఆఫ్ డైరెక్షన్ చాలా బావుంటాయి. ఎఫ్ 2. ఎఫ్ 3 సినిమాలని చాలా ఎంజాయ్ చేశాను. ‘భగవంత్ కేసరి'లో ఆయన స్టైల్ వినోదం ఉంటూనే ఒక బలమైన సందేశం కూడా వుంటుంది. ఇది తనకి చాలా ప్రత్యేకమైన సినిమా అవుతుంది.

శ్రీలీల తో కలిసి వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
శ్రీలీల చాలా టాలెంటెడ్. చాలా ఎనర్జిటిక్ గా వుంటుంది. సెట్స్ లో చాలా యాక్టివ్ గా వుంటుంది. మంచి పాత్రలు చేయాలనే తపన తనలో వుంది. ఇందులో తను చేసిన విజ్జి పాప పాత్ర కథలో చాలా కీలకం. ఖచ్చితంగా ఈ పాత్ర తనకి మంచి పేరు తీసుకొస్తుంది. తనకు చాలా మంచి భవిష్యత్ వుంటుంది.

తమన్ గారి మ్యూజిక్ గురించి ?
తమన్ చాలా వండర్ ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ఇప్పటికే పాటలు చాలా పెద్ద హిట్స్ అయ్యాయి. నేపధ్య సంగీతం చాలా గ్రాండ్ గా వుంటుంది. థియేటర్స్ లో ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు.

షైన్ స్క్రీన్స్  నిర్మాత ల గురించి ?
హరీష్ , సాహూ గారు చాలా ప్యాషనేట్ ప్రోడ్యూసర్స్. ఎక్కడా రాజీపడకుండా సినిమాని చాలా గ్రాండ్ తీశారు. షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్స్ లో పని చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.  

‘భగవంత్ కేసరి' ఎలా ఉండబోతుంది ?
‘భగవంత్ కేసరి' పవర్ ప్యాక్డ్ మూవీ. ఎమోషన్స్, యాక్షన్ చాలా అద్భుతంగా వుంటాయి. బలమైన  సందేశం కూడా వుంది. అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది.

కొత్తగా చేస్తున్న సినిమాలు ?
సత్యభామ సినిమా పూర్తి చేయాలి. అలాగే కమల్ హాసన్ గారి ఇండియన్ 2 లో చాలా డిఫరెంట్ రోల్ చేస్తున్నాను. వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్ట్స్ కూడా వున్నాయి.

<>

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pune: బస్సులో వేధిస్తావా? పీటీ టీచర్ మజాకా.. 25సార్లు చెంప ఛెల్లుమనిపించింది.. (video)

ఫార్ములా ఈ రేస్‌ వ్యవహారంలో కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు

వైసీపీకి వర్మకు ఉన్న సంబంధం అదే.. జీవీ రెడ్డి ఏమన్నారు..?

Srinivas Goud: తిరుమల కొండపై టీటీడీ వివక్ష చూపుతోంది.. ఇది సరికాదు.. శ్రీనివాస్ గౌడ్ (video)

Sujana Chowdary: సుజనా చౌదరి సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారుగా... విమర్శకులకు చెక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments